newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

తెలంగాణలో లాక్ డౌన్.. ఎప్పటి వరకూ షాపులు తెరచి ఉంటారంటే

11-05-202111-05-2021 16:23:49 IST
2021-05-11T10:53:49.883Z11-05-2021 2021-05-11T10:53:46.345Z - - 25-07-2021

తెలంగాణలో లాక్ డౌన్.. ఎప్పటి వరకూ షాపులు తెరచి ఉంటారంటే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

 తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి కీలక నిర్ణయం తీసుకుంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్రారంభమైన మంత్రివ‌ర్గ స‌మావేశంలో లాక్‌డౌన్‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనా ఉధృతి దృష్ట్యా లాక్‌డౌన్‌తో పాటు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించి లాక్ డౌన్ ప్రకటించడమే మంచి నిర్ణయం అని భావించారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ విధిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. రేప‌టి నుంచి ప‌దిరోజుల పాటు ఈ లాక్‌డౌన్‌ కొన‌సాగ‌నుంది. ప్ర‌తిరోజు ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మాత్రం లాక్‌డౌన్‌ నుంచి మిన‌హాయింపు ఇచ్చారు. నిత్య‌వ‌స‌రాలు, ఇత‌ర వ‌స్తువుల కొనుగోలుకు ఈ స‌మ‌యంలో వెసులుబాటు క‌ల్పించారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌లు కానుంది. ఈ స‌మ‌యంలో దాదాపు అన్ని కార్య‌క‌లాపాలు నిలిచిపోనున్నాయి. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను మాత్ర‌మే అనుమ‌తించ‌నున్నారు. రంజాన్ తర్వాత లాక్ డౌన్ ప్రకటిస్తారని అనుకున్నప్పటికీ.. దానికంటే ముందే లాక్ డౌన్ ప్రకటన వెలువడింది. రేపటి నుంచే లాక్ డౌన్ అమలు చేయాలని నేటి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 65,923 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,826 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 723 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నారాయణ్ పేట్ జిల్లాలో 5 కేసులు గుర్తించారు. అదే సమయంలో 7,754 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు అవ్వగా.. 32 మంది మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 5,02,187 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4,36,619 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. కరోనా మరణాల సంఖ్య 2,771కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 82.3 శాతం కాగా, తెలంగాణలో 86.94 శాతానికి పెరిగింది. టెస్టులు తక్కువగా చేస్తూ ఉండడమే తెలంగాణలో కరోనా కేసులు తక్కువగా నమోదవ్వడానికి కారణమనే విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉంటే.. తెలంగాణలో మాత్రం అండర్ కంట్రోల్ అని చెప్పడం.. తీవ్ర విమర్శలకు తావిచ్చింది.  

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

   3 hours ago


కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

   10 hours ago


మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

   10 hours ago


ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

   11 hours ago


టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

   a day ago


వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

   24-07-2021


మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

   24-07-2021


కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

   24-07-2021


ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

   24-07-2021


AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

   23-07-2021


ఇంకా

Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle