newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

25-07-202125-07-2021 08:52:58 IST
Updated On 25-07-2021 09:11:45 ISTUpdated On 25-07-20212021-07-25T03:22:58.123Z25-07-2021 2021-07-25T03:22:54.651Z - 2021-07-25T03:41:45.955Z - 25-07-2021

మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టిపిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సిద్దం అవుతున్నారు. ఇందులో భాగంగా ఆయన మాజీ తెలుగుదేశం నేతలని కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నామరూపల్లేకుండా తుడిచిపెట్టుకు పోయిన సంగతి తెలిసిందే. దాంతో తెలుగుదేశం లో ఉన్న కీలక నాయకులు టిఆర్ఎస్, బిజెపి పార్తీలలోకి జంప్ అయ్యారు. ప్రస్తుతం అధికార టిఆర్ఎస్ పార్టీ లో నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చేవారు ఎవరూ లేరు. దాంతో రేవంత్ రెడ్డి దృష్టి టిడిపి నుండి బిజెపి లో చేరిన నాయకులపై పడింది. 

బీజేపీలో చేరిన పాత టీడీపీ నేతలకు రేవంత్ రెడ్డి గాలం వేస్తున్నారు. ఏమాత్రం మొహమాట పడకుండా వారిని కలుస్తూ తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. బీజేపీలోని అసంతృప్త నేతలందరికీ ఇప్పుడు తనతోపాటు కాంగ్రెస్ లోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీలోని టీడీపీ మాజీ నేతలు పెద్దిరెడ్డి చాడ సురేష్ రెడ్డి బోడ జనార్ధన్ విక్రమ్ గౌడ్ లతో రేవంత్ రెడ్డి టచ్ లోకి వెళ్లి వారిని కాంగ్రెస్ లో చేరేలా ఒప్పించినట్టు సమాచారం. ఈ నేతలందరూ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే బీజేపీకి రేవంత్ వల్ల భారీ దెబ్బ పడడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డి తనదైన మార్క్ రాజకీయం తో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ కి దీటుగా పార్టీని బలోపేతం చేస్తున్నట్టుగా కనిపిస్తుందని రాజకీయ వర్గాలు చర్చించు కుంటున్నాయి.

అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

   2 hours ago


రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

   3 hours ago


చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

   15 hours ago


మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

   17 hours ago


5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

   17 hours ago


పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ చన్నీ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ హాజరు

పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ చన్నీ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ హాజరు

   21 hours ago


ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఎన్నికల ఫలితాలలో వైసీపీ హవా

ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఎన్నికల ఫలితాలలో వైసీపీ హవా

   20-09-2021


ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక

   20-09-2021


హుజూరాబాద్‌ ఉప ఎన్నికకి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

   20-09-2021


అక్కడ ప్రతిపక్షాలకు ఒక్క ఓటు కూడా దక్కకపోవడం విశేషం

అక్కడ ప్రతిపక్షాలకు ఒక్క ఓటు కూడా దక్కకపోవడం విశేషం

   20-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle