newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

ఎమ్మెల్సీ బరిలో పీవీ కుమార్తె.. అసలు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఇదే..

23-02-202123-02-2021 13:11:58 IST
Updated On 23-02-2021 10:26:20 ISTUpdated On 23-02-20212021-02-23T07:41:58.326Z23-02-2021 2021-02-23T02:28:11.081Z - 2021-02-23T04:56:20.687Z - 23-02-2021

ఎమ్మెల్సీ బరిలో పీవీ కుమార్తె.. అసలు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఇదే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసేందుకు సురభి వాణీదేవికి సీఎం కేసీఆర్ బీ-ఫారం అందించారు. నామినేషన్ వేసేందుకు సోమవారం నాడు ఎంతో ఉత్సాహంతో వెళ్లిన వాణీదేవికి నిరాశ ఎదురైంది. నామినేషన్ పత్రాలు సరైన ఫార్మాట్లో లేవని అధికారులు తిరస్కరించారు. అప్పటికే సమయం మించిపోవడంతో వాణీదేవి వెనుదిరిగారు. దాంతో ఆమె మంగళవారం ఉదయం నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓడిపోయే స్థానంలో అవకాశం ఇచ్చి పీవీ కుటుంబాన్ని అవమానిస్తున్నారని విమర్శిస్తున్నారు.

నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన టీఆర్ఎస్ హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి మాత్రం అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించింది. టీఆర్ఎస్ అనూహ్యంగా మాజీ ప్రధాని పీవీ కూతురు సురభి వాణి దేవికి ఎమ్మెల్సీ టికెట్‌ను కేటాయిస్తుందని ఎవ్వరు కూడా ఊహించలేదు. ఈ స్థానం నుంచి పోటీకి దింపే విషయంలో టీఆర్ఎస్ తీవ్ర కసరత్తు చేసిన అనంతరం పీవీ కూతురికి టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానిగా పని చేసి.. ఆ పార్టీతో సంబంధాలున్న వాణి దేవికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం ద్వారా ఆమె పీవీ కూతురిగా హస్తం పార్టీ సానుభూతిపరులను తనవైపు తిప్పుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు. బీజేపీకి అండగా నిలుస్తున్న బ్రాహ్మణ సామాజిక వర్గ ఓట్లను చీల్చడానికి కూడా ఆమె ఎంపిక దోహదం చేస్తుందని కూడా భావిస్తూ ఉన్నారు. బ్రాహ్మణుల ఓట్లు గంపగుత్తగా ప్రస్తుత ఎమ్మెల్సీ రామచంద్రరావుకు కూడా పడకుండా సురభి వాణి దేవికి ఓట్లు పడే అవకాశం లేకపోలేదని భావిస్తూ ఉన్నారు. 

సురభి వాణి దేవిని దింపడం ద్వారా ఒకే దెబ్బతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు షాక్ ఇవ్వాలన్నదే కేసీఆర్ ప్లాన్ అని కూడా అంటున్నారు. రాజకీయ లబ్ది కోసమే పీవీ కుమార్తెను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారని ఇతర పార్టీల నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఓడిపోయే స్థానం కాబట్టే ఇక్కడ పీవీ కుమార్తెని అభ్యర్థిగా ప్రకటించారని కాంగ్రెస్, బీజేపీ నేతలు వాపోతున్నారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle