newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

హయ్యో.. పోతానంటే ఉండమని ఆపేవాళ్లే లేరా రాములక్కా..!

21-11-202021-11-2020 19:54:56 IST
2020-11-21T14:24:56.553Z21-11-2020 2020-11-21T14:24:52.853Z - - 02-12-2020

హయ్యో.. పోతానంటే ఉండమని ఆపేవాళ్లే లేరా రాములక్కా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సర్ నేను పార్టీ మానేస్తున్నా.

అవునా. పోలే.

సార్ నేను పార్టీకి సేవలు చేయకుండా వేరే పార్టీలోకి వెళ్తున్నా.

అదేనమ్మా చెప్పావ్ కదా. ఓకే మరి. 

హయ్యో ఏంటండీ.. అలా మాట్లాడుతారు.

చెప్పండి విజయశాంతి గారూ.. మీరు పార్టీ మారుతున్నా అన్నారు. సరే అన్నాను. ఇంకేం కావాలి. డిస్కషన్ ఈజ్ ఓవర్ కదా. వెళ్లండి. 

కనీసం ఏ పార్టీలోకి వెళ్తున్నానో కూడా అడగరా. 

అది మీ ఇష్టం అమ్మా.. ఎక్కడో ఒక చోట అనుకోక పోతారా.. ఏదో ఒక పేపర్లోనో టీవీ చానళ్లోనో వేయక పోతారంటావా.. తెలుస్తుందిలే. మీకు ఆ మాత్రం పాపులారిటీ ఉంది కదా.

అదేంటండీ.. వెళ్తున్నా అంటే.. కనీసం ఉండమని అడగరా..

ఉండి ఏం లాభం అండీ మీ వల్ల.. పోతే ఏం నష్టం వస్తుందండీ.

ఇదండీ డిస్కషన్. ఇలా జరిగి ఉంటుంది అనే టాక్ ఫుల్ గా బయటికొచ్చింది. విజయ శాంతి అంటే లేడీ టైగర్.. కానీ.... ఏంటో ఈ మాటలు మరి.

జాబ్ మానేస్తానంటే.. ఆగండి సార్.. మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి.. ఎందుకెళ్తున్నారూ అనేలా ఉండాలి కానీ.. పోతున్నా అంటే.. సరే సర్.. నమస్తే అనేలా జాబ్ చేయకూడదు అంటారు. కానీ.. రాములక్క విషయంలో రెండో పాయింట్ కరెక్ట్ ఏమో అనిపిస్తోంది. రాములక్క అంటే.. మామూలుగానే గిర్రు గిర్రున తిరుగుతుంటారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. ఏ పార్టీ తరపున మాట్లాడుతారో తెలీదు. కానీ.. పార్టీ మారే టైంలో.. పోతున్నా అంటే.. ఎందుకు ఏం కతా అని అడిగే వాళ్లు కూడా లేరంటే కాస్త విడ్డూరంగానే ఉంది. సినిమాల్లో సరిలేరు నీకెవ్వరూ అనేలా ఎదిగిన రాములక్క పరిస్థితి.. రాజకీయాల్లో నువ్వు ఎవరికీ సరి రాలేవు అనేలా ఉందా అంటే నమ్మడానికి కాస్త విడ్డూరంగానే ఉంది. కానీ.. ఏం చేస్తాం చెప్పండి.. నమ్మలేని నిజాలు కొన్నుంటయ్. అదే జరిగిందంట. మొన్నటి దాకా ఒకళ్లూ ఇద్దరూ ఎందుకమ్మా పార్టీ మారతానంటున్నావట వినిపిస్తోంది. ఎక్కడుండి ఏం ఉపయోగంలే.. పెద్దాళ్లందరూ ఈ పార్టీలోనే ఉంటున్నారు కదా. మీరూ పెద్దవారయ్యారు కదా ఇక్కడే ఉండకపోయారా అని అడిగారట. పోనీ మీకు రెస్పెక్టులు గట్రా సరిగా లేవని అనుకుంటున్నారో ఏమో.. ఇంపార్టెంట్ మీటింగ్ లు జరిగే టైంలో.. మీరూ వచ్చి.. ఏదో ఒక మూలన కుర్చీ వేసుకుని కూర్చుంటే మిమ్మల్ని ఎవరు కాదంటున్నారు అని అడిగేవారట. జీహెచ్ఎంసీ ఎన్నికల అభ్యర్ధుల లిస్ట్ ఫైనలింగ్ కి కూడా రండి మేడమ్ అని అడిగారట. కానీ.. ప్రచారానికి పిలిచిన పాపాన పోలేదంట. విజయశాంతి అనే లీడర్ పేరే లేకుండా చేశారట. అదేంటో మేడమ్ గురించి ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుంది. మరి బీజేపీ వాళ్లు కూడా లైట్ తీసుకున్నారా.. రండి రండి అని పిలవడం లేదేమో అంటున్నారు. అటూ కాకుండా.. ఇటు కాకుండా సినిమాల్లో బిజీ అయిపోతారేమో అనే టాకూ వినిపిస్తోంది. చూద్దాం.. ఈ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో.

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

   an hour ago


పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

   2 hours ago


ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

   3 hours ago


పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

   3 hours ago


అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

   4 hours ago


ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

   4 hours ago


పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

   4 hours ago


ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

   5 hours ago


వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

   6 hours ago


ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

   6 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle