ఆ ఒక్క మాట.. రెండు కులాల మధ్య చిచ్చు.. ప్రభుత్వానికి తప్పని చికాకు
21-01-202121-01-2021 08:40:19 IST
Updated On 21-01-2021 10:32:23 ISTUpdated On 21-01-20212021-01-21T03:10:19.826Z21-01-2021 2021-01-21T03:06:19.480Z - 2021-01-21T05:02:23.222Z - 21-01-2021

మాట తూటా లాంటిది అంటారు కదా. ఆ మాటలు పొలిటికల్ లీడర్ల నోటి నుంచి వస్తే.. ఇంకాస్త బలంగా తగులుతయ్. మినిస్టర్లు నోటి వచ్చే మాటలకి ఇంకాస్త బలం ఉంటుంది. అందుకే.. పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్లు.. కాస్త ఆచి తూచి మాట్లాడాలి. లేదంటే.. లేని పోని చికాకులు తప్పవు. ఇప్పుడు మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అదే పొజిషన్ లో ఉన్నారు. ఒక్క మాట అనేసి.. రెండు కులలా మధ్య లో ఇరుక్కు పోయారు. అలా ఎలా అంటారు అంటూ.. మరో కులం వారు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. కోకా పేటలో.. ముదిరాజ్ భవన్ శంకుస్థాపనకు వెళ్లిన మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కొన్ని కామెంట్స్ చేశారు. ముదిరాజ్ వర్గం వారిని ఆకర్షించేందుకు.. ప్రయత్నాలు చేశారు. ఆ ప్రాసెస్ లో చిన్న లేయర్ మర్చిపోయి కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని అన్ని చెరువుల్లోని చేపలు పట్టుకునే అన్ని రకాల హక్కులూ ముదిరాజ్ లకే ఇచ్చింది గవర్నమెంట్.. మీరు ప్రశాంతంగా చేపలు పట్టుకోండి. మీ హక్కులకు భంగం కలిగేలా ఎవరైనా ఇబ్బంది పెడితే.. స్థానిక పోలీస్ స్టేసన్లలో కంప్లయింట్స్ ఇవ్వండి.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్. ముదిరాజ్ బిల్డింగ్ శంకుస్థాపనకు వెళ్లారు కాబట్టి.. ముదిరాజ్ లకు భరోసా ఇచ్చేలా మాట్లాడారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇక్కడే మొదలైంది చిక్కు. దీంతో గంగ పుత్రులు భగ్గుమన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటలను ఖండించారు. ఊళ్లల్లో ఆందోళనలు చేశారు. కొన్ని కొన్ని చోట్ల రోడ్లెక్కారు. హైదరాబాద్ లో ధర్నా చేస్తాం అని వార్నింగ్ ఇస్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ని మినిస్టర్ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి అని డిమాండ్ చేశారు. ముదిరాజ్ లకు మాత్రమే హక్కులు ఉంటే మా పరిస్థితి ఏంటి అన్నారు గంగ పుత్రులు. మామూలుగా అయితే.. అందరూ ఒకటే అనే ఫీలింగ్ ఉంటుంది కదా. కానీ.. సన్నగీత మర్చిపోయారు మినిస్టర్ తలసాని. ముదిరాజ్, గంగపుత్రులు, బెస్త వాళ్లు అంతా ఒకే సామాజిక వర్గం అనే ఫీలింగ్ ఉన్నా కానీ.. పేర్లు వేరే సామాజిక వర్గాలు కూడా వేరే. కాకపోతే.. మాట వరసకి మాత్రం అంతా ఒకటే అనుకుంటుంటాం. దీనిపై రియలైజ్ అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్... గంగపుత్రులను అవమానించాలనేది తన ఉద్దేశం కాదని.. కావాలంటే వారికి క్షమాపన చెప్పడానికి రెడీ అన్నారు. అయినా ఇష్యూ మాత్రం చల్లారలేదు. మరి ముందు ముందు ఎంత దాకా వెళ్తుందో చూడాలి. దీని ఎఫెక్ట్ మాత్రం టీఆర్ఎస్ పార్టీకి గట్టిగానే తగిలినట్లుంది. ఇన్ సైడ్ పార్టీలో కూడా ఇదే డిస్కషన్ జరుగుతోందంట. అందుకే.. మినిస్టర్ కూడా క్షమాపణ చెప్పడానికి రెడీ అని బయటికి వచ్చేశారు.

బలంగా ప్రతి పక్షాలు.. వైసీపీకి రాహుకాలం తప్పదా
27 minutes ago

అంతొద్దు.. కాస్త కంట్రోల్ లో ఉండండి
8 hours ago

మరో ఇష్యూలో మేయర్ విజయలక్ష్మి
9 hours ago

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఓటు వేయకుంటే బాగుపడరన్న మంత్రి
16 hours ago

మరోసారి బాలయ్య దురుసుతనం.. ఫోటో తీశాడని చేయి చేసుకున్నారే..!
14 hours ago

ఆ నాయకుడు నన్ను మోసం చేసాడు.. చంద్రబాబు
17 hours ago

కేశినేని నానిని చెప్పుతో కొట్టేవాడినంటూ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
16 hours ago

కేశినేని నానిపై బొండా ఉమా ఆగ్రహం..!
19 hours ago

తెలంగాణపై ఎందుకింత వివక్ష.. కేంద్రంపై కేటీఆర్ ద్వజం
a day ago

బీజేపీతో పెట్టుకుంటే అంతే.. అడ్డంగా బుక్కయిన కేరళ సీఎం
a day ago
ఇంకా