newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

సీఎం కేసీఆర్ పై మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఫైర్

22-09-202122-09-2021 09:23:52 IST
Updated On 22-09-2021 10:05:00 ISTUpdated On 22-09-20212021-09-22T03:53:52.892Z22-09-2021 2021-09-22T03:53:45.730Z - 2021-09-22T04:35:00.687Z - 22-09-2021

సీఎం కేసీఆర్ పై మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో ప్రజాపాలనకు బదులు కేసీఆర్‌ కుటుంబపాలన నడుస్తోందని, దీనికి చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్రకి మద్దతు తెలిపేందుకు ఆయన పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడేళ్లలో లక్ష మంది ఉద్యోగులు రిటైర్‌కాగా, టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం మాత్రం ఆ ఖాళీలను భర్తీ చేయలేదని ఆరో పించారు. సీఎం కేసీఆర్‌ మాయమాటలతో, అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడ బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. 

ఇక గత కొద్దిరోజులుగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైట్ చాలెంజ్ పేరుతో హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ కోర్టు నుండి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోగా బండి సంజయ్ మాత్రం కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు కుమ్ముక్కయ్యాయని ప్రజల సమస్యల నుండి దృష్టి మరల్చడానికే ఇలా వైట్ చాలెంజ్ పేరుతో నాటకాలు ఆడుతున్నాయని ఎద్దేవా చేశారు. తన పాదయాత్ర పూర్తి కాగానే తాను సైతం డ్రగ్ టెస్ట్ లకి సిద్దమని, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి తన తల వెంట్రుకలు, రక్త నమూనాలు ఇస్తానని ప్రకటించడం విశేషం. కాగా సంజయ్ పాదయాత్ర 25 రోజుల పాటు దిగ్విజయంగా కొనసాగిందని, మూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయ్యిందని, బండి సంజయ్ చేపట్టిన ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో బిజెపి పార్టీ మరింత బలోపేతం చెందిందని రాష్ట్ర బిజెపి నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

రైతుల అన్ని డిమాండ్లను కేంద్రం ఆమోదించడంతో రైతుల హర్షం

రైతుల అన్ని డిమాండ్లను కేంద్రం ఆమోదించడంతో రైతుల హర్షం

   an hour ago


ఏపీలో గుట్కా, పొగాకు బ్యాన్ చేసిన ప్రభుత్వం..

ఏపీలో గుట్కా, పొగాకు బ్యాన్ చేసిన ప్రభుత్వం..

   5 hours ago


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం

   8 hours ago


టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా.. ఆ స్థానంలో మోత్కుపల్లి..?

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా.. ఆ స్థానంలో మోత్కుపల్లి..?

   10 hours ago


ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీని వీడాలని ఈటల రాజేందర్ పిలుపు

ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీని వీడాలని ఈటల రాజేందర్ పిలుపు

   21 hours ago


ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం

   21 hours ago


తెలంగాణలో 43 మెడికల్ స్టూడెంట్స్ కి కోవిద్ పాజిటివ్

తెలంగాణలో 43 మెడికల్ స్టూడెంట్స్ కి కోవిద్ పాజిటివ్

   06-12-2021


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోము వీర్రాజు ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోము వీర్రాజు ఫైర్

   06-12-2021


భారత్ కి రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పిఎం మోడీతో సమావేశం

భారత్ కి రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పిఎం మోడీతో సమావేశం

   06-12-2021


రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

   04-12-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle