newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

14-06-202114-06-2021 11:54:33 IST
2021-06-14T06:24:33.014Z14-06-2021 2021-06-14T06:24:27.147Z - - 25-07-2021

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తనని టిఆర్ఎస్, బిజెపి పార్టీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానించాయని, కానీ తాను మాత్రం వారి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారని చెప్పుకొచ్చారు. బలహీన వర్గాల నుండి వచ్చిన తనని తొలి నుండీ దివంగత ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడులు ఏంతో ప్రోత్సహించారని. టిడిపి హయాంలో తాను మంత్రిగా కూడా పని చేశానని, అంతే కాకుండా తనకి ఎంపీ గానూ అవకాశం కల్పించారని.. అలాంటి టిడిపి పార్టీ స్థాయి పెరిగేలా పార్టీ అభివృద్దికి కృషిచేస్తున్నానని అన్నారు. 

టిఆర్ఎస్, బిజెపి పార్టీలు తనని ప్రలోభాలకి గురిచేశాయని వస్తున్న వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఈ రెండు పార్టీల నుండి తనకి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని అన్నారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదనీ అన్నారు.. తెలంగాణ లో టిడిపి అభివృద్ధికి కృషి చేస్తూ ముందుకు సాగుతానని ఎల్. రమణ చెప్పారు. ఒక వైపు టిడిపి ని వీడనని సెలవిస్తూనే మరో వైపు టిఆర్ఎస్, బిజెపి పార్టీల ఆహ్వానంపై స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటానని అన్నారు.. ఎంతకీ ఈయన అసలేం చెప్పలనుకున్తున్నారు..? ఒక వైపు టిడిపి ని వీడే ప్రసక్తే లేదని, మరో వైపు టిఆర్ఎస్, బిజెపి ల ఆహ్వానం పై తగు నిర్ణయం తీసుకుంటానని అన్న మాటలలో అర్ధం ఏమిటో అర్ధం కాక తలలు పట్టు కుంటున్నారు జనాలు..

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

   2 hours ago


కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

   9 hours ago


మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

   9 hours ago


ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

   10 hours ago


టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

   a day ago


వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

   24-07-2021


మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

   24-07-2021


కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

   24-07-2021


ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

   24-07-2021


AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

   23-07-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle