ఇజ్జత్ మొత్తం నివర్ తుఫాన్ లో కొట్టుకుపోయే
29-11-202029-11-2020 09:13:35 IST
Updated On 29-11-2020 09:29:15 ISTUpdated On 29-11-20202020-11-29T03:43:35.786Z29-11-2020 2020-11-29T03:43:29.990Z - 2020-11-29T03:59:15.623Z - 29-11-2020

ఏంది సారూ. పవన్ సారూ.. ఏందయ్యా ఇది. చూస్తున్నవా పాలిటిక్స్ ని. ఎట్టా ఉన్నాయో. ఒక్కొక్కళ్లూ ఎన్నెన్ని మాటలు అంటున్నరో చూస్తున్నవా. అడ్డడ్డే.. ఊసర వెల్లి అంటున్నరు. రంగులు మారుస్తున్నవూ అంటున్నరు. మేకప్ పాలిటిక్స్ లో కూడా వేసుకుంటున్నవూ అంటున్నరు. నీకసలు మనస్సాక్షి లేదా అంటున్నరు. ఆత్మాభిమానం లేదా అంటున్నరు. ఎన్నెన్ని మాటలు అంటున్నరో చూసినవా పవనాలు. అభిమానులు మొహం ఏడ పెట్టుకోవాలో ఆలోచించావా ఏమైనా. ఎంత భక్తులైనా ఎంతకని భరిస్తరు చెప్పు. ఇట్లనే ఇంకో రెండు మూడు నిర్ణయాలు తీసుకుంటే.. వాళ్లసలు బయట తిరగలేస్తరా. ఒక్క గ్రేటర్ ఎన్నికలతో ఎన్ని మెట్లు కిందికి పడిపోయావో అర్దం అవుతుందా పవన్ సార్. ప్రకాశ్ రాజ్ లాంటి బయటి లీడర్ కూడా అన్నేసి మాటలు అంటుండె. దానికి తోడు మీ అన్నగారు.. అదేనండీ నాగబాబు గారు వత్తాసు పలికి.. ఇంకిన్ని మాటలు అని.. ఇంకింత ఇజ్జత్ తీసుకునే. ఏంది సార్ ఇది. ఒక్క గ్రేటర్ నిర్ణయంతో ఎంత గారడీ చేశారో బీజేపీ వాళ్లు మీకేమైనా అర్దం అవుతుందా అంటూ.. ఆడేసుకుంటున్నారు జనాలు. మిమ్మల్ని కూరలో కరవేపాకులా.. ఆకులో వక్కలా.. అరటికాయ తొక్కలా చూస్తున్నారు అంటూ.. భక్తులు ఫీలై పోతున్నారు. అసలు మీ అభిమానులు.. భక్తులు.. పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారో ఏమైనా ఆలోచిస్తివా పవన్ సార్. పార్టీ అంటే ఎట్టా ఉండాలి. మీకే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంటుంది అని చెప్పుకుంటవ్.. అట్టాంటిది మీ పార్టీ జెండాకి కూడా ఆ మాత్రం పొగరుండాలి కదా. దాన్ని తీసుకెళ్లి.. ఎవరి మీద పడితే వాళ్ల మీద మాటి మాటికీ వాలుస్తవా. ఏంది సార్ ఇది. మొదట్లో మోడీనే మొనగాడు అంటివి.. తర్వాత ఆయనంత దేశ ద్రోహి లేడు అంటివి.. మళ్లీ ఆయనే మొనగాడు అని పాత పాట పాడితివి.. ఏంది సార్ ఇది. ఎన్నికలు వస్తుంటయ్.. పోతుంటయ్. గ్రేటర్ ఎన్నికల్లో మీకు ఒరిగేది కూడా ఏమీ లేదు. దానికోసం తీసుకున్న తుత్తర నిర్ణయాలు ఎంత దాకా తీసుకొచ్చాయో చూశావా పవన్ సార్. ఇంకా తగ్గలే. మీరు మళ్లొచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా.. ఇదే రిపీట్ అవుద్ది అంటారు. ఈ నిర్ణయాల ఎఫెక్ట్ మీపై ఎప్పటికీ ఉంటుంది. జర సైసు. ఆవేశం ఆవేశం అనుకుని.. ఆగం ఆగం అయితున్నవని.. పొలిటికల్ లీడర్లు మిమ్మల్ని చిన్న పిల్లాడిలా చూస్తున్నారు. ప్చ్.. ఎంత పని జరిగిపోతుంది పవన్ సార్. కాస్తైనా క్లారిటీ ఉండాలి కదయ్యా.

బిడ్డకు పట్టాభిషేకం.. కేసీఆర్ ముఖ చిత్రం ఎలా ఉంటుందో
18 minutes ago

ఎన్నికలకు సహకరిస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం..!
2 hours ago

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఠాకూర్.. షాక్ లో ప్రతిపక్షాలు
an hour ago

రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించిన వైఎస్ జగన్
3 hours ago

జగన్ సర్కార్ కి మరో దెబ్బ.. ఎన్నికలు జరపాలని చెప్పిన హై కోర్టు
3 hours ago

రేవంత్ రెడ్డి, రఘువీర్ రెడ్డి.. జానారెడ్డి గెలుపుకి బాధ్యులు అవుతారా?
2 hours ago

బెదిరింపులకు ఆయుధంగా మారిన అట్రాసిటీ కేసులు.. హైకోర్టు అక్షింతలు
3 hours ago

భారతీ సిమెంట్ మీద మమకారం.. వందల కోట్ల ప్రభుత్వ నిధుల చెల్లింపు
4 hours ago

ఆ ఒక్క మాట.. రెండు కులాల మధ్య చిచ్చు.. ప్రభుత్వానికి తప్పని చికాకు
5 hours ago

పల్నాడులో టీడీపీ నేత అంకులును చంపింది వీరే
6 hours ago
ఇంకా