newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

Mayor election.. అనూహ్యంగా తెరాస‌కు జైకొట్టిన ఎంఐఎం.. బీజేపీకి స‌రికొత్త ఆయుధం!

11-02-202111-02-2021 21:52:06 IST
Updated On 11-02-2021 14:27:17 ISTUpdated On 11-02-20212021-02-11T16:22:06.557Z11-02-2021 2021-02-11T08:51:20.059Z - 2021-02-11T08:57:17.482Z - 11-02-2021

Mayor election.. అనూహ్యంగా తెరాస‌కు జైకొట్టిన ఎంఐఎం.. బీజేపీకి స‌రికొత్త ఆయుధం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక ప్ర‌క్రియ పూర్త‌యింది. తెరాస సీనియ‌ర్ నేత కే. కేశ‌వ‌రావు కుమార్తె, బంజారాహిల్స్ తెరాస కార్పొరేట‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీ మేయ‌ర్‌గా ఎన్నిక‌య్యారు. డిప్యూటీ మేయ‌ర్‌గా తార్నాక కార్పొరేట‌ర్ మోతె శ్రీ‌ల‌తను ఎన్నుకున్నారు. గ‌త రెండు రోజుల నుండి విజ‌య‌ల‌క్ష్మీ పేరు ప్ర‌చారంలో ఉంది. అనుకున్న‌ట్లుగానే ఆమెకు మేయ‌ర్ ప‌ద‌వి ద‌క్కింది. అయితే మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌లో ఊహించ‌ని రీతిలో ఎంఐఎం తెరాస‌కు జై కొట్టింది. ఆదినుంచి మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ స్థానాల‌కు తాము బ‌రిలో ఉంటామ‌ని ప్ర‌క‌టించిన ఎంఐఎం హ‌ఠాత్తుగా తెరాస‌కు జై కొట్ట‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా దారితీసింది.

మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌కు ఎంఐఎం బ‌రిలోకి దిగ‌కుండా సీఎం కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌లో తాము బ‌రిలో ఉంటామ‌ని అస‌దుద్దీన్ ఓవైసీ తొలి నుంచి చెబుతూ వ‌చ్చారు. దీంతో మేయ‌ర్ ఎన్నిక ప్ర‌క్రియ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంద‌ని అంద‌రూ భావించారు. మేయ‌ర్ ఎన్నిక ప్ర‌క్రియ ప్రారంభం కాగానే.. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఎంఐఎం కార్పొరేట‌ర్లు తెరాస నుంచి మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ అభ్య‌ర్థులుగా బ‌రిలో నిలిచిన విజ‌య‌క్ష్మీ, శ్రీ‌ల‌త‌ల‌కు మ‌ద్ద‌తు తెలిపారు. దీంతో ఎలాంటి ఉత్కంఠ వాతావ‌ర‌ణం లేకుండానే మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక కొద్ది నిమిషాల్లోనే పూర్త‌యింది. 

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో బీజేపీ వేగంగా దూసుకొస్తుంది. గ్రేట‌ర్‌లో 48 మంది కార్పొరేట‌ర్ల‌ను ఆ పార్టీ గెలుచుకొని ఎంఐఎం, తెరాస‌ల‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ఈ క్ర‌మంలో న‌గ‌రంలో బీజేపీ దూకుడుకు అడ్డుక‌ట్ట వేసేందుకే తెరాస‌, ఎంఐఎంలు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విని త‌మ కేటాయించాల‌ని ఎంఐఎం కేసీఆర్ ముందు ప్ర‌తిపాద‌న పెట్టిన‌ట్లు స‌మాచారం. అయితే అందుకు కేసీఆర్ ఒప్పుకోలేద‌ని, దీంతో తెరాస‌తో క‌లిసి గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీజేపీని నిలువురించేందుకు మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌లో  అయిష్టంగానే ఎంఐఎం తెరాసకు జైకొట్టిన‌ట్లు తెలుస్తుంది. అయితే గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభం నుంచి తెరాస‌, ఎంఐఎంలు ఒకేతాను ముక్క‌లే అంటూ బీజేపీ ప్ర‌చారం చేస్తూ వ‌చ్చింది. బీజేపీ ఆరోప‌ణ‌ల‌ను తెరాస‌, ఎంఐఎంలు ఖండించుకుంటూ వ‌చ్చాయి. బీజేపీ ఈ వాద‌న‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లి 48మంది కార్పొరేట‌ర్ల‌ను గెలుచుకుంది.

ప్ర‌స్తుతం మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌లో బీజేపీ ఆరోప‌ణ‌లు నిజం చేస్తూ ఎంఐఎం కార్పొరేట‌ర్లు భేషరతుగా తెరాస‌కు మ‌ద్ద‌తు తెలిపారు. దీంతో ఎంఐఎం, తెరాస బంధాన్ని ప్ర‌జ‌ల్లోకి మ‌రింత తీసుకెళ్లేందుకు క‌మ‌ల ద‌ళానికి ఓ ఆయుధం దొరికిన‌ట్ల‌యింది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్త‌యిన వెంట‌నే బీజేపీ ముఖ్య నేత‌లు ఎంఐఎం, తెరాస బంధాన్నిఎండ‌గ‌ట్టారు. ప్ర‌జ‌లు ఇప్ప‌టికైనా అర్థం చేసుకోవాల‌ని మీడియా ముఖంగా తెలియ‌జేశారు. రాబోయే కాలంలో ఇదే అంశాన్ని ఆయుధంగా తీసుకొని బీజేపీ ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి బీజేపీ ఆయుధం రాబోయే ఎమ్మెల్సీ, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఏ విధంగా ప‌నిచేస్తుందో వేచి చూడాల్సిందే. 

మేయర్ పీఠంపై కేశవరావు కుమార్తె విజయలక్ష్మి


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle