newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

14-04-202114-04-2021 09:57:02 IST
Updated On 14-04-2021 12:24:32 ISTUpdated On 14-04-20212021-04-14T04:27:02.332Z14-04-2021 2021-04-14T03:27:41.597Z - 2021-04-14T06:54:32.364Z - 14-04-2021

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న‌లుగురు ఎమ్మెల్యేలు. ఎవ‌రు ఆ ఎమ్మెల్యేలు గంజా కొట్టారా.. కొకైన్ తీసుకున్నారా.. డ్ర‌గ్స్ లో మునిగి తేలారా. ఏమో.. ఎవ‌రికి తెలుసు. ఆ ఈవెంట్ కి అటెండ్ అయిన వారి లిస్ట్ తీసుకుని.. మొత్తానికి ర‌క్త ప‌రీక్ష‌లు చేస్తే గానీ క్లారిటీస్ రావు. క్లారిటీస్ రావాలి అంటే ర‌క్త ప‌రీక్ష‌లు చేయాలి. ప‌రీక్ష‌లు చేయాలి అంటే విచార‌ణ‌కి పిల‌వాలి. విచార‌ణ‌కి పిల‌వాలి అంటే ముందు నోటీసులు ఇవ్వాలి. 

ఎస్.. నోటీసులు ఇచ్చే ద‌గ్గ‌రే చాలా మెలిక‌లు ఉన్న‌య్. నోటీసులు అందాయి అని తెలిస్తే.. ఆ ఎమ్మెల్యేల బ‌తుకు చిత్రం రోడ్డుపైకి ఎక్కిన‌ట్లే. మీడియా సోష‌ల్ మీడియాలో లాగి ఈడ్చేస్తారు. గుంజి గుంజి ప‌రువు తీస్తారు. బ‌తుకు బ‌స్టాండ్ అంటారు కదా. అక్క‌డి దాకా వెళ్తుంది ఎవ్వారం. మ‌త్తు వ‌ద‌ల‌రా అంటూ.. జ‌నాలు కూడా ముద్ర వేసేస్తారు. సో.. నోటీసులు ఎవ‌రికి ఇవ్వాలి. సీక్రెట్ గా విచార‌ణ‌కి పిలిచి ప‌రీక్ష‌లు చేయ‌డం పై సాధ్యాసాధ్యాల‌ను ఆలోచిస్తున్నార‌ట పోలీసులు. ఎందుకంటే వాళ్లు మామూలు మ‌నుషులు కాదు క‌దా. ప్ర‌జా సేవ‌కోసం కంక‌ణం క‌ట్టుకుని.. డ్ర‌గ్స్ పార్టీల‌కి అటెండ్ అయిన ప్ర‌జా ప్ర‌తినిధులు కదా మ‌రి. 

డ్ర‌గ్ రాకెట్ లో ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేలు

ఇప్పుడు ఓ నిందితుడిని బెంగళూరు పోలీసులు మీడియా ముందు పెట్టారు. ఏంటి క‌ల‌హ‌ర్ రెడ్డి ఏం క‌తా.. డ్ర‌గ్స్ తీసుకున్నావా లేదా.. ఎవ‌రెవరు ఉన్నారు ఏం సంగ‌తి అంటే.. అంతా చెప్పేశాడు. మూడేళ్ల క్రితం జ‌రిగిన పార్టీ అది. పార్టీ దుమ్ములేచిపోయేలా జ‌రిగిన మాట వాస్త‌వ‌మే.. శంక‌ర్ గౌడ్ పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి హైద‌రాబాద్ నుంచి బ‌డా బాబులు చాలా మంది అటెండ్ అయ్యారు. ఈవెంట్ మేనేజ‌ర్లు, సినిమా హీరోలు, హీరోయిన్లు, మిగ‌తా సెల‌బ్రిటీల‌తో పాటు ప్ర‌జా ప్ర‌తినిధులు కూడా చాలా మందే అటెండ్ అయ్యారు. అయితే.. వారంద‌రూ డ్ర‌గ్స్ తీసుకున్నారా లేదా అన్న‌ది నేను చూడ‌లేదు అన్నాడు క‌ల‌హ‌ర్ రెడ్డి. మ‌రి క‌ల‌హ‌ర్ రెడ్డి బ‌య‌టికే ఇంత మంది ఉన్నారు అని చెప్పాడు అంటే.. లోప‌ల పోలీసుల స్టైల్ లో ఎంక్వ‌యిరీ చేస్తే.. ఇంకెన్ని విష‌యాలు చెప్పాడో అనేది అంద‌రికీ అర్దం అవుతూనే ఉంది క‌దా. 

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle