newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మంత్రి ఈటెల క‌బ్జా ఆరోప‌ణ‌ల వెన‌క‌.. సీఎం కేసీఆర్ ఉన్నారా

01-05-202101-05-2021 07:33:20 IST
Updated On 01-05-2021 07:40:18 ISTUpdated On 01-05-20212021-05-01T02:03:20.228Z01-05-2021 2021-05-01T02:03:10.721Z - 2021-05-01T02:10:18.835Z - 01-05-2021

మంత్రి ఈటెల క‌బ్జా ఆరోప‌ణ‌ల వెన‌క‌.. సీఎం కేసీఆర్ ఉన్నారా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టార్గెట్ టెన్ మైల్స్ అయితే.. లెవంత్ మైల్ పై ఫోక‌స్ చేయాలి అంటారు క‌దా. సీఎం కేసీఆర్ ఈ విష‌యంలో చాలా క్లారిటీగా ఉంటారు అని వార్త‌లు వినిపిస్తున్న‌య్. మామూలుగా అయితే.. అధికార పార్టీకి చెందిన లీడ‌ర్ పై ఇలాంటి ఆరోప‌ణ‌లు చాలా అరుదుగా వ‌స్త‌య్. మినిస్ట‌ర్ ఈటెల రాజేంద‌ర్ లాంటి వారిపై అయితే ఛాన్సే ఉండ‌దు. సౌమ్యుడు.. ప్ర‌జా మ‌నిషిగా పేరుంది. ఇన్నేళ్ల కెరీర్ లో ఆయ‌న్ని ప‌ర్స‌న‌ల్ గా టార్గెట్ చేసిన లీడ‌ర్ ఎక్క‌డా లేరు. పొలిటిక‌ల్ గా పార్టీ ప‌రంగా మాట్లాడ‌డ‌మే కానీ.. ఈటెల వ్య‌క్తిగ‌త జీవితాన్ని గానీ.. ఆయ‌న ఆస్తుల గురించి కానీ.. ఆయ‌న మాట‌ల గురించి కానీ.. ఎవ‌రూ కామెంట్ చేయ‌రు. అదీ ఈటెల రాజేంద‌ర్ వ్య‌క్తిత్వం.

అంత మంచి మినిస్ట‌ర్. ఈ వారం రోజులుగా తెలంగాణ‌లో ఈటెల‌కి మంచి పేరొస్తోంది. కరోనాని డీల్ చేసే విష‌యంలో కాస్త స్పీడ్ పెంచారు. ఓప‌క్క సీఎం కేసీఆర్ కి.. మ‌రో ప‌క్క మినిస్ట‌ర్ కేటీఆర్ కి క‌రోనా రావ‌డంతో.. చాలా యాక్టివ్ అయ్యారు ఈటెల రాజేంద‌ర్. యుద్ధ విమానాల‌తో పేషెంట్ల కోసం ఆక్సిజ‌న్ తీసుకొచ్చి మ‌రీ హీరో అయిపోయారు. అప్పుడే అనుకున్నారు.. సీఎం కేసీఆర్ కి కోపం వ‌స్తున్న‌ది కావ‌చ్చు.. ఈటెల రాజేంద‌ర్ హీరో అయిపోతున్నారు అనిపిస్తున్న‌ది. కానీ.. ఎల‌క్ష‌న్ టైం కాబ‌ట్టి.. అంతా గ‌ప్ చుప్ గా ఉంది అనేది జ‌నం మాట‌. ఎందుకంటే.. ఎల‌క్ష‌న్ అయిపోయిన గంట‌కే.. హీట్ పెరిగింది. ఈటెల క‌బ్జాల గురించి న్యూస్ బ‌య‌టికొచ్చింది.

ఈటెల క‌బ్జా.. ఈటెల క‌బ్జాలు.. మంత్రి భూ దాహం.. అంటూ.. అబ్బో.. మీడియాలో టాం టాం న్యూస్ బ‌య‌టికొచ్చింది. ఇలాంటి వార్త‌లు వ‌చ్చాయో రాలేదు.. వెంట‌నే సీఎం కేసీఆర్ విచార‌ణ‌కు ఆదేశించారు. ఇదింకా సూప‌ర్ అంటూ.. పొలిటిక‌ల్ గా అంద‌రూ డిస్క‌స్ చేస్తున్నారు. ఈటెల మీద క‌బ్జా ఆరోప‌ణ‌లు ఏంటి.. సీఎం కేసీఆర్ వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశాలు ఇవ్వ‌డం ఏంటి.. అస‌లు రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంది. టీఆర్ఎస్ పార్టీలో ఏం జ‌రుగుతోంది. ఈటెల రాజేంద‌ర్ కు సీఎం కేసీఆర్ కు చాలా కాలంగా విభేదాలు ఉన్న‌య్. అది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఈటెల రెబ‌ల్ గా మాట్లాడ్డం.. సీఎం కేసీఆర్ ఇండైరెక్ట్ వార్నింగ్ లు ఇవ్వ‌డం చూస్తూనే ఉన్నాం. మినిస్ట‌ర్ కేటీఆర్.. వీళ్లిద్ద‌రినీ క‌ల‌పాలి అని చేసిన ప్ర‌య‌త్నాలు కూడా వ‌ర్క‌వుట్ కాలేద‌నేది టాక్.. సో.. సీఎం కేసీఆరే.. వెన‌కుండి.. ఈటెల‌ను టార్గెట్ చేశారు అనే టాక్ ఫుల్ గా న‌డుస్తోంది.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle