newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

దంచి కొడుతున్న వానలతో నిండు కుండలా తెలంగాణ.. పదేళ్ల రికార్డు బద్దలు

29-09-202029-09-2020 17:13:53 IST
Updated On 29-09-2020 18:05:09 ISTUpdated On 29-09-20202020-09-29T11:43:53.508Z29-09-2020 2020-09-29T11:43:47.837Z - 2020-09-29T12:35:09.289Z - 29-09-2020

దంచి కొడుతున్న వానలతో నిండు కుండలా తెలంగాణ.. పదేళ్ల రికార్డు బద్దలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత పదేళ్లలో కనీవినీ ఎరుగని వానలతో తెలంగాణ నిండుకుండలా మారిపోయింది. జూన్ మొదటివారంలో మొదలైన నైరుతి రుతువపనాల ప్రభావంతో ఈ నాలుగు మాసాల్లో ఏకంగా 16 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవ్వగా.. 11 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. వాస్తవానికి నాలుగు మాసాల్లో 711.7 మి.మీ.ల సగటు వర్షం కురువాల్సి ఉండగా ఏకంగా 1,071 మి.మీ.ల వర్షం కురిసింది. ఇది సాధారణ సగటుతో పోలిస్తే దాదాపు 50 శాతం అధికం.. ఇంత భారీ ఎత్తున వర్షాలు గడిచిన పదేళ్లలో 2010లో సాధారణ సగటు కంటే 32 శాతం అధికంగా నమోదు కాగా ఈ మారు ఆ రికార్డు చెరిగిపోయింది.

ఈ సీజన్‌ ప్రారంభం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో సగం రోజులపాటు వర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో జూలైలో 23 రోజులు, ఆగస్టులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 25, ములుగులో 24, మహబూబాబాద్‌లో 23, ఆగస్టులో రంగారెడ్డిలో 18, ఆదిలాబాద్‌లో 17 రోజులు వర్షాలు కురిశాయి.  

కాగా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఏర్పడ్డ 9 అల్పపీడనాల వల్ల కూడా భారీగా వర్షం నమోదైంది. జూన్‌ 9, జూలై 5, ఆగస్టులో 4, 9, 13, 19, 24, సెప్టెంబర్‌లో 13, 20 తేదీల్లో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనాల ప్రభావ వర్షాలతో అన్ని పల్లెలు, పట్టణాలు తడిసి ముద్దయ్యాయి. వీటికి తోడు తెలంగాణ భూ ఉపరితలంపై 15–16 రేఖాంశాల మధ్య ఏర్పడ్డ షీర్‌జోన్‌ కూడా దక్షిణ తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో కుండపోతకు కారణమయ్యాయి. 

ప్రతి ఐదేళ్లకు ఒకసారి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి.. అందులో భాగంగానే ఎల్‌నినో, లానినోలు ఏర్పడతాయి. ఈ మారు లానినో ప్రభావం వల్లే అత్యధిక వర్షాలు కురిశాయి. సాధారణ కంటే అధికంగా కురిస్తే లాభం కంటే నష్టమే అధికం. అయితే రెయినీ డేస్‌ ఎక్కువగా ఉండటం వల్ల భూగర్భ జలాలు వృద్ధి అయ్యేందుకు అవకాశముండటం సంతోషకర పరిణామమని వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్పారు. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రికార్డు వర్షాలు నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలో 150 శాతం, నారాయణపేటలో 140, గద్వాలలో 130 శాతం వర్షాలు కురిశాయి. రాష్ట్రమంతా భారీ వర్షపాతం నమోదైనా.. ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో కురువాల్సిన సాధారణ వర్షం కంటే కాస్త తక్కువగా నమోదు కావటం గమనార్హం. నిర్మల్‌లో 944.9 మి.మీ.కి 819 మి.మీలు, ఆదిలాబాద్‌లో 995.4 మి.మీకి గానూ 908.1 మి.మీ. కురిసింది.  

కరోనా సోకిందంటే దేవుడిచ్చిన విరామమే.. ఫడ్నవీస్

కరోనా సోకిందంటే దేవుడిచ్చిన విరామమే.. ఫడ్నవీస్

   14 minutes ago


మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

   3 hours ago


ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

   4 hours ago


పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

   4 hours ago


టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

   19 hours ago


వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

   19 hours ago


దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

   a day ago


నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

   a day ago


సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

   25-10-2020


సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

   25-10-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle