newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ భవన్ లో సంబరాలు.. చేతిలో గన్ తో టీఆర్ఎస్ నేత

21-03-202121-03-2021 17:47:50 IST
2021-03-21T12:17:50.086Z21-03-2021 2021-03-21T07:11:31.483Z - - 16-04-2021

తెలంగాణ భవన్ లో సంబరాలు.. చేతిలో గన్ తో టీఆర్ఎస్ నేత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏవైనా సంబరాల్లో గన్నులతో గాల్లోకి కాల్చడం వంటివి సినిమాల్లో చూసే ఉంటాం. ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో అలాంటి సంస్కృతి ఎలాగూ ఉంది. తాజాగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో అలాంటి ఘటన ఒకటి కనిపించింది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్థి సురభి వాణీదేవి విజయం సాధించగా,  నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచారు. దీంతో అభిమానుల్లోనూ, ఆ పార్టీ నాయకుల్లోనూ సంతోషం ఎక్కువైంది. ఇంతకు ముందు తెలంగాణలో జరిగిన కొన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ ను బీజేపీ ఖంగు తినిపించింది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ హవా కనిపించలేదు. దీంతో టీఆర్ఎస్ నాయకులు ఫుల్ జోష్ లో ఉన్నారు. అలాంటి సమయంలో ఓ టీఆర్ఎస్ నేత తుపాకీతో కనిపించి కాస్త టెన్షన్ పెట్టాడు. 

గ్రేటర్  మాజీ అధ్యక్షుడు  కట్టెల శ్రీనివాస్ యాదవ్  తుపాకీ తో  హల్ చల్ చేశాడు. శనివారం నాడు తెలంగాణ భవన్లో MLC ఎన్నికల గెలుపు సంబరాల్లో  గన్ బయటికి  తీశారు శ్రీనివాస్ యాదవ్. గాల్లోకి కాల్పులు  జరిపే  ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్న వారు వారించడంతో  గన్ ను లోపల పెట్టుకున్నారు  కట్టెల శ్రీనివాస్ యాదవ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయంతో సంబరాలు చేసుకున్న టీఆర్‌ఎస్ శ్రేణులు శ్రుతిమించాయి. కార్యకర్తలు, నేతల అత్యుత్సాహం కారణంగా తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. టపాసులు కాల్చడంతో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. సంబరాల్లో చిందేసిన శ్రీనివాస్ యాదవ్ మరింత అతి చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన వేడుకలకు హాజరైన కట్టెల శ్రీనివాస్ యాదవ్ ఒక్కసారిగా తుపాకీ బయటికి తీశారు. పైకెత్తి అందరికీ చూపిస్తూ హల్‌చల్ చేశారు. గాల్లోకి కాల్పులు జరిపేందుకు యత్నించారు. నేతలు వారించడంతో గన్‌ లోపల పెట్టేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. శ్రీనివాస్‌ యాదవ్‌కు అసలు ఆ గన్‌ ఎక్కడిది, ఎవరు ఇచ్చారు అనేది అందరిలోనూ వస్తున్న ప్రశ్న. కానీ అది లైసెన్స్‌డ్ తుపాకీ‌ అని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   13 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   9 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   11 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   16 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   20 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle