newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రేవంత్ మాస్ట‌ర్ ప్లాన్.. టీఆర్ఎస్ లో ఆ లీడ‌ర్లే టార్గెట్

25-04-202125-04-2021 11:04:17 IST
Updated On 25-04-2021 09:38:24 ISTUpdated On 25-04-20212021-04-25T05:34:17.594Z25-04-2021 2021-04-25T03:48:01.344Z - 2021-04-25T04:08:24.438Z - 25-04-2021

రేవంత్ మాస్ట‌ర్ ప్లాన్.. టీఆర్ఎస్ లో ఆ లీడ‌ర్లే టార్గెట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎవ‌రు. ఎవ‌రు. ఎవ‌రు ఆ లీడ‌ర్లు. రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిన లీడ‌ర్లు ఎవ‌రూ అని.. ఓ పెద్ద బ్యాగ్రౌండ్ ట్రాక్ న‌డిపించుకుంటే క‌ష్టం. అంత సినిమా ఏం లేదు అంటున్నారు.. టీఆర్ఎస్ లీడ‌ర్లు. కానీ.. పొలిటిక‌ల్ అన‌లిస్టులు మాత్రం అలా ఏం కాదు.. ఎవ్వారం గ‌ట్టిగానే ఉంది. రేవంత్ రెడ్డి.. స‌మ్ థింగ్ ఏదో ప్లాన్ లో గ‌ట్టిగానే ఉన్నారు అంటున్నారు.

మ‌రి ప్లానేంద‌య్యా అంటే.. రేవంత్ రెడ్డి కూడా టీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తున్నార‌ట‌. మిగ‌తా పార్టీల్లో ఉన్న లీడ‌ర్లు ఎంతో కొంత వీక్ అయ్యారు. కాబ‌ట్టి.. టీఆర్ఎస్ లీడ‌ర్లు ఇప్పుడు అధికారంలో ఉండి.. జ‌నంలో క్రేజ్ ఉంటుంది కాబ‌ట్టి.. వారిని లాగితే.. త‌న‌కి హెల్ప్ అవుతుంది అని ప్లానేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఉన్న మాజీ ఎమ్మెల్యేలు.. ముందు ముందు రోజుల్లో మాజీలు కాబోయే వారినే రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నార‌ట‌. వాళ్లంతా తాము ముందు ముందు రోజుల్లో మాజీలం కాబోతున్నాం అనే క్లారిటీతో.. రేవంత్ రెడ్డి వెన‌క న‌డుస్తారు అనే టాక్ ఉంది. ముందు ముందు రోజుల్లో వాళ్లు మాజీలు కాబోతున్నారు అని వాళ్లైనా ఎలా అనుకుంటారు.. వీళ్లైనా ఎలా గుర్తిస్తారు అనేది క‌దా ఇక్క‌డ పాయింట్.

అయితే.. ఎన్నిక‌ల వ్యూహ క‌ర్త‌గా.. పార్టీల్ని గెలిపించే స్కెచ్చులేసే లీడ‌ర్ గా పేరున్న ప్ర‌శాంత్ కిషోర్.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కి వ్యూహ క‌ర్త‌గా నిలిచి.. అద్భుత‌మైన ప్లాన్ లు వేసి.. టీఆర్ఎస్ ని గెలిపిస్తార‌ట‌. మ‌రి కేసీఆర్ ఏం చేస్తారు. ఈయ‌న వ్యూహ‌క‌ర్త కాదా.. ఈయ‌న‌కి మించిన ప్లానింగ్స్ ఉన్నాయా ప్ర‌శాంత్ కిషోర్ కి  అనిపిస్తుంది. అయితే.. కేవ‌లం ప్ర‌శాంత్ కిషోరే కాదు క‌దా. త‌ను ఒక నెట్ వ‌ర్క్ బిల్డ్ చేసుకుంటారు. కేసీఆర్ కి ఎంత నాలెడ్జ్ ఉన్నా.. ఆయ‌న వెన‌కాల ఉన్న అంద‌రికీ అంత నాలెడ్జ్ ఉండాలని ఏం లేదు క‌దా. అస‌లే టీఆర్ఎస్ కి స్టేట్ లో బ‌లం త‌గ్గుతోంది.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఇలాంటి టైంలో స్కెచ్చులేయ‌కుండా పులిహోర మాట‌ల‌తో న‌డ‌వ‌దు క‌దా అని ఆలోచిస్తున్నార‌ట టీఆర్ఎస్ లీడ‌ర్లు. అందుకే.. ప్ర‌శాంత్ కిషోర్ ప్లానింగ్ కూడా ఉంటే  హెల్ప్ అవుతుంద‌ని ఆలోచించి.. ఆయ‌న్ని రంగంలోకి దింపుతున్నార‌ట‌.

మ‌రి అలా దింపితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇప్పుడున్న చాలా మందికి సీట్లు రావు అనే క్లారిటీస్ ఉన్న‌య్. ఎందుకంటే.. ఇంత‌కు ముందు ప్ర‌శాంత్ కిషోర్ ప్లానింగ్స్ అంద‌రూ ఫాలో అవుతున్నారు కాబ‌ట్టి.. ప్ర‌శాంత్ కిషోర్ ఎంట్రీ ఇస్తే.. సీట్లు రావు అనుకున్న వాళ్లంతా రేవంత్ తో ట‌చ్ లో ఉన్నార‌ట‌. పైగా.. ముందు ముందు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. యూత్ కి ల‌క్ష‌ల‌కి ల‌క్ష‌ల మంది.. దాదాపు కోటి మందికిపైనే యూత్ కి ఓట్లు వ‌స్తాయ‌ని.. ఆ ఓటింగ్ అంతా రేవంత్ సైడే ఉంటుంద‌ని..యూత్ లో రేవంత్ కి ఉన్న ఫాలోయింగ్.. ఈ ఓటింగ్ తో హెల్ప్ అవుతుంద‌ని లెక్క‌లేస్తున్నార‌ట‌. అందుకే.. సీటు రాదు.. వ‌చ్చినా గెల‌వం అనుకున్న వాళ్లంతా.. రేవంత్ రెడ్డి తో ట‌చ్ లో ఉన్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే.. పీసీసీ ప‌ద‌వి కానీ ఇవ్వ‌కుంటే.. కాంగ్రెస్ ని వీడి సొంత పార్టీ పెడితే.. కాంగ్రెస్ ఖాళీ అవ్వ‌డం కూడా ఖాయం అని.. రేవంత్ వెన‌క న‌డిచే లీడ‌ర్లు కాంగ్రెస్ లో ఎక్కువ మంది ఉన్నార‌ని.. కాంగ్రెస్ అన‌లిస్టులు.. పొలిటిక‌ల్ అన‌లిస్టులు లెక్క‌లేస్తున్నార‌ట‌.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle