newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

Renuka Chowdary : మళ్లీ జిల్లా రాజకీయాల్లో పట్టుబిగించే పనిలో పడ్డారా?

12-02-202112-02-2021 11:38:38 IST
Updated On 12-02-2021 13:27:08 ISTUpdated On 12-02-20212021-02-12T06:08:38.986Z11-02-2021 2021-02-11T11:54:51.293Z - 2021-02-12T07:57:08.728Z - 12-02-2021

Renuka Chowdary : మళ్లీ జిల్లా రాజకీయాల్లో పట్టుబిగించే పనిలో పడ్డారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆమె మాట్లాడితే మాట‌లు తూటాల్లా పేలుతాయి.. ప్ర‌త్య‌ర్థుల‌పై ఆడ సివంగిలా విరుచుకుప‌డుతుంది.. ఆమే ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్ నేత రేణుకాచౌద‌రి. ఈ పేరువిని తెలంగాణ ప్ర‌జ‌ల‌కే కాదు.. ఖ‌మ్మం జిల్లా వాసుల‌కు చాలాకాలం అవుతుంది. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు త‌రువాత అడ‌పాద‌డ‌పా జిల్లాలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ పోయే రేణుకాచౌద‌రి.. తాజాగా ఖ‌మ్మం గ‌డ్డ‌పై త‌న స‌త్తాను చూపేందుకు మ‌రోసారి సిద్ధ‌మ‌వుతుంద‌ట‌. మ‌ళ్లీ జిల్లాలో త‌న ప‌ట్టుబిగించే ప‌నిలో ఆమె నిమ‌గ్న‌మ‌య్యార‌నే టాక్ వినిపిస్తుంది. ఇప్ప‌టికే జిల్లా వ్యాప్తంగా ఉన్నత‌న వ‌ర్గీయుల‌ను పోరుకు సిద్ధ‌మ‌వ్వండి అంటూ అల‌ర్ట్ చేసింద‌నే వార్త ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. 

ఇటీవ‌ల ఖ‌మ్మం జిల్లాలో టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ భ‌ట్టి విక్ర‌మార్క ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో ఉత్త‌మ్‌, ష‌బ్బీర్ అలీతో పాటు ఫైర్‌బ్రాండ్ రేణుకాచౌద‌రి పాల్గొన్నారు. చానాళ్లుగా జిల్లాలోని పార్టీ శ్రేణుల‌కుసైతం ఆమె అందుబాటులో ఉండ‌టం లేదు. దీంతో జిల్లాలో రేణుకాచౌద‌రి ప్రాభ‌‌వం అయిపోయింద‌ని ఆమె వ‌ర్గీయులుసైతం భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో స‌డ‌న్‌గా జిల్లా రాజ‌కీయాల్లో మ‌రోసారి చ‌క్రం తిప్పేందుకు ఆమె సిద్ధ‌మ‌యింద‌ట‌. త‌న వ‌ర్గీయుల‌ను పిలిపించుకొని స‌మావేశంసైతం ఏర్పాటు చేసింద‌నే టాక్ న‌డుస్తుంది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేఖ విధానాల‌పై పోరుబాట ప‌ట్టాల‌ని ఆమె త‌మ వ‌ర్గీయుల‌కు సూచించార‌నే చ‌ర్చ సాగుతుంది. 

ఇదే క్ర‌మంలో  పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అస‌లైన కార్య‌క‌ర్త‌ల‌ను కొన్నిసార్లు గుర్తించ‌లేదు. టికెట్లు ఇవ్వ‌వ‌ల‌సిన స‌మ‌యంలో ఇవ్వ‌లేదు. నేను ప్ర‌తీసారి ఎవ‌రికి అన్యాయం జ‌రిగింద‌న్నా ముందుండి మాట్లాడ‌తాను.. కార్య‌క‌ర్త‌ల‌కు అన్యాయం జ‌రిగితే స‌హించేది లేదంటూ త‌న‌దైన శైలిలో కాంగ్రెస్ పార్టీ పెద్ద‌ల ముందే రేణుకా వ్యాఖ్యానించారు. అయితే ఇన్నాళ్లు సొంత పార్టీ నేత‌ల‌కు అందుబాటులోకి లేకుండాపోయిన రేణుకాచౌద‌రి సెడ‌న్ ఎంట్రీ ఇవ్వ‌డంతో ఆమె వ‌ర్గీయులు తెగ సంతోష‌ప‌డిపోతున్నారు. ప్ర‌స్తుతం జిల్లాలో అంనీతానై భ‌ట్టి విక్ర‌మార్క పార్టీని న‌డిపిస్తున్నారు. ఇప్పుడు రేణుకాచౌద‌రి సైతం ఆయ‌న‌కు తోడుకావ‌డంతో ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు పూర్వ‌వైభ‌వం రావ‌టం ఖాయ‌మ‌ని ఆ పార్టీ శ్రేణులు సంబ‌ర‌ప‌డిపోతున్నార‌ట‌.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle