ప్రచారం చివరి రోజున భాగ్యనగరానికి వస్తున్న మోదీ.. మతలబేంటీ..?
26-11-202026-11-2020 20:40:03 IST
Updated On 27-11-2020 09:09:53 ISTUpdated On 27-11-20202020-11-26T15:10:03.150Z26-11-2020 2020-11-26T15:09:52.095Z - 2020-11-27T03:39:53.142Z - 27-11-2020

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న హైదరాబాద్ వస్తున్నారు. మామూలుగా అయితే.. ఇది అంత పెద్ద విషయం ఏమీ కాదు. కాదు కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం చివరి రోజున ప్రధాని భాగ్యనరానికి రానుండడంతో.. ఆయన పర్యటపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండడంతో.. ఈ సమయంలో మోడీ హైదరాబాద్ కు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన ప్రచారంలో పాల్గొంటారా..? లేదా..? అనేది ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ లోని భారత్ బయోటిక్ సంస్థ కరోనా వాక్సిన్ను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. కోవాగ్జిన్ టీకా పురోగతిని పరిశీలించేందుకు ప్రధాని మోడీ ఆదివారం హైదరాబాద్ కు రానున్నారు. 29న ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హకీంపేట విమానాశ్రమానికి రానున్నారు. అక్కడి నుంచి 18 కిలోమీటర్ల దూరంలోని భారత్ బయోటెక్ సంస్థకు చేరుకుని.. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. భాగ్యనగరంలో కషాయ జెండా ఎగుర వేయాలని కమళనాధులు కృత నిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే జాతీయ స్థాయి నేతలు హైదరాబాద్‌కు వచ్చి జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక కేంద్ర మంత్రుల రాకను గులాబీ నేతలు తప్పుపడుతున్నారు. అవసరమైతే ప్రధాన మంత్రిని కూడా జీహెచ్ఎంసీ ప్రచారానికి స్థానిక నేతలు పిలుచుకు వస్తారంటూ మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్నట్లు హఠాత్తుగా పర్యటన ఖరారైంది. దాంతో స్థానికంగా మోదీ పర్యటనపై ఆసక్తి ఏర్పడింది. ఇక మోదీ ఈ పర్యటనలో ఒక్క మాట మాట్లాడినా అది గ్రేటర్ ఎన్నికల ప్రచారానికేనని అభిప్రాయం కలిగే సంకేతాలున్నాయి.

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..
4 hours ago

నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!
9 hours ago

తెలంగాణ పాలిటిక్స్ లోకి దర్శకుడు రాఘవేంద్ర రావు
10 hours ago

అంబటి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్
8 hours ago

ఎన్నికలకు వెళ్లకుంటే.. ఏపీ సర్కార్ కి సీరియస్ ప్రాబ్లమే.. ఎలాగో తెలుసా..?
11 hours ago

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక
6 hours ago

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు
5 hours ago

లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక
12 hours ago

ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హజారే
12 hours ago

ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ
10 hours ago
ఇంకా