newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఓటు వేయకుంటే బాగుపడరన్న మంత్రి

06-03-202106-03-2021 16:38:23 IST
2021-03-06T11:08:23.238Z06-03-2021 2021-03-06T11:08:17.933Z - - 11-04-2021

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఓటు వేయకుంటే బాగుపడరన్న మంత్రి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్న వారు టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకుంటే బాగుపడరని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేసిన‌ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జడ్చర్లలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభలో మంత్రి మాట్లాడుతూ.. ‘అన్నీ తిని ఓటు వేయకుంటే మీకే నష్టం జరుగుతుంది. ఆ కుటుంబం బాగుపడదు. స్పృహలో ఉండి ఓట్లు వేయాలి’ అని వ్యాఖ్యలు చేశారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉండి, మీ అందరి మంచి చెడు చూసేటోళ్లము తామేనని.. అందుకే తమను ఆదరించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపిస్తే మరింత కష్టపడి పనిచేస్తామని అన్నారు. సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, సురభి వాణీదేవి  పాల్గొన్నారు.

హైద‌రాబాద్‌-రంగారెడ్డి-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మహబూబ్‌న‌గ‌ర్ జిల్లా ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులతో  శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌న‌గ‌ర్‌లో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సురభి వాణీదేవికి మొదటి ప్రాధాన్య ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, న‌ల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. శనివారం ఎమ్మెల్సీ ఎన్నికలపై మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో వార్డులు, బూత్‌ల వారీగా సమీక్ష నిర్వహించారు. బూత్‌లు, వార్డుల వారీగా ఉన్న ఓట్లు, ఇన్‌చార్జిలు, ఇప్పటి వరకు నిర్వహించిన ప్రచార కార్యకలాపాలపై చర్చించారు. ఓట్లు టీఆర్ఎస్‌ అభ్యర్థి రాజేశ్వర్‌రెడ్డికే పడాలని.. పార్టీ ఓట్లు చీలకుండా చూడాలని సూచించారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పతకాలను వివరించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 1,32,899 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వ రంగంలోనూ ఉపాధి, ఉద్యోగావకాశాలను పెంపొందించినట్లు తెలిపారు. బీజేపీ ప్రజలను మభ్యపెడుతూ అసత్య ప్రచారాలు చేస్తోందని.. బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిందా? అని ప్రశ్నించారు. మన ఇంటి పార్టీ, మన ఉద్యమ పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ టీఆర్‌ఎస్‌ అని అన్నారు. తెలంగాణను ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో బంగారు మయం చేస్తున్న కేసీఆర్‌ కంటే మెరుగైన సీఎం దేశంలో ఎవరూ లేరన్నారు. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   16 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   12 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   14 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   19 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   21 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle