newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈటెల క‌బ్జా ఎవ్వారం.. న్యూస్ ఛాన‌ల్ గురించే జ‌నం డిస్క‌ష‌న్

01-05-202101-05-2021 08:05:49 IST
Updated On 01-05-2021 10:37:25 ISTUpdated On 01-05-20212021-05-01T02:35:49.287Z01-05-2021 2021-05-01T02:34:25.160Z - 2021-05-01T05:07:25.099Z - 01-05-2021

ఈటెల క‌బ్జా ఎవ్వారం.. న్యూస్ ఛాన‌ల్ గురించే జ‌నం డిస్క‌ష‌న్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక వార్త బ‌య‌టికి వ‌చ్చింది. అంటే.. మీడియా సోష‌ల్ మీడియా.. ఇలా బ‌య‌టికి వ‌స్తుంది. ప్ర‌స్తుతానికి అయితే అదే ఆప్ష‌న్. ఒక వార్త ఇమీడియ‌ట్ గా జ‌నంలోకి వెళ్లింది. అంద‌రి అటెన్షన్ డ్రా చేసింది. హ‌డావిడి చేసింది అంటే.. న్యూస్ ఛాన‌ల్ త‌ర్వాత‌నే. వేరే సోర్స్ ద్వారా అంత‌లా హైలైట్ కాదు. సో.. న్యూస్ చాన‌ల్ కానీ.. బ్రేకింగ్ న్యూస్ పెట్టేస్తే.. పావు గంట‌లో స్టేట్ మొత్తం పాకి పోతుంది వార్త‌. మ‌న ద‌గ్గ‌ర అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల‌కీ చేరి పోతుంది. 

సో.. వార్త హ‌డావిడి జ‌రిగిందీ అంటే న్యూస్ ఛాన‌ల్ లో వ‌చ్చిన‌ట్లే అర్దం. ఈటెల క‌బ్జాల ఆరోప‌ణ‌ల గురించి కూడా న్యూస్ ఛాన‌ల్ లోనే వ‌చ్చింది. బ్రేకింగ్ న్యూస్ అంటూ హ‌డావిడి చేశారు. త‌ర్వాత వేరే వాళ్లు అందుకున్నారు. ఇదంతా రెగ్యుల‌రే. అఫ్ కోర్స్.. ముందుగా హ‌డావిడి చేసిన ఛాన‌ల్ కి పేరొస్తుంది. కానీ.. త‌ర్వాత ఆ ఛాన‌ల్ ని ప‌ట్టించుకోరు. కానీ.. ఈటెల విష‌యంలో మాత్రం అలా కాదు. ఈటెల క‌బ్జాల‌పై ఓ ఛాన‌ల్ చేసిన ప్ర‌చారాన్ని చూసి.. హ‌వ్వా అని ముక్కున వేలేసుకుంటున్నారు జ‌నాలు. అరె ఏంట్రా ఇది అంటున్నారు. ఎందుకంటే.. ప్ర‌భుత్వ ఛాన‌ల్ గా ముద్ర ప‌డిన ఛాన‌ల్ ఏంటో అంద‌రికీ తెలుసు క‌దా. ఆ ఛాన‌ల్ లో వ‌చ్చిన బ్రేకింగ్స్.. హైలైట్ అయ్యాయి.  

మంత్రి ఈటెల క‌బ్జా ఆరోప‌ణ‌ల వెన‌క‌.. సీఎం కేసీఆర్ ఉన్నారా

అరే ఏంట్రా ఇది. ఒక మినిస్ట‌ర్ గురించి ప్ర‌భుత్వ ఛాన‌ల్ గా పార్టీ ఛాన‌ల్ గా ముద్ర ప‌డిన ఛాన‌ల్ లో బ్రేకింగ్ న్యూస్ రావ‌డం ఏంటి.  ముందే స్పెష‌ల్ డ్రైవ్ లు చేసి పెట్టుకోవ‌డం ఏంటి. చిన్న విష‌యాన్ని ఇంత పెద్ద‌గా చూపించ‌డం ఏంటి. అస‌లు ఈ టార్గెట్ ఏంటి  అనుకున్నారు. వెంట‌నే అందుకున్న ఛాన‌ల్స్ కూడా ప్ర‌భుత్వ స‌పోర్టింగ్ ఛాన‌ల్స్ గా.. టీఆర్ఎస్ స‌పోర్టింగ్ ఛాన‌ల్స్ గా జ‌నం చేత గుర్తింపు పొందిన ఛాన‌ల్సే కావ‌డంతో.. ఇదేదో టార్గెట్టే అని ఫీల‌వుతున్నారు జ‌నాలు. కానీ.... ఆ ఛాన‌ల్ లో వ‌చ్చిన బ్రేకింగుతో.. జ‌నం షాకింగులో ఉన్నారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle