newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నిప్పులో ఉప్పేస్తున్న రాముల‌మ్మ

04-02-202104-02-2021 07:37:34 IST
Updated On 04-02-2021 10:21:27 ISTUpdated On 04-02-20212021-02-04T02:07:34.941Z04-02-2021 2021-02-03T19:12:33.412Z - 2021-02-04T04:51:27.230Z - 04-02-2021

నిప్పులో ఉప్పేస్తున్న రాముల‌మ్మ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏంది త‌ల్లే ఇది అంటే.. ఏముంది బాబాయ్ అంటారు రాముల‌మ్మ‌. లేట్ గా చూశావా.. లేటెస్ట్ గా చూశావా అంటే.. ముందే చూశా. కానీ.. లేట్ గా రెస్పాండ్ అవుతున్నా అంటారేమో. లేక‌పోతే.. రాముల‌మ్మ ప్రెస్ మీట్ పెట్ట‌డానికి టైం లేదా.. ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రెస్ ఫ్రీగా లేదా. ఎప్పుడూ రెడీగానే ఉంటారు క‌దా అంతా. మ‌రి ఆమె మాత్రం ఏంటో.. అంతా అయిపోయాక చివరాఖ‌రిలో వ‌స్తారు. కొన్ని సార్లేమో.. పాడబోయే కోయిల ముందే కూసిన‌ట్లు.. ఊరంద‌రి కంటే ముందే.. ఉవ్వెత్తున లేస్తారు. ఇప్పుడేమో.. అంతా అయిపోయాక‌.. ఎవ‌రిళ్ల‌కి వాళ్లు పోయాక‌.. తీరిగ్గా టీవీల ముందు కూర్చోని చూడండి అన్న‌ట్లు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో రాములోరి ఎవ్వారం మామూలుగా లేదు. ఈ బీజేపీ కాస్త హ‌డావిడి పెంచిన ద‌గ్గ‌ర్నుంచే ఇదంతా జ‌రుగుతోంది ఆ విష‌యంలో ఎవ‌రికీ డౌట్లేం లేవు క‌దా. ఏపీలోనేమో రామ తీర్థం. తెలంగాణ‌లోనేమో.. అయోధ్య రామ‌య్య చందాలు. అంతే తేడా. రెండు చోట్లా రాముళ్లే. వ‌రంగ‌ల్ లో చందాల ఎవ్వారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాస్త క్వ‌శ్చనింగ్ గా మాట్లాడ్డంతో.. బీజేపీ ఎంత ర‌చ్చ చేసిందో తెలిసిందే క‌దా.

గ‌ట్టిగా మాట్లాడితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్వ‌శ్చ‌న్ చేశారు. ఆన్స‌రిస్తే స‌రిపోద్ది. వీళ్లేమో.. పొయ్యి దాడి చేశారు. ఆ ఎవ్వారమేమో పెద్ద‌దై కూర్చుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటిపైకి దాడికెళ్తే ఊరుకుంటారా. పోలీసులేమో కేసులు పెట్టి లోప‌లేశారు. ఇప్పుడు విజ‌య‌శాంతి బ‌య‌టికొచ్చారు. మేం అంతా క‌లిసి బ‌య‌టికొస్తే జైళ్లు చాల‌వు అంటున్నారు. అంటే ఏంది. విధ్వంసం చేస్తం అనా అర్దం. జైళ్లు చాల‌క పోతే.. కొత్తయ్ కడ్త‌రు. లేదంటే.. అందుల్నే కుక్కుత‌రు. అంత మాత్రాన‌.. బెదిరించడం క‌రెక్ట్ కాదు క‌దా మేడ‌మ్ అంటున్నారు జ‌నాలు. 

నిజ‌మే.. రాముల‌మ్మ క‌ర్త‌వ్యం వేరు క‌దా. అందుకే.. ఫైర్ బ్రాండ్ అయ్యారు. ఇప్పుడు వ‌రంగ‌ల్ ఎవ్వారంలోనూ అంతే రియాక్ట్ అవుతున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం కాస్త ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తోంది అనేది.. రాముల‌మ్మ వ‌ర్ష‌న్. కానీ ఎట్టా చెప్పండి. సారీలు గ‌ట్రా చెప్ప‌డం అయిపాయే.. చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుండే. ఇక వ‌దిలేస్తే పోయేదిగా. అంతా చ‌ల్లారి స‌ల్లంగ అయినాక‌.. ఇప్పుడొచ్చి.. చిన్న చిన్నగ సెగ త‌గులుతున్న నిప్పుల్లో ఉప్పేస్తున్నారు మేడ‌మ్ గారు. మా బీజేపీ వాళ్లు తెగించి బ‌య‌టికొస్తే.. జైళ్లు చాల‌వ్.. జర సైసుర్రి అంటున్నారు. స‌రె స‌రెలే.. జైళ్లు పెంచుతం అని టీఆర్ఎస్ అంటే ప‌రిస్థితి ఏంటి మేడ‌మ్. జ‌ర సూస్కోర్రి.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   17 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   16 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   20 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle