newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

19-04-202119-04-2021 15:22:15 IST
2021-04-19T09:52:15.076Z19-04-2021 2021-04-19T03:37:06.406Z - - 15-05-2021

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏం మాట్లాడుతున్న‌వ్ రా మాదాపూర్ అంటారు ఇలాంటి మాట‌లు ఎవ‌రైనా అంటే. అయితే ఎదురుగా అంటే అంటారేమో కానీ.. వెన‌కాల అంటే ఏం చేస్తారు చెప్పండి. ఎదురుగా మీ అంత ప‌వ‌ర్ ఫుల్ హీరో ఎవ‌రూ లేరు అంటూ గొప్ప‌లు చెబుతూ.. అలా వెళ్ల‌గానే నానా మాట‌లూ అంటే ప‌రిస్థితి ఏంటి. అరుగుల మీద కూర్చుని ఇదే మాట గురించి డిస్క‌స్ చేస్తుంటే ప‌రిస్థితి ఏంటి. మీ ఎవ్వారం రాగానే.. హా.. ఆయ‌న‌దేముందిలే.. ఆ పార్టీ తోక ప‌ట్టుకునే తిరుగుతారు అనుకుంటే మీ ప‌రిస్థితి ఏంటి. అస‌లు.. జ‌న‌సేన అధినేత అయిన ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇవ‌న్నీ ఆలోచించే ప‌రిస్థితిలో ఉన్నారా. ఏమో.. ఉంటే అలా ఎందుకు చేస్తారు అలాంటి నిర్ణ‌యాలు ఎందుకు తీసుకుంటారు అని అనుకుంటున్నారు.

విష‌యం ఏంద‌య్యా  అంటే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ కి బీజేపీతో పొత్తు త‌ప్ప‌.. అస‌లు బ‌ల‌మే లేదా అనుకుంటున్నారు జ‌నాలు. ఎందుకంటే.. బీజేపీతో ఏపీలో పొత్తు న‌డుస్తూనే ఉంది. ఓకే. వాళ్లు ఈయ‌న‌కి కావాల్సినంత మ‌ర్యాద కూడా ఇస్తున్నారు. అది కూడా ఓకే. అస‌లు తెలంగాణ‌లో బీజేపీ లీడ‌ర్లు ప‌వ‌న్ ని ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల టైం నుంచే ప‌వ‌న్ క‌ల్యాణ్ ని.. ఐస్ తిన్న త‌ర్వాత పుల్ల‌ని చూసిన‌ట్లుగా చూస్తున్నారు అని జ‌న‌సైనికులే ఫీల్ అవుతున్నారాయే. అయినా స‌రే.. వారి వేలు విడిచి న‌డ‌వ‌డం లేదు ప‌వ‌న్. మొన్న  ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తిరుగుబాటు చేస్తే.. వాహ్.. మ‌ళ్లీ మా పాత ప‌వ‌న్ వ‌చ్చారు.. ఇక ర‌ఫ్పాడిస్తారు అనుకున్నారు. ఇప్పుడేమో.. మ‌ళ్లీ మా పాత ప‌వ‌న్ వ‌చ్చారు.. బీజేపీతో దోస్తీ అంటున్నారు అని ఢీలా ప‌డిపోతున్నారు.

ఎందుకంటే.. మ‌ళ్లీ బీజేపీతో దోస్తీ క‌డుతున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఏపీలో ఎలాగూ పొత్తు ఉంది క‌దా. ఇప్పుడు తెలంగాణ‌లో కూడా కంటిన్యూ చేస్తార‌ట‌. మొన్నంటే ఏవో అల‌క‌లు.. మొహమాటాలు అడ్డొచ్చాయి కానీ.. ఇప్పుడు మ‌ళ్లీ క‌లిసిపోయారు. ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ తో పాటు.. ఐదు చోట్ల మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి క‌దా. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీతో దోస్తీ క‌డుతోంది జ‌న‌సేన‌. కానీ.. ప‌వ‌న్ ఎవ్వారం మాత్రం.. జ‌నసైనికుల‌కు కూడా ఏ మాత్రం అర్దం కావ‌డం లేద‌ట‌.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   13 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   15 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   21 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   19 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   18 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle