newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

పాతబస్తీలో దారుణం.. పెళ్లి చేసుకోమని అడిగిన యువతి

18-10-202018-10-2020 19:16:23 IST
Updated On 19-10-2020 10:35:32 ISTUpdated On 19-10-20202020-10-18T13:46:23.081Z18-10-2020 2020-10-18T13:46:10.247Z - 2020-10-19T05:05:32.716Z - 19-10-2020

పాతబస్తీలో దారుణం.. పెళ్లి చేసుకోమని అడిగిన యువతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిని తన అన్న సహాయంతో అతి కిరాతకంగా చంపేశాడు. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనా నగర్‌కి చెందిన ముస్తఫా, నారాయణ్‌ఖేడ్‌కి చెందిన రాధిక కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో రాధికను ముస్తఫా దూరం పెట్టాడు. దీంతో ఆమె నేరుగా ప్రియుడి ఇంటికెళ్లింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ రాధిక ముస్తఫా ను నిలదీసింది.

ఇంతలో ముస్తఫా అన్న జమీల్ కలుగజేసుకున్నాడు. ప్రియుడు ముస్తఫా, అతని అన్న జమీల్ ఇంట్లోకి తీసుకెళ్లి దారుణంగా రాధికను చంపేశారు. ఆమెను కత్తితో పొడిచి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితులను రెయిన్ బజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం రాధిక మృతదేహాన్ని నారాయణ్‌ఖేడ్‌కి తరలించారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఈ ఘటన హైదరాబాద్‌ పాతబస్తీ రెయిన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మధీనా నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరుపుతూ ఉన్నారు. పెళ్లి చేసుకోమని కోరినందుకే రాధికను హత్య చేసినట్లు భావిస్తూ ఉన్నారు.  

హైదరాబాద్ లో దారుణం.. స్నేహితులని నమ్మితే..!


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle