newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

8వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ.. పొడిగించిన ప్రభుత్వం

30-04-202130-04-2021 18:33:56 IST
Updated On 01-05-2021 07:34:09 ISTUpdated On 01-05-20212021-04-30T13:03:56.241Z30-04-2021 2021-04-30T13:03:40.533Z - 2021-05-01T02:04:09.774Z - 01-05-2021

8వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ.. పొడిగించిన ప్రభుత్వం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా అదుపులోకి రాని నేపథ్యంలో ప్రస్తుతం అమలులో ఉన్న నైట్ కర్ఫ్యూను మే 8వ తేదీ వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నైట్ కర్ఫ్యూ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొని నేపథ్యంలో హై కోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. మొదట నైట్ కర్ఫ్యూ విధించినప్పటి నుంచి కోవిడ్ కేసుల తీవ్రతతో ఎలాంటి తగ్గుదల లేకపోవడం అలాగే మరణాల సంఖ్య కూడా అదుపులోకి రాక పోవడంతో ఈ అంశంపై హై కోర్టు దృష్టి పెట్టింది.

45 నిముషాల వ్యవధిలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే తామే ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని హై కోర్టు స్పష్టం చేయడంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడి అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా మరొక వారం పాటు కర్ఫ్యూను పొడిగిస్తున్నామని కోర్టు ఆదేశాలకు సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది తెలియజేశారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో ప్రభుత్వం ఆశించిన రీతిలో వ్యవహరించడం లేదని, ఎలాంటి తాత్సారం లేకుండా వైరస్ అదుపు చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసును మే ఐదవ తేదీకి వాయిదా వేసింది.

'Mann Ki Baat': వదంతులు నమ్మవద్దు కోవిడ్ పై ప్రధాని మోదీ

రాష్ట్రంలో మొదటిసారి కర్ఫ్యూ విధించడం కూడా కోర్టు తీవ్ర ఆదేశాల నేపథ్యంలోనే జరిగింది. ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు వైరస్ అదుపు చర్యలలో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ వచ్చాయి. తమ తమ రాష్ట్రాల లోని కర్ఫ్యూ తీవ్రతను బట్టి దీనిని పొడిగించాయి. ఇది రంజాన్ మాసం కావడం వల్ల  కర్ఫ్యూ ప్రభావం చాలా తీవ్ర స్థాయిలోనే అన్ని వ్యాపారాల పైనా పడింది. ముఖ్యంగా రాష్ట్రంలో వస్త్రాల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది.

మరోపక్క వైరస్ నిరోధంలో భాగంగా ప్రజలందరికీ వ్యాక్సిన్ ను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయాత్తమవుతోంది. డ్రోన్లద్వారా ఈ వ్యాక్సిన్లను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతులు ఇచ్చింది. పరిమిత పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ వ్యాక్సిన్లను సరఫరా చేయడానికి ఈ అనుమతి లభించింది. అయితే ఏ వ్యాక్సిన్ ఈ ప్రయోగాత్మక డెలివరీలో పంపిణీ చేస్తారన్నది స్పష్టం కాలేదు. ఇప్పటికే ఈ డ్రోన్ల వినియోగం విషయంలో పౌర విమానయాన శాఖ ఆంక్షలు విధించినప్పటికీ  తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు తెలిసింది. 

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   31 minutes ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   an hour ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   a day ago


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   20 hours ago


కాంగ్రెస్సే ఉంటే ఇలా జరిగేదా.. బాబే ఉంటే ఇలా జ‌రిగేదా

కాంగ్రెస్సే ఉంటే ఇలా జరిగేదా.. బాబే ఉంటే ఇలా జ‌రిగేదా

   13-05-2021


కేటీఆర్ త‌ప్పించుకుంటున్నారా

కేటీఆర్ త‌ప్పించుకుంటున్నారా

   13-05-2021


రుయాలో చనిపోయింది 11 మంది కాదు 31 మంది: టీడీపీ

రుయాలో చనిపోయింది 11 మంది కాదు 31 మంది: టీడీపీ

   13-05-2021


నిరుద్యోగులకు ఆరువేలు ఇవ్వండి.. ప్రధానికి 12 పార్టీల విజ్ఞప్తి

నిరుద్యోగులకు ఆరువేలు ఇవ్వండి.. ప్రధానికి 12 పార్టీల విజ్ఞప్తి

   13-05-2021


విద్యా ప్రమాణాలు పెంచండి : అధికారులకు జగన్ ఆదేశం

విద్యా ప్రమాణాలు పెంచండి : అధికారులకు జగన్ ఆదేశం

   12-05-2021


అంతా కేంద్ర పెత్తనం వల్లే !  ఢిల్లీకి కొవ్యాక్సిన్ సరఫరా నిరాకరణపై సిసోడియా

అంతా కేంద్ర పెత్తనం వల్లే ! ఢిల్లీకి కొవ్యాక్సిన్ సరఫరా నిరాకరణపై సిసోడియా

   12-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle