newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్

08-03-202108-03-2021 17:44:01 IST
2021-03-08T12:14:01.939Z08-03-2021 2021-03-08T11:58:00.552Z - - 11-04-2021

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రసమితి నేతృత్వంలోని తమ ప్రభుత్వాన్ని కానీ, కేసీఆర్‌ని కాని నోటికొచ్చినట్లు తూలనాడితే ఇక ఊరుకునేది లేదని మంత్రి కె. తారకరామారావు తీవ్రంగా హెచ్చరించారు. తాము కూడా మోదీ, అమిత్‌షాలను విమర్శించగలమని.. కానీ, పదవులకు గౌరవమిస్తున్నామని పేర్కొన్నారు. తమ మౌనం గోడకు వేలాడే తుపాకీ అని, అది కాల్పులతో గర్జించడం మొదలుపెడితే ప్రత్యర్థులు తట్టుకోలేరన్నారు. 

తాను, ఈటల రాజేందర్, హరీశ్‌రావు ఎంతో మాట్లాడగలమని హెచ్చరించారు. ఉద్యమ సమయంలోని కేసీఆర్‌ వాగ్ధాటి మళ్లీ బయటికి వస్తే ఆయన్ను ఎదుర్కోవడం ఎవరితరం కాదన్నారు. ఏడేళ్లలో తాము అన్ని ఎన్నికలు గెలిచామని, ఒక్క దుబ్బాకలో 500 ఓట్లతో గెలిచి కొందరు విర్రవీగుతున్నారని బీజేపీని ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఉద్దేశించి అన్నారు. 

బీజేపీ తరఫున గెలిచిన నలుగురు ఎంపీలు ఏ రోజైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా  సీఎంను పట్టుకుని బట్టేబాజ్‌ అనడానికి.. ఎన్ని గుండెలు మీకు.. మేము మీకంటే ఎక్కువ మాట్లాడగలం. మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ సహా మా నేతలు ఎక్కువ తిట్టగలరు. అలా చేస్తే మీరు తట్టుకోలేరు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా మీద మేము మాట్లాడలేమావయసుకు, పదవులకు మర్యాద ఇస్తున్నాం. దీనిని మీరు గుర్తుంచుకోవాలి’’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 

తెలంగాణ రాకపోతే బీజేపీ, టీకాంగ్రెస్‌ నేతలు ఎక్కడుండేవారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. జన్‌ధన్‌ ఖాతాతో రూ.15 లక్షలు వస్తాయని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినవారు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. కరోనాతో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలు ఇస్తామని చెప్పిన కేంద్రం.. ఎక్కడ ఇచ్చిందో చూపాలన్నారు. ప్రశ్నించే గొంతుకలమంటున్న నేతలు ఐటీఐఆర్‌ రద్దయినప్పుడు, కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ పెట్టనందుకు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. 

తెలంగాణ వచ్చాక సామాన్య ప్రజలకు కరెంటు సమస్య తీరిన విషయాన్ని, ప్రతి ఇంటికీ మంచినీరు వచ్చిన విషయాన్ని గమనించాలన్నారు. తెలంగాణ ధాన్యాగారంగా మారడం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి 2లక్షల 77 వేల కోట్లు కేంద్రానికి వెళ్తే.. రాష్ట్రానికి వచ్చింది 1.40 లక్షల కోట్లేనని తెలిపారు. మనం చెల్లించినదాంట్లో తిరిగి సగం పైసలు మాత్రమే రాష్ట్రానికి కేంద్రం ఇస్తుందన్నారు.

కేంద్రం తెలంగాణకు అన్ని విషయాల్లో అన్యాయమే చేస్తోందన్నారు. ప్రశ్నించే గొంతులని చెప్పుకునే రాష్ట్ర బీజేపీ నేతలు దీనిపై నోరుమెదపడం లేదని విమర్శించారు. తెలంగాణ వచ్చాక అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ప్రభుత్వాన్ని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. ప్రశ్నించే గొంతుక కాదు.. సమస్యలు పరిష్కరించేవారు కావాలి. బీజేపీ నేతలు ప్రశ్నించే గొంతుకకు ఓటు వేయాలని ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతోపాటు రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదు అని కేటీఆర్ నిలదీశారు.

జర్నలిస్టులకు 54 కోట్ల కార్పస్ ఫండ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే.. కేటీర్

ఆదివారం తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ (టీయూడబ్ల్యూజే (హెచ్‌–143)) ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో జరిగిన సమావేశంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా వివిధ శాఖల్లో ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలిచ్చామని, త్వరలోనే 55 వేల కొలువులకు నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు. 

ఏడాదిలోగా రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల సమస్య తీరుస్తానని, ఇది తన హామీ అని మంత్రి కె. తారకరామారావు అన్నారు. దేశంలో జర్నలిస్టులకు రూ.54 కోట్ల కార్పస్‌ ఫండ్‌ కేటాయించిన ఘనత కేసీఆర్‌ సర్కారుదేనన్నారు. త్వరలోనే దీన్ని రూ.100 కోట్లకు చేర్చేలా కృషి చేస్తామన్నారు. 

ఉద్యమ సమయంలో మా వెంట నిలిచిన విద్యార్థులు, లాయర్లు, జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామన్నారు. ఇప్పటికే మీడియా అకాడమీకి రూ.15 కోట్ల వ్యయంతో ఐదంతస్తుల భవనం కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. విధి నిర్వహణలో మరణించిన 260 మంది విలేకరుల కుటుంబానికి రూ.లక్ష చొప్పున, అనారోగ్యంతో పనిచేయలేని విలేకరుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున అందజేసిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. 

గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాల్లోనూ అక్రెడిటేషన్లు 3,000 దాటలేదని, కేవలం తెలంగాణలోనే 19,150 మందికి ప్రభుత్వం అక్రెడిటేషన్‌, వైద్య సదుపాయాలు కల్పించి గుర్తించిందన్నారు. త్వరలోనే మీ అందరికీ యూనియన్‌  కార్యాలయం కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. చనిపోయిన జర్నలి్‌స్టల పిల్లలు రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదువుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. మీడియా అకాడమీకి ప్రభుత్వం రూ.15 కోట్లతో అన్ని ఆధునిక సదుపాయాలతో 5 అంతస్తుల మల్టీసోర్డ్‌ బిల్డింగ్‌ను మంజూరు చేసిందన్నారు. హైదరాబాద్‌లో కూడా యూనియన్‌ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   16 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   15 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   19 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle