newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

తెలంగాణలో మళ్ళీ వైరస్ వ్యాప్తి.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

30-09-202030-09-2020 12:12:22 IST
Updated On 30-09-2020 12:48:44 ISTUpdated On 30-09-20202020-09-30T06:42:22.959Z30-09-2020 2020-09-30T06:42:11.362Z - 2020-09-30T07:18:44.723Z - 30-09-2020

తెలంగాణలో మళ్ళీ వైరస్ వ్యాప్తి.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,103 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 11 మంది మరణించారు. 2,243 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,91,386కు చేరుకుంది. ఇందులో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,60,933గా నమోదైంది. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 1127కు చేరుకుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసులు 29,326గా నమోదు అయ్యాయి. ఐసొలేషన్‌లో 23,880 మంది చికిత్స పొందుతున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించింది. కొత్తగా 298 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్-24, భద్రాద్రి కొత్తగూడెం-102, జగిత్యాల-46, జనగామ-29, జయశంకర్ భూపాలపల్లి-25, జోగుళాంబ గద్వాల-13, కామారెడ్డి-53, కరీంనగర్-103, ఖమ్మం-93, కొమరంభీమ్ ఆసిఫాబాద్-26, మహబూబ్ నగర్-45, మహబూబాబాద్-45, మంచిర్యాల-27, మెదక్-30, మేడ్చల్ మల్కాజ్‌గిరి-176, ములుగు-31, నాగర్ కర్నూలు-32, నల్లగొండ-141, నారాయణపేట్-8, నిర్మల్-24, నిజామాబాద్-57, పెద్దపల్లి-31, రాజన్న సిరిసిల్ల-40, రంగారెడ్డి-172, సంగారెడ్డి-63, సిద్ధిపేట్-92, సూర్యాపేట్-51, వికారాబాాద్-24, వనపర్తి-41, వరంగల్ రూరల్-35, వరంగల్ అర్బన్-85, యాదాద్రి భువనగిరి-31 కేసులు నమోదు అయ్యాయి.

దీన్ని బట్టి చూస్తుంటే తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు కాస్తా ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో నమోదవుతూ ఉన్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. అన్ లాక్ లో భాగంగా అన్నీ తెరుస్తూ ఉండడంతో ప్రజలు కూడా బాగా తిరుగుతూ ఉన్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా తిరుగుతూ ఉన్న వారి వలన కరోనా వ్యాప్తి జరుగుతూ ఉంది. 

తెలంగాణలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ప్రభుత్వం కాస్త దూకుడుగా ప్రవర్తిస్తోంది. ప్రతి రోజూ 50 నుంచి 60 వేల వరకు టెస్టులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కరోనా రోజువారీ నిర్ధారణ పరీక్షల సంఖ్య 30 లక్షలకు చేరువైంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా 29,96,001 పరీక్షలను నిర్వహించినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

   2 hours ago


ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

   4 hours ago


పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

   4 hours ago


టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

   19 hours ago


వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

   19 hours ago


దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

   a day ago


నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

   a day ago


సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

   25-10-2020


సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

   25-10-2020


ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని

   25-10-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle