newssting
Radio
BITING NEWS :
పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ నాన్చుడు కసరత్తు.. ఇది కూడా పాయే..

14-01-202114-01-2021 15:44:48 IST
2021-01-14T10:14:48.414Z14-01-2021 2021-01-14T05:44:37.515Z - - 20-01-2021

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ నాన్చుడు కసరత్తు.. ఇది కూడా పాయే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశంలోనూ ఒకటే విధంగా ఉంది. చాలా రాష్ట్రాల్లోనూ అదే విధంగా ఉంది. బలమైన క్యాడర్ ఉన్నా.. బలమైన లీడర్ లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా మారిపోయింది. అలాగని చెప్పి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటుందా..? అంటే ఇజ్జత్ కా సవాల్ ఆయే..! పోటీ చేయడం.. ఓటమిని మూటగట్టుకోవడం.. అలాగని పార్టీలో మార్పులకన్నా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అంటే.. అది కూడా జరక్కపాయే.. ఎప్పుడు చూసినా నాన్చుడు ధోరణేనా అని కార్యకర్తల్లో కూడా అసహనం మొదలైంది. 

ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ వ్యవహారంలో ఎటువంటి మార్పు కూడా రావడం లేదు.  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో.. అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ఖరారు చేసి ప్రచారంలోకి దిగిపోయాయి. కానీ కాంగ్రెస్ తీరు మాత్రం ఎప్పటి లాగే ఉంది.  

వరంగల్, ఖమ్మం, నల్గొండ…మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైద్రాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. టిఆర్ఎస్ అభ్యర్థుల విషయంలో ఎంతో క్లారిటీగా ఓ నిర్ణయం తీసుకుని ప్రచారాన్ని సైతం ప్రారంభించింది. వరంగల్ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మరోసారి అవకాశం ఇచ్చారు. మహబూబ్ నగర్ స్థానంలో మేయర్ బొంతు రాంమోహన్ ను ప్రకటించారు. బీజేపీ కూడా ఎమ్మెల్సీ రామచందర్ రావు కు మళ్ళీ పోటీచేసే ఛాన్స్ ఇచ్చింది.  నల్గొండ, ఖమ్మం, వరంగల్ కు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరు ఖరారు చేసింది. దాంతో వారంతా ఇప్పటికే జిల్లాల వారిగా ఎన్నికల సన్నాహక సమావేశాలు ప్రారంభించారు. 

కాంగ్రెస్ మాత్రం అసలు అభ్యర్థుల్ని ఖరారు చేద్దామా వద్దా అనే సంశయంలో ఉండి నాన్చుతూ వెళుతోంది. ముఖ్యనేతలు మూడు నుంచి నాలుగు పేర్లతో ఆశావహుల జాబితాను తయారు చేస్తున్నారు. వాటిని హైకమాండ్‌కు పంపుతారు. మళ్లీ వాటిపై చర్చ జరుగుతోంది. ఇలానే సాగుతూ వెళ్తే కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లడం కూడా కష్టమే.. తిరిగి పూర్వ వైభవం రావడం కూడా కష్టమే..! ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ లోని ఈ నాన్చుడు ధోరణిలో మార్పు రావాల్సిందే..! 

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

   3 hours ago


తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

   3 hours ago


ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

   5 hours ago


దేవినేని ఉమ విడుదల..!

దేవినేని ఉమ విడుదల..!

   7 hours ago


ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

   8 hours ago


'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

   8 hours ago


ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

   10 hours ago


బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

   12 hours ago


మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

   13 hours ago


ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

   15 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle