newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

వ‌న్ ప్ల‌స్ వ‌న్ ఆఫ‌ర్

15-04-202115-04-2021 11:41:54 IST
Updated On 15-04-2021 09:21:26 ISTUpdated On 15-04-20212021-04-15T06:11:54.278Z15-04-2021 2021-04-15T02:37:07.796Z - 2021-04-15T03:51:26.277Z - 15-04-2021

వ‌న్ ప్ల‌స్ వ‌న్ ఆఫ‌ర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఎం కేసీఆర్ అంటే సీఎం కేసీఆరే. రాజ‌కీయంగా ఎత్తులు పై ఎత్తులు వేయాలంటే.. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ నాయ‌కుల్లో కేసీఆర్ త‌ర్వాత‌నే ఎవ‌రైనా. సీరియ‌స్ గా తీసుకుంటే మ‌సి పూసి మారేడు కాయ చేయ‌డానికి కూడా వెనుకాడ‌రు. అఫ్ కోర్స్.. ఆ తెలివి తేటల్తోనే ఇన్నాళ్లూ నెట్టుకొస్తున్నారు అది వేరే విష‌యం. ఇక ఇప్పుడు సాగర్ ఎన్నిక‌ల విష‌యంలో కూడా అలాంటి జిత్తులు బానే ఉప‌యోగిస్తున్నారు సీఎం కేసీఆర్.

ఇప్పుడు వ‌న్ ప్ల‌స్ వ‌న్ ఆఫ‌ర్.. సాగ‌ర్ ఏరియాలో ఫుల్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఎమ్మెల్సీని చేయ‌డం అనేది సీఎం చేతిలో ప‌ని. ఎవ‌రినైనా ఎమ్మెల్సీ చేయ‌గ‌ల‌రు. రానున్న ఎమ్మెల్సీ ప‌ద‌వుల భ‌ర్తీ టైంలో.. ఎమ్మెల్సీ  ఈజీగానే అయిపోవ‌చ్చు. అక్క‌డ ఈజీగా చేయొచ్చు.. కానీ.. సాగ‌ర్ లో గెల‌వ‌డం క‌ష్టం. సో.. కోటిరెడ్డి అనే లీడ‌ర్ కి ప‌ద‌వి ఆఫ‌ర్ చేశారు. మామూలుగా టీఆర్ఎస్ లీడ‌ర్లు.. టీఆర్ఎస్ అభ్య‌ర్థిని గెలిపించుకోవ‌డానికి రెడీగా ఉంటారు. కానీ.. ఈయ‌న్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మీకు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తానంటే ఆగుతారా చెప్పండి. ప్ర‌తి నియోజ‌క వ‌ర్గంలోనూ ఎమ్మెల్యే అభ్య‌ర్థితో పాటు.. స‌మ ఉజ్జీలు ఉండ‌నే ఉంటారు క‌దా. అంత ఫేమ‌స్ అయ్యి.. అంత బ‌లం ఉన్న లీడ‌ర్లు ఇద్ద‌రు ముగ్గురు ఉంటారు. క‌నీసం ఒక్క‌రైనా ఉంటారు అదే పార్టీలో. ఇప్పుడు సాగ‌ర్ ఏరియాలోని అలాంటి లీడ‌రే.. కోటి రెడ్డి. ఆయ‌న‌కే ఇప్పుడు ఎమ్మెల్సీప‌ద‌వి ఆఫ‌ర్ ఇచ్చారు.

అస‌లే కీల‌క ఘ‌ట్టానికి చేరుకుంది ప్ర‌చారం. ఇవ్వాళ్టితో బంద్. ఇక లక్ష్మీదేవి క‌టాక్షమే కాపాడుతుంది ఆ విష‌యం అంద‌రికీ తెలిసిందే క‌దా. ఇంత దాకా వ‌చ్చిన త‌ర్వాత కూడా సీఎం కేసీఆర్ ఇలాంటి వ‌న్ ప్ల‌స్ వ‌న్ ఆఫ‌ర్ పెట్టారు అంటే.. గెల‌వ‌క‌పోవ‌చ్చు అనే లెక్క‌ల్లో ఉన్నారు అని లెక్క‌లేస్తున్నారు పొలిటిక‌ల్ అన‌లిస్టులు. సో.. ఎమ్మెల్యే ప‌ద‌వి గెలుచుకుని వ‌స్తే.. మ‌రో ప‌ద‌వి అన‌గానే.. లీడ‌ర్లు అంతా ఏకం కావ‌డం జ‌రుగుతుంది క‌దా. కాస్త కాస్త మ‌న‌స్ప‌ర్థ‌లు ఉన్నా.. అన్నీ సెట్ రైట్ అవుత‌య్. అందుకే.. సాగ‌ర్ లో ఈ వ‌న్ ప్ల‌స్ వ‌న్ ఆఫ‌ర్ పెట్టార‌ని.. ఫుల్ గా డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది.


Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle