newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

10-04-202110-04-2021 07:36:57 IST
Updated On 10-04-2021 09:09:33 ISTUpdated On 10-04-20212021-04-10T02:06:57.316Z10-04-2021 2021-04-10T02:06:36.648Z - 2021-04-10T03:39:33.356Z - 10-04-2021

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఖమ్మంలో వైఎస్ షర్మిల బహిరంగ సభలో ఎన్నో విషయాలను చెప్పినా.. ఓ విషయంలో మాత్రం అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అదేమిటంటే షర్మిల పార్టీ పేరు. పార్టీ పేరును షర్మిల ఖమ్మం సభలో ప్రకటిస్తారని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. ఆమె తన రాజకీయ పార్టీ పేరును జూలై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రకటిస్తానని వెల్లడించారు. అదే రోజున పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తామని చెప్పడంతో ఈ విషయంలో వారికి నిరాశ ఎదురైంది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈ వేదికగా షర్మిల విమర్శలను చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోతే నిరాహార దీక్ష చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేపడుతున్నట్టు వెల్లడించారు. బరాబర్ తెలంగాణలో నిలబడతానని, తెలంగాణ ప్రజల సమస్యల కోసం కొట్లాడతానని షర్మిల చెప్పుకొచ్చారు. పదవుల కోసం కాదు, ప్రజల కోసం నిలబడతానని స్పష్టం చేశారు.

ఎలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్నయినా తాను అడ్డుకుంటానని అన్నారు. ఈ గడ్డ మీదే గాలి పీల్చా, ఈ గడ్డ మీదే నీళ్లు తాగా... నా పిల్లలను ఇక్కడే కన్నాను. ఈ గడ్డకు సేవ చేయాలనుకోవడం, రుణం తీర్చుకోవాలనుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. కాగా తన పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ అని, మనసా వాచా కర్మణా ప్రజల కోసమే పనిచేసే పార్టీ అని, దీనికి అందరి ఆశీస్సులు అవసరమని అన్నారు. కేసీఆర్ పాలనలో అన్యాయాలను ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం ఉందంటూ చెప్పుకొచ్చారు. నాడు వైఎస్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అది రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు.

కానీ కేసీఆర్ ఇప్పుడదే ప్రాజెక్టుకు తల, తోక తీసేసి రీడిజైనింగ్ పేరుతో రూ.1.30 లక్షల కోట్లకు అంచనాలను పెంచేశారు. ఇది అవినీతి కాదా? ఇందులో ఎవరి వాటా ఎంత? అనేది నిలదీయడానికే మన పార్టీ అవసరం. రైతులకు రుణమాఫీ చేస్తానని కేసీఆర్ వాగ్దానం చేశారు. కానీ ఇవాళ కౌలు రైతు రైతే కాదంటున్నారు. రైతు పేరు మీద పాలకులు జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు షర్మిల.

నాడు వైఎస్ పావలా వడ్డీకే మహిళలకు రుణాలు ఇప్పిస్తే నేడు సున్నా వడ్డీ అని కేసీఆర్ అంటున్నారు.  కానీ బ్యాంకులు 12.5 శాతం వడ్డీ వేస్తున్నారని అక్కచెల్లెళ్లు నాతో చెప్పారని.. దీన్ని ప్రశ్నించడానికి మన పార్టీ అవసరమని అన్నారు షర్మిల. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా వైఎస్సార్ పాలన సాగిందని.. కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలను అందరికీ అందించాడన్నారు. 

Y.S. Sharmila: షర్మిల సభ సక్సెస్ అయ్యేనా..?

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

   11 minutes ago


రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   34 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   an hour ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   15 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   21 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   20 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle