newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

14-05-202114-05-2021 17:35:13 IST
Updated On 14-05-2021 16:17:43 ISTUpdated On 14-05-20212021-05-14T12:05:13.296Z14-05-2021 2021-05-14T10:46:47.904Z - 2021-05-14T10:47:43.522Z - 14-05-2021

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్: కోవిడ్ వైరస్ ను అరికట్టేందుకు అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, శానిటైజర్లను ఎప్పటికప్పుడు వాడటమే వ్యక్తిగతంగా పాటిచవలసిన జాగ్రత్తలను ప్రసారం చేసింది. కానీ ఆ నియమాలను, నిబంధనలను జనం పూర్తిగా పాటిస్తున్నారా? మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ లోనే పరిస్థితి మెరుగ్గా ఉందంటూ మంత్రులు, అధికారులు చేస్తున్న ప్రకటనల్లో సారం ఎంత అనే సందేహాలు కలుగుతున్నాయి.

లాక్ డౌన్ మినహాయింపుల్లో భాగంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉదయం 6 నుంచి 10 వరకు సడలించారు. ఈ నాలుగు గంటల్లోనే ఇటు హైదరాబాద్ లోనూ, ఇతర ప్రాంతాలలోనూ, ఇటు మార్కెట్లు, అటు వ్యాపార కేంద్రాల వద్ద జనం పెద్ద సంఖ్యలో చేరుకోవడాన్ని బట్టి చూస్తే సందు దొరికితే కుమ్మేసే కరోనా వైరస్ ఇంత జన సమూహం మధ్య మరింత వేగంగా వ్యాపిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నాలుగు గంటల వ్యవధిలో కోవిడ్ నిబంధనలకు నీళ్లు వదిలేయడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. మొదటిసారి లాక్ డౌన్ పెట్టినప్పుడు అన్ని దుకాణాల ముందు గడులు గీసేవారు. వాటి మధ్య నిలుచొని తమ వంతు వచ్చిన తరువాతే ప్రజలు కొనుగోళ్లు చేసేవారు. 

కానీ ఇప్పుడు ఈ నాలుగు గంటల సడలింపులో అలాటి నిబంధనలేవీ కనిపించడం లేదు. కూరగాయల మార్కెట్లు మొదలుకొని అన్ని చోట్లా జనం ఎగబడుతున్నారు. తమ వస్తువులను చేజిక్కుంచుకునేందుకు తెగబడుతున్నారు. ఎల్బి నగర్ నుంచి హైటెక్ సిటీ వరకు అన్ని ప్రహాదానా వ్యాపార కేంద్రాలలోనూ పెద్ద సంఖ్యలో జనం గుమికూడిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. కొన్ని పెద్ద మార్కెట్లలో శారీరక ఉష్ణోగ్రతను తనిఖీ చేస్తున్నా సామాజిక దూరం అనే నిబంధన కనిపించడం లేదు. ఇక మాస్కులన్నవి అలంకారప్రాయంగా ముఖానికి వేలాడుతున్నాయే తప్ప అవి ఉండాల్సిన చోటులో ఉండటం లేదు.   

ఈ నాలుగు గంటల వ్యవధిలోనే అన్ని పనులు పూర్తి చేసుకోవాలన్న ఆరాటమే ప్రజలను పెద్ద సంఖ్యలో రోడ్లమీదకు రప్పిస్తోంది. అన్ని చోట్లా కూడా ప్రభుత్వ నియంత్రణ అన్నది సాధ్యం కాదు కాబట్టి కోవిడ్ తీవ్రతను ఇప్పటికే చవిచూసిన జనం తమ వ్యక్తిగత బాధ్యతగా ఈ నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. ఉదయం ఆరు దాటగానే పెద్ద సంఖ్యలో రోడ్లమీదకు వస్తున్న ప్రజలు సడలింపు గడువు పూర్తయినా కూడా రోడ్ల మీదనే కనిపించడం అదీ సామాజిక దూరం లేకుండా సంచరించడం కోవిడ్ వ్యాప్తికి పచ్చజెండా ఊపడమే అంటున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కోవిడ్  కాటేస్తుందన్న సృహను ప్రజలు వీడితే అందుకు మూల్యం చెల్లించుకోకతప్పదన్న వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలి. 

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

   3 hours ago


ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

   5 hours ago


సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

   7 hours ago


బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

   7 hours ago


పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

   8 hours ago


థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

   8 hours ago


కక్షసాధింపు ఏమాత్రం కాదు..

కక్షసాధింపు ఏమాత్రం కాదు..

   9 hours ago


తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

   9 hours ago


నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

   13-06-2021


జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

   13-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle