కోదండరాంను ఓడించేందుకు కుట్రలు నిజమేనా?
23-02-202123-02-2021 08:07:20 IST
Updated On 23-02-2021 10:18:22 ISTUpdated On 23-02-20212021-02-23T02:37:20.270Z23-02-2021 2021-02-23T02:36:52.011Z - 2021-02-23T04:48:22.554Z - 23-02-2021

కోదండరామ్ ను ఓడించడానికి జరుగుతున్న కుట్రలు అనే పాయింట్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో ఇంట్రస్టింగ్ గా మారింది. అసలు కోదండరామ్ అంటే.. తెలంగాణకి దిక్కూ దిశా అనుకునే రోజులు ఎటు పోయాయో కూడా ఎవరికీ తెలీదు. తను కోరితే ఏ పదవి అయినా దక్కుతుంది అనుకున్న టైం నుంచి.. ఎమ్మెల్సీ పదవి కూడా దక్కకుండా చేస్తున్నారు అనేదాకా మారిపోయాయి సిచ్చువేషన్స్. పాలిటిక్స్ అంటే ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. ఎంత పెద్ద ప్రజాదరణ పొందిన లీడర్లకి అయినా కొన్ని కొన్ని సార్లు.. పరిస్థితులు చేతుల్లో ఉండవు. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ పరిస్థితి కూడా అదే. ఉస్మానియా తో పాటు పలు యూనివర్సిటీల విద్యార్థుల ఆందోళన కూడా అదే. కోదండరామ్ ని ఓడించడానికి కుట్రలు జరుగుతున్నాయి అంటున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కోదండరామ్ ని ఓడించడానికి పార్టీలన్నీ కలిసి కుట్రలు చేస్తున్నాయి అనేది వారి వాదన. కానీ.. ఆ విషయాన్ని ఎవరూ బయటికి చెప్పడం లేదు. మనలో మనం ఎవరో ఒకరం గెలుద్దాం కానీ.. కోదండరామ్ మాత్రం గెలవడానికి వీళ్లేదు అనేలా మారిందంట. కోదండరామ్ అంటే.. టీఆర్ఎస్ కి ఎక్కడ లేని రెస్పెక్ట్ ఉండేది. సీఎం కేసీఆర్ కి కూడా అంతే. తర్వాత తర్వాత అవన్నీ మారిపోయాయి. రాజకీయంగా కోదండరామ్ కూడా సీఎం కేసీఆర్ కి అడ్డం తిరిగారు. ఇప్పుడు వాటి ఫలితమే.. కోదండరామ్ ని ఓడించాలనే ప్లాన్స్ వెనక రీజన్ కావచ్చు అంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారు అనుకుంటున్నా.. పబ్లిక్ ఫిగర్ గా మాత్రం కోదండరామ్ కి పేరుంది. తాను గెలుస్తారు అనే లెక్కలు కూడా ఉన్నాయి. కానీ.. టీఆర్ఎస్ మాత్రం.. కోదండరామ్ ని ఓడించాలనే పట్టుమీద ఉందంట. మిగతా అభ్యర్థులు కూడా మెయిన్ గా కోదండరామ్ నే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే.. ఒక చోట పోటీకి నిలబడ్డప్పుడు గెలవడానికి అందరూ శాశ శక్తుల కృషి చేస్తారు. కానీ.. ఇక్కడ మాత్రం.. కోదండరామ్ ని ఓడించడానికే అందరూ ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది అనేది హాట్ టాపిక్ అయింది.

ఎమర్జెన్సీపై రాహుల్ వ్యాఖ్యలు హాస్యాస్పదం.. జవదేకర్ ఎద్దేవా
7 hours ago

ఆత్మహత్యకు ప్రయత్నించిన మాగంటి బాబు కుమారుడు
8 hours ago

భారీగా నామినేషన్ల ఉపసంహరణ
9 hours ago

బీజేపీకి రైతుల పాపం ఊరికే పోతుందా
an hour ago

గ్రేటర్ మేయర్ ప్రేమ, అభిమానం కోసం.. నేను కుక్కలా పుడతా- వర్మ
8 hours ago

మున్సిపల్ పోరుపై బాబు ఫోకస్
9 hours ago

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా.. చిన్నమ్మ
11 hours ago

స్టాలిన్ ని ఓడిస్తా అంటున్న హిజ్రా
4 hours ago

నేను వైసీపీలో చేరను-గంటా క్లారిటీ
11 hours ago

విశాఖ ఉక్కు అయిపోయింది.. విశాఖ పోర్టు వంతు వచ్చింది
12 hours ago
ఇంకా