newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ నాయకులను టార్గెట్ చేయడం మొదలుపెట్టిన షర్మిల..

27-03-202127-03-2021 15:49:13 IST
Updated On 27-03-2021 15:49:52 ISTUpdated On 27-03-20212021-03-27T10:19:13.363Z26-03-2021 2021-03-26T12:31:47.962Z - 2021-03-27T10:19:52.539Z - 27-03-2021

తెలంగాణ నాయకులను టార్గెట్ చేయడం మొదలుపెట్టిన షర్మిల..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

వైఎస్ షర్మిల తెలంగాణలో పొలిటికల్ పార్టీ పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే..! దాదాపుగా పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెడుతోంది అనే వార్తలు వచ్చినప్పటి నుండి ఇప్పటి దాకా ఓ నాయకుడిని టార్గెట్ చేస్తూ షర్మిల కామెంట్లు అయితే చేయలేదు. తాజాగా మాత్రం షర్మిల పసుపు బోర్డు గురించి మాట్లాడుతూ.. ఎంపీ ధర్మపురి అరవింద్ పై కామెంట్లు చేసింది. వైఎస్ షర్మిల తాజాగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నేతలు, వైఎస్సార్ అభిమానులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆమె నిజామాబాద్ ఎంపీ, బీజేపీ యువనేత ధర్మపురి అరవింద్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. "పసుపు బోర్డును ఇక్కడ ఏర్పాటు చేస్తానంటూ ఎవరో బాండ్ పేపర్ ఇచ్చారట... మాట నిలబెట్టుకోకుండా రైతులను మోసం చేశారట" అంటూ వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి ధర్మపురి అరవింద్ పైనే ఈ వ్యాఖ్యలు అని స్పష్టంగా తెలుస్తోంది.  పసుపు బోర్డు కాకుండా, ఎక్స్ టెన్షన్ కేంద్రం ఏర్పాటు చేస్తే రైతుల కష్టాలు తీరతాయా? అని షర్మిల ప్రశ్నించారు. భైంసాలో అల్లర్లు సృష్టించడంపై ఉన్న శ్రద్ధ రైతుల కష్టాలపై లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు షర్మిల సభపై ప్రభావం చూపనున్నాయి. ఏప్రిల్ 9న ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించాలని అనుకున్నారు. ఏకంగా లక్షమందితో నిర్వహించాలని అనుకున్నా.. పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా చాలా తక్కువ మందితో బహిరంగసభ నిర్వహించాలని పోలీసులు సూచించారు. షర్మిల తొలి బహిరంగసభ‌కు పోలీసులు అనుమతించారు.  ఈ స‌భ‌ను ష‌ర్మిల‌ లక్ష మందితో నిర్వ‌హించాల‌ని భావిస్తే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  6,000 మందితో సభ నిర్వహించుకునేందుకు ఖమ్మం జిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు.

స‌భ‌లోనూ క‌రోనా నిబంధనలు పాటిస్తూ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటలలోపే సభ నిర్వహించుకోవాలని పోలీసులు చెప్పారు. దీంతో ఈ స‌భ‌కు ఎంత మందిని అనుమ‌తిస్తార‌న్న విష‌యంపై సందిగ్ధ‌త నెల‌కొంది. ఈ సభలోనే పార్టీ పేరును, జెండాను, సిద్ధాంతాలను షర్మిల ప్రకటించనున్నారు. ఖమ్మం సభకు అనుమతించిన పోలీసులు కరోనా నేపథ్యంలో కొన్ని షరతులు విధించారు. సభకు వచ్చే వారంతా శానిటైజర్లు తెచ్చుకోవాలని, మాస్కులు కచ్చితంగా ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు.

ష‌ర్మిల‌కి మొద‌లైన భ‌యం..మొద‌లైన సేఫ్ గేమ్  

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   39 minutes ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle