రేవంత్ టార్గెట్ పెద్దదే.. ప్లాన్ B పై ఫోకస్
20-02-202120-02-2021 08:29:41 IST
Updated On 20-02-2021 09:51:28 ISTUpdated On 20-02-20212021-02-20T02:59:41.685Z20-02-2021 2021-02-19T19:33:17.215Z - 2021-02-20T04:21:28.294Z - 20-02-2021

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా.. రేవంత్ రెడ్డికి కాస్త పేరుంది. తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లో అయితే.. ఇక చెప్పాల్సిన పనిలేదు. ఇన్నేళ్ల పొలిటికల్ కెరీర్ లో ఎన్నో విషయాల్లో ఆరి తేరారు. మాస్ లీడర్ గా పేరుంది. అలాగే సరైన పొజిషన్ లో కూడా ఉన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డికి మంచి పేరే ఉంది. టాప్ లీడర్ గానే కొనసాగారు. ఇప్పుడు కాంగ్రెస్ లోనూ అదే ట్రై చేస్తున్నారు.
కానీ.. ఇక్కడ వర్కవుట్ కావడం అంత ఈజీ కాదు అనే విషయం తెలిసిందే కదా. ముందున్నోళ్లు నడవరు.. వెనకున్న వారిని ముందుకు రానివ్వరు. అడ్డం నుంచుంటారు అనే టాక్ ఉంది కదా. ఇప్పుడు రేవంత్ విషయంలోనూ అదే జరుగుతోంది అనేది పొలిటికల్ హాట్ టాపిక్. అవును నిజమే.. రేవంత్ కి ఛాన్స్ ఇస్తే చాలు.. స్పేస్ లేకున్నా క్రియేట్ చేసుకుంటారు. అదీ రేవంత్ స్టైల్. కానీ.. ఆ ఛాన్సే ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ తెలంగాణ సీనియర్ లీడర్లు. వాళ్లెలాగూ పార్టీని పరుగులు పెట్టించలేక పోతున్నారు.. ఇప్పుడు రేవంత్ కి కూడా ఛాన్స్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారనేది.. రేవంత్ టీమ్ వాదన.
అయితే.. రేవంత్ మాత్రం.. పాదయాత్రలు, సభలు, దీక్షలు అంటూ.. మూవ్ అవుతున్నారు కదా. అయితే.. ఇదంతా.. పీసీసీ చీఫ్ పదవి కోసమే అనేది అందరి ఇంటెన్షన్. కానీ.. రేవంత్ టార్గెట్ పీసీసీ చీఫ్ పదవే అయినా.. మరో టార్గెట్ మాత్రం.. సీఎం సీటే. ముందుగా.. పీసీసీ చీఫ్ అయిన తర్వాత.. పార్టీని గాడిలో పడేసి.. అందరినీ దారికి తెచ్చుకుని.. సీఎం సీటు దాకా వెళ్లాలనేది ఆయన ఇంటెన్షన్ అట.
కానీ.. పీసీసీ చీఫ్ పదవి వచ్చేలా లేదు కాబట్టి.. మాస్ లీడర్ గా ఎదిగి.. జనంలో పేరు తెచ్చుకుని.. ఎలాగోలా కాంగ్రెస్ బలపడితే.. హంగ్ లాంటిది ఏమైనా క్రియేట్ అయితే.. పీసీసీ చీఫ్ గా ఎవరున్నా.. తాను మాత్రం.. సీఎం అభ్యర్థి అని పేరు తెచ్చుకోవాలి అని చూస్తున్నారట. అందుకే.. జనంలోకి వెళ్లడంపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారట. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఫామ్ చేసే ఛాన్స్ లేకపోవచ్చు అనే లెక్కలు ఉన్నాయి కదా.. బీజేపీ దూకుడుగా ఉంది.. షర్మిల పార్టీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక టీఆర్ఎస్ కాస్త వీక్ అవుతుంది. సో.. కాంగ్రెస్ కి మంచి ఛాన్సే ఉండే ఛాన్స్ ఉందనేది.. రేవంత్ ప్లాన్ అంటున్నారు.
రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి కష్టమే.. వాళ్లే కారణమా!

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
7 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
9 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
10 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
10 hours ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
11 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
11 hours ago

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత
11 hours ago

పవన్ కి విశాఖలో అడుగు పెట్టే ధైర్యం లేదా
2 hours ago

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న
9 hours ago

డాక్టర్ చిరంజీవి కొల్లూరి కన్నుమూత..!
13 hours ago
ఇంకా