ఆయన కోట్లిచ్చి తప్పుడు వార్తలు రాయిస్తుండు.. పుట్టా మధు సంచలన వ్యాఖ్యలు
20-02-202120-02-2021 18:59:49 IST
Updated On 21-02-2021 08:24:23 ISTUpdated On 21-02-20212021-02-20T13:29:49.121Z20-02-2021 2021-02-20T12:06:58.422Z - 2021-02-21T02:54:23.625Z - 21-02-2021

హైకోర్టు న్యాయవాది వామనరావు దంపతుల హత్యకేసు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.. మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధుకు ఈ హత్యకేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయి.. కేసులో సంబంధమున్న పుట్టా మధు అనుచరులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై పుట్టా మధు ఘాటుగా స్పందించారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబుపైనా పనిలో పనిగా మీడియాపైనా మాటల తూటాలు పేల్చారు. అసలు ఇన్వెస్టిగేషన్ మీడియా చేయాలా..? పోలీసులు చేయాలో ఆలోచించుకోవాలని సూచించారు. మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పుట్ట మధును లోపల వేస్తారా అని కొన్ని టీవీల్లో, పత్రికల్లో ఇష్టమొచ్చినట్లు రాస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుపై ఓ రేంజ్లో మధు విరుచుకుపడ్డారు. స్థానిక విలేకరులతో సంబంధం లేకుండా కొన్ని మీడియా సంస్థలు శ్రీధర్‌బాబుకు అమ్ముడుపోయి తనను టార్గెట్ చేశాయని ఆరోపించారు. పనిలోపనిగా బీసీ కార్డును పుట్టా మధు తెరపైకి తెచ్చారు. తాను బీసీ బిడ్డనైనందుకు తనను టార్గెట్ చేశారని, త్వరలో హైదరాబాద్‌లో మీటింగ్ పెట్టిమరీ మీడియా బండారం అంతా బయటపెడతానని అన్నారు. అసలు సీఎం కేసీఆర్, కేటీఆర్‌ల అపాయింట్ మెంట్ తాను అడగలేదని, కానీ కొన్ని మీడియాల్లో కేసీఆర్, కేటీఆర్‌లు పుట్టా మధుకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని, అసలు నేను మంథనిలోనే లేనని తప్పుడు వార్తలు రాస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీనైన తాను జెడ్పీ చైర్మన్ కావడాన్ని జీర్ణించుకోలేక విషప్రచారం చేస్తున్నారని, శ్రీధర్‌బాబు కుట్రలను తిప్పికొడతానని మధు అన్నారు. పోలీసులను విచారణ చేయనిస్తారా..? శ్రీధర్‌బాబు చేస్తారా..? అంటూ పుట్టమధు ప్రశ్నించారు. నేను వజ్రాన్ని.. మోసగాన్ని కాదంటూ మధు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పోరాటం ఆగేది లేదని, నా ప్రజల కోసం మాత్రమే ఉంటా.. మోసగాళ్ల కోసం ఉండనన్నారు. నా పిల్లలు స్థిరపడ్డారని, ప్రజలు, టీఆర్ ఎస్ కోసం నేను, నా భార్య జీవితం అంకితమంటూ మధు వ్యాఖ్యానించారు.

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
7 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
9 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
10 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
10 hours ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
11 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
11 hours ago

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత
11 hours ago

పవన్ కి విశాఖలో అడుగు పెట్టే ధైర్యం లేదా
2 hours ago

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న
9 hours ago

డాక్టర్ చిరంజీవి కొల్లూరి కన్నుమూత..!
13 hours ago
ఇంకా