newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

14-05-202114-05-2021 11:28:40 IST
Updated On 14-05-2021 09:47:24 ISTUpdated On 14-05-20212021-05-14T05:58:40.177Z14-05-2021 2021-05-14T03:24:16.911Z - 2021-05-14T04:17:24.861Z - 14-05-2021

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిన సంగతి తెలిసిందే..! అయితే ఈ టెండర్లను పిలిచి భారీ గోల్ మాల్ కు పాల్పడబోతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కరోనా మందులు, వ్యాక్సిన్‌ కొనుగోళ్ల పేరిట తెలంగాణలో రూ.వేల కోట్ల అవినీతి జరిగే అవకాశం ఉందని.. గ్లోబల్‌ టెండర్ల ముసుగులో మంత్రి కేటీఆర్‌ మిత్రుల కంపెనీలకు రూ.కోట్లు దోచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

దేశంలో రెండు కంపెనీల వ్యాక్సిన్‌ మాత్రమే వినియోగానికి అనుమతి ఉన్నప్పుడు గ్లోబల్‌ టెండర్లను పిలవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా కేసులను తగ్గించి చూపిస్తుండడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, మందులు రాలేదని అన్నారు. రాష్ట్రంలో తయారవుతున్న వ్యాక్సిన్‌లో వాటా కోసం కేంద్రాన్ని సీఎం కేసీఆర్‌ ఎందుకు నిలదీయట్లేదని ప్రశ్నించారు. కరోనా అంశాలపై కేసీఆర్ సలహాలు విని ప్రధాని మోదీ మెచ్చుకున్నారని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఇంకా నయం, ఢిల్లీకి పిలిపించి సన్మానం చేస్తామంటున్నారని కేసీఆర్ చెప్పుకోలేదని విమర్శించారు. 

కరోనా మొదటి వేవ్‌ సమయంలోనే కొవిడ్‌ నియంత్రణ, కిట్లు, మందుల కొనుగోళ్ల పేరుతో రూ.కోట్ల అవినీతి జరిగిందని, దీనికి సంబంధించి విజిలెన్స్‌ నివేదికను ప్రభుత్వ పెద్దలు బయటకు రానివ్వకుండా చేశారని ఆరోపించారు. మొదటి వేవ్‌ కరోనా ప్రభావం నుంచి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదని, రెండో వేవ్‌లో విజృంభణ తార స్థాయికి చేరాక నియంత్రణ పేరిట హడావుడిగా టాస్క్‌ఫోర్స్‌ను వేసిందని అన్నారు. ఎక్కడ అవినీతికి ఆస్కారం ఉంటుందో అక్కడ సీఎం కుటుంబ సభ్యులు వాలిపోతుంటారని అన్నారు.

కొనుగోళ్లు అనగానే కేటీఆర్ రంగప్రవేశం చేశారని, ఇక కేటాయింపులు అంటే కేటీఆర్ కు జతగా హరీశ్ రావు కూడా వచ్చేస్తారని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్‌ కొనుగోళ్ల పేరిట రూ.కోట్లు ఖర్చుచేసే అవకాశం ఉండటంతో కేటీఆర్‌కు ఆ టాస్క్‌ఫోర్స్‌ బాధ్యతలు అప్పగించారని అన్నారు. పీఎం కేర్‌ ద్వారా రాష్ట్రంలో ఒక్క ఆక్సిజన్‌ ప్లాంటైనా ఏర్పాటైందా..? అని ప్రశ్నించారు. తెలంగాణ వ్యాక్సిన్ అవసరాలు తీరిన తర్వాతే బయటి రాష్ట్రాలకు ఇస్తామని కేసీఆర్ ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు. తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాలు తమ అవసరాలు తీరిన తర్వాతే ఆక్సిజన్ ను ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నప్పుడు, కేసీఆర్ వ్యాక్సిన్ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవడంలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

   3 hours ago


ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

   5 hours ago


సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

   7 hours ago


బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

   8 hours ago


పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

   8 hours ago


థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

   9 hours ago


కక్షసాధింపు ఏమాత్రం కాదు..

కక్షసాధింపు ఏమాత్రం కాదు..

   9 hours ago


తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

   9 hours ago


నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

   13-06-2021


జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

   13-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle