newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

లాక్ డౌన్ ప‌ది రోజుల్లో అయిపోదు

12-05-202112-05-2021 08:08:21 IST
Updated On 12-05-2021 08:58:07 ISTUpdated On 12-05-20212021-05-12T02:38:21.237Z12-05-2021 2021-05-12T02:37:55.500Z - 2021-05-12T03:28:07.243Z - 12-05-2021

లాక్ డౌన్ ప‌ది రోజుల్లో అయిపోదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అంద‌రం అనుకుంటున్నాం. నిన్న‌టి వార్త‌ల్లో విన్నాం. సీఎం కేసీఆర్ చెప్పిన‌ట్లుగా ప‌ది రోజులే లాక్ డౌన్ అనుకుంటున్నం. నిజ‌మే.. సీఎం కేసీఆర్ చెబితే.. అంత‌కు మించి ఏముంటుంది  అనుకుంటాం. అందులో త‌ప్పేం లేదు. మ‌రి మొన్న‌టికి మొన్న‌నే.. సీఎం కేసీఆర్ ఏం చెప్పారు. రాష్ట్రం అంతా కంట్రోల్ లో ఉంది. క‌రోనాకి మ‌న‌ల్ని మించిపోయేంత సీన్ లేదు. క‌రోనాని  కంట్రోల్ చేశాం.. ఈ నాలుగు గోళీలు వేసుకుంటే అయిపోతుంది అన్న‌ది కూడా ఆ సీఎం కేసీఆరే క‌దా. ఇంత‌లోనే.. వామ్మో క‌రోనాని త‌ట్టుకోలేం అంటూ లాక్ డౌన్ పెట్టేశారు. సో.. సీఎం ఎప్పుడు ఎలా అయినా మాట్లాడ‌తారు. అఫ్ కోర్స్.. జ‌నం మంచి గురించి ఆలోచించే క‌దా లాక్ డౌన్ పెట్టారు అన‌డంలో త‌ప్పేం లేదు. నిజ‌మే కూడా.

అయితే.. ఈ ప‌ది రోజులే లాక్ డౌన్ అనుకుంటే పొర‌పాటే. ఎందుకంటే మ‌న‌కంటే నెల రోజుల ముందు నుంచే లాక్ డౌన్ పెట్టిన రాష్ట్రాలు ఉన్న‌య్. ఆ రాష్ట్రాలు ఇప్ప‌టికీ లాకులు తీయ‌లేదు. లాక్ డౌన్ ని ఇంకా స్ట్రిక్ట్ గా చేస్తున్న‌య్. ఎందుకంటే.. క‌రోనా క‌ర‌ముల మ‌ధ్య‌లో న‌ల‌గిపోతున్న‌య్ ఆ రాష్ట్రాలు. అఫ్ కోర్స్.. మ‌న తెలుగు రాష్ట్రాలు కూడా అంతే ఉన్న‌య్. సీఎం జ‌గ‌న్ కూడా.. స్ట్రిక్ట్ చేశారు క‌దా. కాక‌పోతే.. ఆరు గంట‌లు అనేది చాలా ఎక్కువ టైం. సీఎం కేసీఆర్ మాత్రం నాలుగు గంట‌లే స‌డ‌లింపు ఇచ్చారు. ఇంకా త‌గ్గించి ఉంటే బావుండేది అనే మాట కూడా వినిపిస్తోంది.

ఇక పోతే.. ముందు ముందు రోజుల్లో ఈ నాలుగు గంట‌ల స‌డ‌లింపు కూడా ఉండ‌క‌పోవ‌చ్చు. క‌రోనా కేసులు పెరుగుతున్న కొద్దీ.. ఓ గంట ఓ గంట త‌గ్గొచ్చు. అస‌లు మొత్తానికే ఎత్తేసి.. నిత్య‌వ‌స‌రాలు, అత్య‌వ‌స‌రాలు మాత్ర‌మే అనొచ్చు. అంతే కాదు. ప‌ది రోజుల్లో క‌రోనా ఓ దారికి వ‌స్తుంది అనుకోవ‌డం పొర‌పాటే.  పోయిన సారి కేంద్రం లాక్ డౌన్ ని ఎలా పెంచుతూ వ‌చ్చిందో చూశాం క‌దా. ఈసారి కూడా స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ అదే ఫార్ములా ఫాలో కాబోతుందంట‌. ఇక జ‌నాలు కూడా ఊళ్ల‌కి బ‌య‌ల్దేరారు.

హైద‌రాబాద్ నుంచి వెళ్లే వారు అయితే.. ఊరెళ్లి పోదాం మామా అనే పాట పాడుకుంటూ.. ఏడ్వ‌లేక న‌వ్వుతున్నారు. ప‌ది రోజుల త‌ర్వాత లాక్ డౌన్ కంటిన్యూ కావ‌చ్చు అని.. ఖాళీ చేస్తున్నారు. మిగిలిన వారు కూడా ఈ రెండు మూడు రోజుల్లో ప్ర‌త్యేకంగా వెహికిల్స్ మాట్లాడుకుని.. పొద్దున్నే స‌డ‌లింపు ఉన్న టైంలో ఇళ్ల‌కి వెళ్లాలి అని చూస్తున్నారు. ఖ‌ర్చు కాస్త ఎక్కువైనా ర‌ష్ లో వెళ్ల‌కుండా ఫ్రీగా వెళ్లాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ప‌ది రోజుల్లోగా.. స‌గం హైద‌రాబాద్ ఖాళీ అయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు అంటున్నారు జ‌నాలు. మందు బాబులు కూడా స్టాక్ పెట్టుకుంటున్నారంటే న‌మ్మండి.

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

   2 hours ago


కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

   9 hours ago


మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

   9 hours ago


ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

   10 hours ago


టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

   a day ago


వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

   24-07-2021


మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

   24-07-2021


కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

   24-07-2021


ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

   24-07-2021


AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

   23-07-2021


ఇంకా

Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle