newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

మంత్రి హ‌రీష్‌రావుచే 500 ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల పంపిణీ..

25-09-202025-09-2020 11:16:58 IST
2020-09-25T05:46:58.895Z25-09-2020 2020-09-25T05:46:56.897Z - - 30-10-2020

మంత్రి హ‌రీష్‌రావుచే 500 ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల పంపిణీ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారీ వ‌ర్షాల‌కు ఇళ్లు నేల‌మ‌ట్ట‌మై ఆశ్ర‌యం లేని 500కు పైగా కుటుంబాల‌కు మంత్రి హ‌రీష్‌రావు ప‌ట్టాదారు పాసు పుస్త‌కాలు పంపిణీ చేశారు. సిద్ధిపేట కొండా భూదేవి గార్డెన్‌లో వ‌ర్షాల కార‌ణంగా ఇళ్లు నేల‌కొరిగాయి. దీంతో ఒక్కొక్క కుటుంబానికి రూ.3200 చొప్పున్న చెక్కుల‌ను అంద‌జేశారు. అంతేకాకుండా 220 మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌కి సంబంధించిన 2 కోట్ల 19 లక్షల 50 వేల రూపాయల చెక్కును మంత్రి హ‌రీష్  పంపిణీ చేశారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖలో ఇబ్బందులు ఉండకూడదని రెవెన్యూ ప్రక్షాళన చేయించార‌ని తెలిపారు. ప్రతి ఒక్క రైతుకు 5 వేల రూపాయల రైతుబంధు ఇస్తున్నామని, పేర్కొన్నారు. పేదింటి ఆడ పిల్లల పెళ్లిలకు లక్షా 116 వేల రూపాయల సాయాన్ని అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో తప్పా దేశంలో ఏ రాష్ట్ర సీఎం ఇవ్వడం లేదు, బీజేపి, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కూడా ఇవ్వడం లేదు అని హరీష్ పేర్కొన్నారు.

ఈ ఏడాది వానాకాలం వానాలు అధికంగా పడ్డాయి. వారం రోజుల్లోపు నియోజకవర్గంలో ఏదైనా గ్రామం ముందుకొస్తే సీడ్ విలేజ్ గా మార్చేందుకు కృషి చేస్తా. విత్తనోత్పత్తి కేంద్రంగా సిద్ధిపేట జిల్లాను మార్చుకుందాం. విత్తనోత్పత్తి వల్ల అధిక లాభాలున్నాయి. వారంలోపు విత్తనోత్పత్తి కోసం రైతులు ముందుకు వస్తే మీకు తోడ్పాటు అందిస్తా. జిల్లాలో పామాయిల్ ఉత్పత్తికి అనుకూలమని ఢీల్లీ నుంచి ఆమోదం వచ్చింది.. జిల్లాలో 48 వేల ఎకరాలకు  ఫామ్ ఆయిల్ తోటలకు అనుమతి వచ్చిందని' మంత్రి హ‌రీష్ వెల్ల‌డించారు. 

టీఆర్ఎస్ చేతల పార్టీ అని, బీజేపీ మాయ మాటల పార్టీ’’ అంటూ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి వాటాగా.. హక్కుగా రావాల్సిన కోటా ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం మాయమాటలు చెబుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్రంపై ధ్వజమెత్తారు.

తెలంగాణకు హక్కుగా రూ.10 వేల కోట్లు కేంద్రం నుంచి రావాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తోందని, బీజేపీ ప్రభుత్వం రైతులపై బాంబులు వేస్తోందంటూ ఆయన ధ్వజమెత్తారు. ఎకరానికి ఏటా పెట్టుబడి సాయం కింద రూ.10 వేలు ఇస్తున్నామన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక చట్టం అమలు చేస్తోందని.. ఆ విధానాలు నచ్చక కేంద్రమంత్రి రాజీనామా చేశారని విమర్శించారు.

టీఆర్ఎస్ పార్టీ చేతల్లో చూపే ప్రభుత్వమని, 7 లక్షల ఆడ పిల్లల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని, ఆర్థిక సాయం కింద ఇప్పటి దాకా రూ.5555 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదని పేర్కొన్నారు. 

సంక్రాంతికి గంగిరెద్దుల మాదిరిగా ఓట్ల కోసం వచ్చేవారెవరో.. గుర్తించాలని కోరారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల కోసం గతంలో ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడేవారని, అయినా పాసు పుస్తకాలు పొందేవారు కారని, కొత్త రెవెన్యూ చట్టం.. రైతులకు మేలు కోసం సీఎం కేసీఆర్ తెచ్చారని వివరించారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle