కేటీఆర్ తో మంచు మనోజ్.. అఖిలప్రియ కోసం రాయబారమా?
12-01-202112-01-2021 17:56:12 IST
Updated On 12-01-2021 19:22:27 ISTUpdated On 12-01-20212021-01-12T12:26:12.089Z12-01-2021 2021-01-12T12:26:06.898Z - 2021-01-12T13:52:27.716Z - 12-01-2021

హఫీజ్ పేట భూ వ్యవహారంలో కిడ్నాప్ కోణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. సెటిల్మెంట్ తో పోయే వ్యవహారం కాస్తా ఎన్నో మలుపులు తిరిగి ఆఖరికి కిడ్నాప్, అరెస్ట్ దాకా వెళ్ళింది. ఏపీ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియ అరెస్ట్ అవ్వడం కూడా సంచలనమే.. ఇక కిడ్నాప్ చేయబడ్డ వాళ్లు కేసీఆర్ బంధువులు కావడంతో మ్యాటర్ ను పోలీసులు మరింత సీరియస్ గా తీసుకున్నారు. ఇక భూ వ్యవహారంపై పెద్దలు మధ్యవర్తిత్వం వహిస్తే మాట్లాడడానికి తాను ముందుకు వస్తానని భూమా మౌనిక చెప్పడం చూస్తుంటే తప్పు తమ వైపే ఉన్నట్లుగా భూమా వర్గం ఒప్పేసుకున్నట్లేనని అంటున్నారు. అయితే ఈ సెటిల్మెంట్ కు ఎవరు ముందుకు వస్తారనే అంశాన్ని కూడా ప్రజలు బాగా చర్చించుకుంటూ ఉన్న సమయంలో భూమా కుటుంబానికి సన్నిహితంగా ఉండే మంచు మనోజ్ మంత్రి కేటీఆర్ ను కలవడం హాట్ టాపిక్ అయ్యింది. సీనియర్స్,యువత విషయంలో తన స్పోర్ట్స్, ఎడ్యుటైన్మెంట్ ప్రాజెక్టు విజన్ ను కేటీఆర్ తో మంచు మనోజ్ పంచుకున్నట్టు ట్విట్టర్లో ఉంది. తన ప్రాజెక్టు విషయంలో సానుకూలంగా స్పందించినందుకు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు మంచు మనోజ్ .మొత్తంగా కేటీఆర్ ను కలసి తన ప్రాజెక్టుపై చర్చించిన్నట్టు ట్విట్టర్లో కేటీఆర్ తో కలసిన ఫోటోను పోస్ట్ చేసారు మంచు మనోజ్. భూమా ఫ్యామిలీకి అండగా రాజీకి మంచు మనోజ్ ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ మొదలైంది. హఫీజ్ పేట భూ వ్యవహారంలో మంచు మనోజ్ తన వంతు సాయం భూమా కుటుంబానికి అందించేందుకు ముందుకు వచ్చారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే చాలా మంది ఈ వదంతులను కొట్టి వేస్తూ ఉన్నారు కూడానూ..! కిడ్నాప్ చేసే ముందు పట్టుబడిన నిందితులు ఆరు సిమ్ కార్డులను తమ ఆధార్ కార్డు, వేలిముద్రలు, ఫోటోలు ఇచ్చి కొనుగోలు చేశారు. కిడ్నాప్ జరిగిన రోజు రాత్రి, మీడియాలో విస్తృతంగా వార్తలు రావడం, ఆపై పోలీసుల సోదాలు ముమ్మరం కావడంతో నిందితులను విడిచి పెట్టాలని నిర్ణయించుకున్న కిడ్నాపర్లు నార్త్ జోన్ డీసీపీకి అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఫోన్ చేశారు. వారు ప్రవీణ్ సోదరుడు సునీల్ తో డీసీపీని కలిపి మాట్లాడించారు. అంతకు ముందు అదే ఫోన్ నుంచి కిడ్నాపర్లు అఖిలప్రియకు కాల్ చేయడంతో పోలీసులకు పెద్ద క్లూను అందించింది. ఆ ఫోన్ నంబర్ అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ వద్ద పీఏగా పనిచేస్తున్న గుంతకల్లుకు చెందిన మల్లికార్జున్ దే అని గుర్తించారు. దీంతో అతనిని అరెస్ట్ చేశారు. విచారణలో అఖిల ప్రియ మొత్తం ప్లాన్ ను అమలు చేసిందని మిగిలినవారు చెప్పారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ
3 hours ago

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది
3 hours ago

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల
5 hours ago

దేవినేని ఉమ విడుదల..!
7 hours ago

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!
8 hours ago

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు
8 hours ago

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం
10 hours ago

బలమేంటో తెలీదా.. లేదంటే బలమే లేదా
12 hours ago

మతం పేరు వర్కవుట్ అవుతుందా.. తెలుగోళ్లు పట్టించుకుంటారా
13 hours ago

ఉన్నదే ముచ్చటగా ముగ్గురు నలుగురు.. మళ్లీ అందులో గ్రూపులా
14 hours ago
ఇంకా