పీవీ కుమార్తెకు టికెట్ ఇవ్వడంపై మనవడి అభ్యంతరం.. ఇతర పార్టీ నాయకులు కూడా గుస్సా
22-02-202122-02-2021 22:39:54 IST
2021-02-22T17:09:54.994Z22-02-2021 2021-02-22T17:09:48.738Z - - 08-03-2021

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పీవీ మనవడు, బీజేపీ నేత ఎన్వీ సుభాష్ స్పందించారు. ఎలాంటి గెలుపు అవకాశాలు లేని స్థానంలో తన చిన్నమ్మ వాణీదేవికి టికెట్ ఇచ్చారని.. ఓడిపోతుందని తెలిసీ టికెట్ ఇవ్వడం మోసం చేయడమేనని విమర్శించారు. ఓ మహనీయుడి పేరు చెప్పుకుని కుటిల రాజకీయాలకు పాల్పడ్డారని సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని మోసం చేయడమే కాదని, బ్రాహ్మణ సమాజం ఓట్లు చీల్చే ప్రయత్నమని అన్నారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసేందుకు సురభి వాణీదేవికి సీఎం కేసీఆర్ బీ-ఫారం అందించారు. నామినేషన్ వేసేందుకు ఎంతో ఉత్సాహంతో వెళ్లిన వాణీదేవికి నిరాశ ఎదురైంది. నామినేషన్ పత్రాలు సరైన ఫార్మాట్లో లేవని అధికారులు తిరస్కరించారు. అప్పటికే సమయం మించిపోవడంతో వాణీదేవి వెనుదిరిగారు. దాంతో ఆమె రేపు ఉదయం నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు.
పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓడిపోయే స్థానంలో అవకాశం ఇచ్చి పీవీ కుటుంబాన్ని అవమానిస్తున్నారని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పీవీ కుటుంబానికి కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఓడిపోయే సీటు పీవీ కుమార్తెకా? అని ప్రశ్నించారు. ఆమెను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేయొచ్చు కదా! అని అన్నారు. కేసీఆర్ కుట్రను పీవీ కుమార్తె తెలుసుకోవాలని సూచించారు.
రాజకీయ లబ్ది కోసమే పీవీ కుమార్తెను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పీవీ నరసింహారావును గౌరవిస్తూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు బరి నుంచి తప్పుకోవాలని మంత్రి తలసాని సూచిస్తున్నారని, పీవీపై నిజంగా అభిమానం ఉంటే ఆయన కుమార్తెకు రాజ్యసభ సీటు కానీ, గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీ అవకాశం కానీ ఇవ్వాలని అన్నారు.

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
6 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
8 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
9 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
9 hours ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
10 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
10 hours ago

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత
10 hours ago

పవన్ కి విశాఖలో అడుగు పెట్టే ధైర్యం లేదా
40 minutes ago

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న
8 hours ago

డాక్టర్ చిరంజీవి కొల్లూరి కన్నుమూత..!
12 hours ago
ఇంకా