రేవంత్ రెడ్డి, రఘువీర్ రెడ్డి.. జానారెడ్డి గెలుపుకి బాధ్యులు అవుతారా?
21-01-202121-01-2021 12:08:57 IST
Updated On 21-01-2021 10:51:31 ISTUpdated On 21-01-20212021-01-21T06:38:57.634Z21-01-2021 2021-01-21T05:12:10.042Z - 2021-01-21T05:21:31.722Z - 21-01-2021

కాంగ్రెస్ సీనియర్లు జానారెడ్డి, రేవంత్ రెడ్డి.. జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి.. ఈ ముగ్గురికీ.. నాగార్జున సాగర్ బై పోల్ చాలా చాలా ఇంపార్టెంట్. జానారెడ్డి గెలిస్తే ఒక లెక్క.. గెలవకపోతే మరో లెక్క ఉంటుంది. యాక్చువల్ గా రఘువీర్ రెడ్డి పోటీ చేయాలి. కానీ.. సడన్ గా వచ్చిన ఎన్నికలు కావడంతో.. సాగర్ లో ఈసారి కూడా జానారెడ్డే బరిలోకి దిగుతున్నారు. ఈ టైంలో.. జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పోటీ చేయడం కరెక్ట్ కాదు అని ఆపేశారు. ఇది ఎలాగూ.. జానారెడ్డి కంచు కోట కాబట్టి.. మూడు దశాబ్దాల్లో ఒక్కసారే బ్రేక్ అయింది కాబట్టి..ఆ బ్రేక్ అయిన చోట ప్యాచ్ వర్క్ చేసుకోవడానికి ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని.. తన సత్తా చాటుకోవాలి అని చూస్తున్నారు జానారెడ్డి. లేదంటే.. ఇన్నాళ్లూ తన అడ్డా అయినా.. ఆ గడ్డ మీద టీఆర్ఎస్ కానీ.. బీజేపీ కానీ బలం పుంజుకుని.. జానారెడ్డి రాజకీయాలకి పూర్తిస్థాయి బ్రేకులేస్తుందనేది ఆయన భయం. సో.. జానారెడ్డికి ఈ ఎన్నికల చాలా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే.. జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి కూడా ఇంపార్టెంటే. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడు అనుకున్నారు. కానీ.. సాగర్ లో ముందే రావడంతో.. ఆగారు రఘు వీర్ రెడ్డి. కానీ.. ఇప్పుడు తన తండ్రి జానారెడ్డి గెలవడం కూడా రఘువీర్ రెడ్డికి చాలా ఇంపార్టెంట్. వేరే వాళ్లు గెలిస్తే.. ఆ పార్టీ బలం పెరుగుతుంది. కిందిస్థాయి లీడర్లు మొత్తం ఆ దారి పడతారు. పొలిటికల్ గా కూడా సపోర్ట్ చూసుకుని అటు సైడే వెళ్తారు. అప్పుడు నెక్స్ట్ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డి పోటీ చేసినా.. పెద్దగా వర్కవుట్ కాదు. ఆ విషయంలో రఘు వీర్ రెడ్డికి కూడా క్లారిటీ ఉంది. ఇకపోతే.. నెక్స్ట్ తనే బరిలోకి దిగుతారు అనే ఉద్దేశంతో తన పార్టీ కేడర్ ని మొత్తాన్ని.. తన వైపు ఆకర్షించుకునేందుకు కొంత టైం దొరుకుతుంది. తండ్రి ఎమ్మెల్యేగా ఉంటే.. జనంలోకి వెళ్లడం ఈజీ కదా.. అలా వెళ్తే.. ఈ సారి తను పోటీ చేసినప్పుడు తనకి కలిసి వస్తుంది. ఇక రేవంత్ రెడ్డికి కూడా ఈ ఎన్నికలు అవసరమే. యాక్చువల్ గా టీపీసీసీ చీఫ్ కావాల్సిన లీడర్ తను. జానారెడ్డి రిక్వస్ట్ తో ఎంపిక ఆపేసింది. రేవంత్ కానీ.. కోమటి రెడ్డి కానీ.. ఎవరు పీసీసీ చీఫ్ అయినా.. స్టేట్ లో పార్టీలో చీలికలు వస్తయ్. వర్గాలుగా మారతయ్.. సాగర్ ఎన్నికలపై ఎఫెక్ట్ పడితే.. తాను ఓడిపోతాను అనే థాట్ తో ముందే జాగ్రత్త పడ్డారు జానా. సో.. ఇక్కడ కానీ.. జానారెడ్డి గెలుపుకోసం రేవంత్ రెడ్డి కృషి చేసి గెలిపిస్తే.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో.. రేవంత్ పొజిషన్ టాప్ లో ఉంటుంది అనే విషయంలో ఎవరికీ డౌట్స్ లేవు కదా.

బలంగా ప్రతి పక్షాలు.. వైసీపీకి రాహుకాలం తప్పదా
32 minutes ago

అంతొద్దు.. కాస్త కంట్రోల్ లో ఉండండి
8 hours ago

మరో ఇష్యూలో మేయర్ విజయలక్ష్మి
9 hours ago

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఓటు వేయకుంటే బాగుపడరన్న మంత్రి
16 hours ago

మరోసారి బాలయ్య దురుసుతనం.. ఫోటో తీశాడని చేయి చేసుకున్నారే..!
15 hours ago

ఆ నాయకుడు నన్ను మోసం చేసాడు.. చంద్రబాబు
17 hours ago

కేశినేని నానిని చెప్పుతో కొట్టేవాడినంటూ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
17 hours ago

కేశినేని నానిపై బొండా ఉమా ఆగ్రహం..!
19 hours ago

తెలంగాణపై ఎందుకింత వివక్ష.. కేంద్రంపై కేటీఆర్ ద్వజం
a day ago

బీజేపీతో పెట్టుకుంటే అంతే.. అడ్డంగా బుక్కయిన కేరళ సీఎం
a day ago
ఇంకా