రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి కష్టమే.. వాళ్లే కారణమా!
19-02-202119-02-2021 12:30:06 IST
Updated On 19-02-2021 12:39:41 ISTUpdated On 19-02-20212021-02-19T07:00:06.516Z19-02-2021 2021-02-19T05:06:20.820Z - 2021-02-19T07:09:41.165Z - 19-02-2021

కాంగ్రెస్ గురించి చెప్పేదేముంది చెప్పండి. బయట ఎన్ని పాలిటిక్స్ ఉంటాయో.. కాంగ్రెస్ పార్టీలో పాలిటిక్స్ కూడా అంతే ఉంటయ్. ముందు ఇంట గెలిచిన తర్వాతనే లీడర్లు రచ్చ గెలవాలి. వాళ్లకి ముందు ఆ తల నొప్పి తీరాల్సిందే. లేదంటే కష్టమే. లీడర్లు అంతే ఉంటారు కదా. పార్టీలో పదవుల కోసం ఫైటింగ్ తప్పదు.. అక్కడ గెలిచి.. మళ్లీ బయటి లీడర్లతో పార్టీలతో ఫైట్ చేయాలి. పార్టీని గట్టెక్కించాలి. అదే అక్కడ మెయిన్ ప్రాబ్లమ్.
ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ లీడర్ల మెయిన్ ప్రాబ్లమ్ కూడా ఇదే. రేవంత్ రెడ్డికా.. కోమటి రెడ్డి వెంకట రెడ్డికా పీసీసీ చీఫ్ పదవి అనేది ఎటూ తేలడం లేదు. ఇప్పుడే వద్దులే సాగర్ ఎన్నికల తర్వాత చూసుకుందాం అనుకున్నారు కానీ.. ప్రయత్నాలు మాత్రం మానడం లేదు. అటు రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచగానే మిగతా వాళ్లు కూడా స్పీడ్ పెంచారు. ఓ పక్క రేవంత్ రెడ్డి యాత్రలు దీక్షలు చేస్తుంటే.. మిగతా సీనియర్లు కూడా అదే బాట పట్టారు. అసలు జనాలేమో.. వీళ్లు వచ్చేది ప్రజల కోసం కాదు.. పదవి కోసం అనే క్లారిటీతో ఉన్నారు. సో దీక్షలు యాత్రలు కూడా ఎటూ ఉపయోగం లేకుండా పోతున్నయ్.
ఇకపోతే.. ఈ సభల వల్ల ఇంకో క్లారిటీ వచ్చింది. ఎవరు ఏ గ్రూప్ సైడ్ నుంచుంటున్నారు అనే క్లారిటీ అందరికీ కనిపిస్తోంది. వాళ్లల్లో వాళ్లకి కూడా ఆ క్లారిటీ వస్తోంది. ఒక సీనియర్ లీడర్ అయిన రేవంత్ రెడ్డి.. సభ పెడితే.. పార్టీ లీడర్లు మొత్తం కదిలి రావాలి. కానీ.. అలా జరగలేదు. ఎందుకంటే.. రెండు వర్గాలుగా విడిపోయారు కాబట్టి.. రేవంత్ రెడ్డికి తన వర్గం లీడర్లు మాత్రమే వచ్చారు. తన వెంట రాని వారిని.. తన వర్గం కాని వారుగా చూస్తున్నారు. జనం కూడా అదే అనుకుంటున్నారు.
రేవంత్ సభకి కూడా కాంగ్రెస్ లీడర్లు భారీగానే వచ్చారు. కానీ.. సీనియర్లు మాత్రం రాలేదు. ఎక్కువ మంది సీనియర్లు.. రాకుండానే ఉన్నారు. సో.. వాళ్లంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం అనే విషయంలో క్లారిటీ వచ్చింది. ఉత్తమ్, జానారెడ్డి, వీహెచ్, శ్రీధర్ బాబు, భట్టి, మధుయాష్కీ లాంటి వారు సభకి రాకపోవడంతో.. వీరంతా రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు అనే విషయం అర్దం అవుతోంది. కాంగ్రెస్ పార్టీలో మెయిన్ గా కనిపించే సీనియర్లు మొత్తం రేవంత్ సభకి రాకపోవడంతో.. ఇక రేవంత్ కి పీసీసీ చీఫ్ పదవి కష్టమే అంటున్నారు.
కోమటిరెడ్డిలో భయం.. రేవంత్ పై పైచేయికి ప్రయత్నం..

మున్సిపల్ పోరుపై బాబు ఫోకస్
11 minutes ago

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా.. చిన్నమ్మ
an hour ago

నేను వైసీపీలో చేరను-గంటా క్లారిటీ
an hour ago

విశాఖ ఉక్కు అయిపోయింది.. విశాఖ పోర్టు వంతు వచ్చింది
3 hours ago

ఆహా.. ఇది అద్భుతమైన ఓపెనింగ్ ఎంపీ సార్
2 hours ago

విశాఖ వైసీపీలో విభేదాలు మరోసారి కనపడ్డాయిగా..!
15 hours ago

క్రమ శిక్షణ చర్యలు తప్పవంటూ అచ్చెన్నాయుడు వార్నింగ్
17 hours ago

గంటా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి
21 hours ago

అధిష్టానంతో అటో ఇటో తేల్చుకుంటాం.. కాంగ్రెస్ అసమ్మతి నేతలు సిద్ధం
a day ago

జగన్ కి పాలన రాదు అనే మాటకి నిదర్శనాలు ఇవేనా
19 hours ago
ఇంకా