newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆ టీడీపీ ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ లోకి చేరిపోయారు.. ఖాళీ అయినట్లే..!

08-04-202108-04-2021 22:44:11 IST
Updated On 08-04-2021 10:18:29 ISTUpdated On 08-04-20212021-04-08T17:14:11.493Z08-04-2021 2021-04-08T02:59:56.102Z - 2021-04-08T04:48:29.517Z - 08-04-2021

ఆ టీడీపీ ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ లోకి చేరిపోయారు.. ఖాళీ అయినట్లే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ లో రెండు బలమైన పార్టీలు ఏవంటే వైసీపీ, టీడీపీ అనే చెప్పుకోవచ్చు. కొద్దిరోజుల కిందట తెలంగాణలో కూడా ఈ రెండు పార్టీలు రాజకీయాలను చేశాయి. కానీ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో అధికారం లోకి రావడంతో తెలంగాణలో ఆ పార్టీ కార్యక్రమాలని పట్టించుకునే వారే లేరు.. ఇక ఇటీవలే వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు వార్తలు వస్తుండడంతో వైసీపీ అభిమానులంతా ఆమె పార్టీ వైపే చూస్తూ ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ మనుగడ సాగించింది. అయితే కొన్ని కారణాల వలన తెలుగుదేశం పార్టీ కూడా తన ప్రాబల్యాన్ని కోల్పోవడం మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కువగా ఏపీ మీదనే ఫోకస్ చేయడం.. బడా నాయకులంతా టీడీపీని వదిలి ఇతర పార్టీలలోకి వెళ్ళిపోతూ వచ్చారు. దీంతో టీడీపీలో కూడా శూన్యమే కనిపిస్తూ ఉంది. 

ఇక తెలంగాణ శాసనసభలో టీడీపీ ప్రాతినిధ్యం తాజాగా ముగిసింది. టీడీపీ చిట్టచివరి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీడీపీకి తెలంగాణ అసెంబ్లీలో ఒక్క సభ్యుడు కూడా లేకుండా పోయారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరిపోగా. మిగిలిన ఒకే ఒక్క ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తాజాగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ అందించారు.

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో మనుగడ సాగిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఇది తీవ్ర నిరాశ కలిగించే పరిణామమని అంటున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వరావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ అభ్యర్థులుగా గెలిచారు. వీరు తెలంగాణలో టీడీపీని మరింత ముందుకు తీసుకుని వెళతారని చంద్రబాబు నాయుడు, టీడీపీ క్యాడర్ ఆశించారు. అయితే టీఆర్ఎస్ లోకి చేరిపోవడంతో తెలంగాణలో టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   13 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   9 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   16 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle