newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

16-04-202116-04-2021 13:57:31 IST
Updated On 16-04-2021 14:35:56 ISTUpdated On 16-04-20212021-04-16T08:27:31.262Z16-04-2021 2021-04-16T08:19:01.385Z - 2021-04-16T09:05:56.770Z - 16-04-2021

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చిన్న వయసులోనే పెద్ద జబ్బులు సోకడంతో కొందరు పిల్లలు బ్రతకడం కష్టం. అలాంటప్పుడు వారి కోరికలు ఏవైనా తీర్చి అలాగైనా వారిని ఆనందంగా ఉంచొచ్చు అని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా పోలీసు కమిషనర్ గా సాదిఖ్ అనే పిల్లాడు ఒక్కరోజు విధులు నిర్వర్తించాడు. ఆ విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ గుర్తు. చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలన్న సాదిఖ్ కలలను క్యాన్సర్ మహమ్మారి చిదిమేసింది. సాదిఖ్ పరిస్థితి తెలుసుకున్న మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌ అతడి కోరిక తీర్చడంపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ అనుమతి తీసుకుని 2014 అక్టోబర్‌ 15న సాదిఖ్‌ను హైదరాబాద్‌ నగరానికి ఒక రోజు పోలీస్ కమిషనర్‌గా చేసింది. ఇప్పుడు ఆ సాదిఖ్ మన మధ్య లేడు. తుదిశ్వాస విడిచాడు. 

Oneday Hyderabad Police Commissioner Sadiq Passed away - Sakshi

పదేళ్ల వయసులో హైదరాబాద్‌ నగరానికి ఒక రోజు పోలీసు కమిషనర్‌గా పని చేసిన సాదిఖ్‌ బుధవారం కరీంనగర్‌ సమీపంలోని రేకుర్తిలో కన్నుమూశాడు. సుదీర్ఘ కాలంగా రక్త కేన్సర్‌తో (లుకేమియా) బాధపడుతున్న బాలుడి వయసు ప్రస్తుతం 17 ఏళ్లని తండ్రి జావేద్‌ బాషా తెలిపారు. సాదిఖ్‌కు పోలీసు ఉద్యోగం అంటే మక్కువ. ఈ నేపథ్యంలోనే మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌ అతడి కోరిక తీర్చడంపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ అనుమతి తీసుకున్న ఈ సంస్థ 2014 అక్టోబర్‌ 15న సాదిఖ్‌ను హైదరాబాద్‌ నగరానికి ఒక రోజు కమిషనర్‌గా చేసింది. అప్పట్లో నగర కొత్వాల్‌గా ఉన్న ఎం.మహేందర్‌రెడ్డి నుంచి సాదిఖ్‌ ఈ బాధ్యతలు స్వీకరించారు.

 సాదిఖ్‌ ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, తన కుమారుడి కోరిక తీర్చిన పోలీసు విభాగానికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని జావేద్‌ బాషా అన్నారు. ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా కొనసాగుతున్న ఎం. మహేందర్‌రెడ్డి అప్పట్లో నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్నారు. ఆయన నుంచి బాధ్యతలు స్వీకరించిన సాదిఖ్ ఒకరోజు కమిషనర్‌గా విధులు నిర్వర్తించాడు. సాదిఖ్‌‌ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బుధవారం స్వగ్రామంలో అతడు తుదిశ్వాస విడిచాడు. సాదిఖ్ మరణం పలువురిని కలచివేస్తోంది.  

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   13 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   15 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   21 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   19 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   18 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle