newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

14-05-202114-05-2021 09:50:36 IST
Updated On 14-05-2021 10:50:31 ISTUpdated On 14-05-20212021-05-14T04:20:36.067Z14-05-2021 2021-05-14T04:20:12.752Z - 2021-05-14T05:20:31.452Z - 14-05-2021

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏమో.. ష‌ర్మిల‌క్క తీరే వేరు. ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ్వ‌రికీ అర్దం కాదు. ఏదేదో అనుకుని వ‌స్తే.. ఇంకేదో అవుతుండ‌డంతో.. ష‌ర్మిల‌క్క‌య్య‌కి ఫ్ర‌స్ట్రేష‌న్ త‌ప్ప‌డం లేదు అంటున్నారు. లీడ‌ర్లు అంతా.. గ‌ప్ చుప్ గా ఉన్న టైంలో.. హ‌డావిడి చేయ‌డం.. హ‌డావిడి  చేసే టైంలో గ‌ప్ చుప్ గా ఉండ‌డం లాంటి ప‌నుల్తో.. ష‌ర్మిల‌క్క‌య్య త‌న తీరే వేరు అన్న‌ట్లుగా ఉన్నార‌ని.. త‌లో మాటా అనుకుంటున్నారు.

యాక్చువ‌ల్ గా అక్క‌య్య పార్టీ గురించి బిజీ అయిపోవాలి అనుకున్న టైంలో క‌రోనా వేవ్ పెరిగింది. అయినా త‌గ్గ‌లేదు. కానీ.. చుట్టూ ఉన్న వారికి క‌రోనా వ‌స్తుంది అని.. దీక్ష‌లు గ‌ట్రా క్లోజ్ అన్నారు. ఆ త‌ర్వాత మాయం అయిపోయారు. ఇప్పుడు స‌డ‌న్ గా ఎంట్రీ ఇచ్చారు ష‌ర్మిల‌క్క‌య్య‌. ఇప్పుడు దీక్ష‌లు,  స‌భ‌లు, యాత్ర‌ల‌కి స్పేస్ లేదు క‌దా. సోష‌ల్ మీడియానే ఆప్ష‌న్ కాబట్టి.. త‌ను కూడా అదే వే లో మూవ్ అవుతున్నారు.  చిన్న సారు పెద్ద సారు అంటే.. సీఎం కేసీఆర్, మినిస్ట‌ర్ కేటీఆర్ పై పంచులు దంచుతున్నారు.

రాష్ట్రంలో  ఏం జ‌రుగుతుందో  చూస్తున్నారా.. అస‌లు ప‌ట్టించుకుంటున్నారా. పేద‌ల ప్రాణాలంటే విలువ లేదా.. మ‌నుషులంటే లెక్క లేదా. వారి బ‌తుకులు ఏం కావాలి. సీఎంలు గా మినిస్ట‌ర్లు గా ఉండి ఏం చేస్తున్నారు. జ‌నం ప్రాణాల‌తో ఇంకెంత కాలం చెల‌గాటం ఆడుతారు. క‌రోనా వ‌చ్చిన వారికి ఇంజ‌క్ష‌న్లు కూడా దొర‌క‌డం లేదు. 4 వేలు కూడా లేని ఇంజ‌క్ష‌న్ ను 40 వేల‌కి అమ్ముతుంటే పట్టించుకోరా.. జ‌నం ఆక్సిజ‌న్ అందక చ‌స్తుంటే.. మీరు ఏం చ‌ర్య‌లు తీసుకుంటున్నారు అంటూ..  సీఎం కేసీఆర్, మినిస్ట‌ర్ కేటీఆర్ ని క‌లిపి.. చెడా మ‌డా అనేశారు.

పేప‌ర్ల‌లో వ‌చ్చిన వార్తను పోస్ట్ చేస్తూ.. నానా మాటలూ అన్నారు ష‌ర్మిల‌క్క‌య్య‌. త‌ను అన్న మాట‌ల్లో త‌ప్పేం లేదు. మాట‌లు ఎగ్జాక్ట్ గా ఇవే కాకున్నా.. ఇలాంటి  ఉద్దేశం వినిపించే  మాట‌లే అన్నారు. సో..అందులో త‌ప్పేముంది. జ‌నం త‌రుపున మాట్లాడారు అనుకోవ‌చ్చు. కానీ.. స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కి ఏమైంది. ఇలా రియాక్ట్ అవుతున్నారేంటి అన్న‌ది ఇప్పుడు పొలిటిక‌ల్ గా హాట్ టాపిక్ అయింది.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle