newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

14-04-202114-04-2021 16:25:20 IST
Updated On 14-04-2021 11:38:45 ISTUpdated On 14-04-20212021-04-14T10:55:20.652Z14-04-2021 2021-04-14T05:30:44.957Z - 2021-04-14T06:08:45.032Z - 14-04-2021

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను నల్గొండ జిల్లా అనుమలలో స్థానికులు అడ్డుకోవడంతో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకానొక సమయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ మొదలైంది.  కాంగ్రెస్ శ్రేణులపై దాడిచేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనయుడు జయవీర్ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కల్పించుకున్న పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేసేందుకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఓ కానిస్టేబుల్ తలకు గాయం కావడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ రంగనాథ్ పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులను భారీగా మోహరించారు.

ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జానారెడ్డి కొడుకులు పథకం ప్రకారమే మంగళవారం సాయంత్రం అనుములలో టీఆర్‌ఎస్‌ ర్యాలీపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయించారన్నారు. జానారెడ్డి ఆటలు ఇక సాగవని మంత్రి హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి లాంటి విషపురుగులు వచ్చి ఇక్కడ అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని, జానారెడ్డి తన పెద్దరికాన్ని నిలబెట్టేలా వ్యవహరిస్తే మంచిదన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా ఈ నెల 17న సాగర్‌ ప్రజలు జానారెడ్డికి సరైన బుద్ధిచెప్పేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారని చెప్పారు.

ఎమ్మెల్యేగా ఏడుసార్లు, రాష్ట్రమంత్రిగా 17 ఏండ్లు పదవులు అనుభవించిన జానారెడ్డి నాగార్జునసాగర్‌కు చేసిందేమీలేదని జగదీశ్‌రెడ్డి అన్నారు. సాగర్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌తో కలిసి అనుముల మండలంలోని కొత్తపల్లిలో మంగళవారం మంత్రి ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక గుండాగిరిని పూర్తిగా అణిచివేశామని చెప్పారు.

కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో కరెంట్‌ కోతలు, చేనేత కార్మికుల ఆకలిచావులు, రైతన్నల ఆత్మహత్యలే ఉండేవని.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక వాటిని పారదోలామని స్పష్టం చేశారు. దేశంలో వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని చెప్పారు. 2014లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాకే నియోజకవర్గంలో అభివృద్ధి మొదలైందని చెప్పుకొచ్చారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కృషి ఫలితంగానే నెల్లికల్లు లిఫ్ట్‌, డీ 8, 9 డిస్ట్రిబ్యూటరీలకు లిఫ్ట్‌లు, హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరయ్యాయని చెప్పారు. 

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   7 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   18 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle