రీజనల్ రింగ్ రోడ్డుకు పచ్చ జెండా
13-02-202113-02-2021 12:46:42 IST
Updated On 13-02-2021 12:47:31 ISTUpdated On 13-02-20212021-02-13T07:16:42.617Z13-02-2021 2021-02-13T03:10:34.724Z - 2021-02-13T07:17:31.374Z - 13-02-2021

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. శుక్రవారం నాడు కేంద్ర జాతీయ రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వర్రావు కలిసి ఈ విషయమై చర్చించారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు వివరాలను నితిన్ గడ్కరీ మీడియాకు వివరించారు. ఖమ్మం-కోదాడ మధ్య నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కూడా కేంద్రం ఒప్పుకుంది. పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతివ్వాలని కోరుతూ నామానాగేశ్వరరావు, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలువగా, ఆయన సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ చుట్టూ 354 కిలోమీటర్ల పొడవున ఆర్ఆర్ఆర్ ప్రతిపాదించిన విషయాన్ని నామా ఈ సందర్భంగా కేంద్రమంత్రికి వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు కోసం సీఎం కేసీఆర్ పలు విడతలుగా కేంద్రానికి లేఖలు రాశారని.. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ మహానగరం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆయన తెలిపారు. పారిశ్రామికంగా పురోగమిస్తుందని తెలిపారు. 2017లో సంగారెడ్డి నుంచి తూప్రాన్ మీదుగా చౌటుప్పల్వరకు మొదటిదశలో నిర్మించే జాతీయ రహదారికి ఎన్‌హెచ్161ఏఏగా నంబర్ కేటాయించారని, దీనిని 166 కిలోమీటర్ల వరకు నిర్మించేందుకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని నామా కేంద్రమంత్రి గడ్కరీకి తెలిపారు. రెండో దశలో చౌటుప్పల్-షాద్‌నగర్ మీదుగా కంది వరకు నిర్మించే 182 కిలోమీటర్ల రహదారి ప్రాజెక్టును జాతీయ రహదారిగా గుర్తిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర రోడ్లు, రవాణా మంత్రిత్వశాఖకు నివేదికలు సమర్పించామని తెలిపారు. 2018 జనవరి 27, ఆగస్టు 27న ఇచ్చిన అలైన్మెంట్లను ఆమోదించాలని కోరారు. ఈ రోడ్డు నిర్మాణానికి అయ్యే వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు కేంద్ర మంత్రికి నామా తెలియజేశారు. నాగపూర్-హైదరాబాద్- బెంగళూరు కారిడార్, పుణె-హైదరాబాద్- విజయవాడ కారిడార్‌లో జాతీయ రహదారి కనెక్టివిటీ ప్రాముఖ్యత పెరుగుతుందని నామా తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం ఇప్పటికే 80 శాతం భూ సేకరణ సైతం పూర్తయ్యింది. త్వరలో దీనికి సంబంధించిన పనులు మొదలుపెట్టాలన్న ఆలోచనతో రాష్ట్రం ముందుకెళుతోంది. హైదరాబాద్ సహా సమీపంలో ఉన్న పట్టణాల అభ్యున్నతి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ను రూపొందించింది. హైదరాబాద్ చుట్టూ 50 నుంచి 100 కి.మీ దూర పరిధిలో ఉన్న పట్టణాలు, గ్రామాల అభివృద్ధే లక్షంగా ప్రభుత్వం ఆర్ఆర్ఆర్కు రూపకల్పన చేసింది. కోదాడ-ఖమ్మం నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని నామా నాగేశ్వర్రావు తెలిపారు. భారత్‌మాల పరియోజన పథకం కింద 31.80 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్నారని చెప్పారు. ఎన్‌హెచ్167 అలీనగర్ 157.707 కిలోమీటర్ నుంచి 87.723 కిలోమీటర్ మిర్యాలగూడవరకు రోడ్డు విస్తరణ కోసం కేంద్రం రూ. 220 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు.

భారీగా నామినేషన్ల ఉపసంహరణ
an hour ago

గ్రేటర్ మేయర్ ప్రేమ, అభిమానం కోసం.. నేను కుక్కలా పుడతా- వర్మ
2 minutes ago

మున్సిపల్ పోరుపై బాబు ఫోకస్
an hour ago

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా.. చిన్నమ్మ
2 hours ago

నేను వైసీపీలో చేరను-గంటా క్లారిటీ
2 hours ago

విశాఖ ఉక్కు అయిపోయింది.. విశాఖ పోర్టు వంతు వచ్చింది
4 hours ago

ఆహా.. ఇది అద్భుతమైన ఓపెనింగ్ ఎంపీ సార్
3 hours ago

విశాఖ వైసీపీలో విభేదాలు మరోసారి కనపడ్డాయిగా..!
16 hours ago

క్రమ శిక్షణ చర్యలు తప్పవంటూ అచ్చెన్నాయుడు వార్నింగ్
18 hours ago

గంటా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి
a day ago
ఇంకా