newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

ష‌ర్మిల ఖమ్మం టూర్ వాయిదా..! అడ్డుప‌డిందెవ‌రు?

13-02-202113-02-2021 19:04:26 IST
Updated On 13-02-2021 17:33:08 ISTUpdated On 13-02-20212021-02-13T13:34:26.779Z13-02-2021 2021-02-13T11:58:15.599Z - 2021-02-13T12:03:08.855Z - 13-02-2021

ష‌ర్మిల ఖమ్మం టూర్ వాయిదా..! అడ్డుప‌డిందెవ‌రు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె, ప్ర‌స్తుత ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చెల్లెలు వై.ఎస్‌. ష‌ర్మిల తెలంగాణ రాజ‌కీయాల‌పై దృష్టిసారించారు. రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టేందుకు ఆమె స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల లోట‌స్‌పాండ్‌లోని త‌న నివాసంలో ఆమె తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల‌కు చెందిన వైఎస్ఆర్ అభిమానుల‌తో భేటీ అయ్యారు. తొలిరోజు న‌ల్గొండ జిల్లాలోని వైఎస్ ఆర్ అభిమానుల‌తో భేటీ అయిన ఆమె.. మ‌రుస‌టి రోజు ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని వైఎస్ఆర్ అభిమానుల‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ‌లో కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది..? వి‌ధివిధానాలు ఎలా ఉండాలఅనే అంశాల‌పై చ‌ర్చించారు. 

ఈ స‌మావేశంలో భాగంగా ఖ‌మ్మంజిల్లాలో రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ఆమె ఆరాతీశారు. జిల్లాలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, త‌దిత‌ర అంశాల‌పై ష‌ర్మిల తెలుసుకున్నారు. ముఖ్యంగా జిల్లాలో గిరిజ‌నులు పోడు భూముల స‌మ‌స్య‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని వైఎస్ ఆర్ అభిమానులు ష‌ర్మిల దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో ఈనెల 21న ఖ‌మ్మంలో ప‌ర్య‌టించేందుకు ఆమె నిర్ణ‌యించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో గిరిజ‌న ప్ర‌జ‌ల‌తో స‌మావేశం అయ్యి వారి ఇబ్బందులు తెలుసుకోవ‌టంతో పాటు.. ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలోని వైఎస్ ఆర్ అభిమానుల‌తో ఆమె స‌మావేశం నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌య్యారు. లోట‌స్‌పాండ్ నుంచి ఖ‌మ్మం వ‌ర‌కు భారీ కార్ల ర్యాలీ నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించారు.  

తాజాగా ష‌ర్మిల ఖ‌మ్మం ప‌ర్య‌ట‌న వాయిదాప‌డింది. దీని వెనుక ప‌లు కార‌ణాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ష‌ర్మిల ప‌ర్య‌ట‌న‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ అడ్డంకిగా మారింద‌ట‌. అయినా ఖ‌మ్మంలో ఈనెల 21న ప‌ర్య‌టించేందుకు త‌మ‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని ష‌ర్మిల‌, కొండా రాఘ‌వ‌రెడ్డిలు డీజీపీని కోరారు. విన‌తిప‌త్రంసైతం అందించిన‌ట్లు తెలుస్తోంది. కానీ డీజీపీ అందుకు ఒప్పుకోలేద‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ ఉన్న క్ర‌మంలో ఎలాంటి స‌మావేశాలు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని, తాము ఎలాంటి అనుమ‌తి ఇవ్వ‌లేమ‌ని డీజీపీ తేల్చిచెప్పార‌ట‌. దీంతో చేసేదేమీ లేక ష‌ర్మిల 21న ఖ‌మ్మం ప‌ర్య‌ట‌న వాయిదా వేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల త‌రువాత ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని ష‌ర్మిల వైఎస్ఆర్ అభిమానుల‌కు తెలిపిన‌ట్లు తెలుస్తోంది.

దూకుడు పెంచిన ష‌ర్మిల.. 21న భారీ కాన్వాయ్‌తో ఖ‌మ్మంకు!


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle