newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

కేటీఆర్ త‌ప్పించుకుంటున్నారా

13-05-202113-05-2021 08:13:41 IST
Updated On 13-05-2021 09:51:05 ISTUpdated On 13-05-20212021-05-13T02:43:41.095Z13-05-2021 2021-05-13T02:43:37.412Z - 2021-05-13T04:21:05.821Z - 13-05-2021

కేటీఆర్ త‌ప్పించుకుంటున్నారా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీఆర్ఎస్ నేత‌ల తీరే వేరేలా ఉంది. రాజ‌కీయంలో త‌ల పండిపోయిన లీడ‌ర్లకి కూడా త‌డ‌బాటు త‌ప్ప‌డం లేదు. ఎప్పుడు ఎలాంటి సిచ్చువేష‌న్ ఎదుర్కోవాల్సి వ‌స్తుందో అర్దం కావ‌డం లేదు. రాజ‌కీయంగా గేమ్స్ ఆడ‌డం.. త‌ర్వాత ఆన్స‌ర్ లు చెప్పుకోలేని ప‌రిస్థితిలోకి జారి పోవ‌డం మామూలే క‌దా. ఇప్పుడు తెలంగాణ‌లో టీఆర్ఎస్ లీడ‌ర్ల‌కి అదే ప‌రిస్థితి ఎదురైంది. ఇన్నాళ్లూ మీడియా ముందుకు రాలేదు.. మినిస్ట‌ర్ కేటీఆర్. అఫ్ కోర్స్.. క‌రోనా వ‌చ్చి రెస్ట్ తీసుకున్నారు. త‌గ్గిన త‌ర్వాత యాక్టివ్ అయ్యారు. ఇన్ సైడ్ ఉన్నా.. ట్విట్ట‌ర్ లాంటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్.. ఈటెల విష‌యంలో గ‌ప్ చుప్ అయ్యారు. అలాగే క‌రోనా కేసుల విష‌యంలోనూ గ‌ప్ చుప్. లాక్ డౌన్ గురించి ఏ మాటా మాట్లాడ‌కుండా ఉన్నారు. 

ఇప్పుడు లాక్ డౌన్ పెట్టేశారు. మీడియా ముందుకి వ‌చ్చారు. అంతా బ్ర‌హ్మాండంగా ఉంది.. ఏం ప‌ర్లేదు ఏం ప‌ర్లేదు అన్నారు. చూసే జనాలు కూడా.. మొన్న‌టి దాకా అండర్ కంట్రోల్ లో ఉంది అని లాక్ డౌన్ పెట్టార్ లే. ఇప్పుడు చెబుతున్న‌వి కూడా అవే మాట‌లు క‌దా అనుకున్నారు. కానీ.. వాటికి కూడా కేటీఆర్ ముందుగానే క్లారిటీ ఇచ్చారు. అండ‌ర్ కంట్రోల్ లో ఉంది అని మేం అన‌డం కాదు.. దేశం కూడా అదే అంటోంది. మెడిక‌ల్ హ‌బ్ గా ఉన్న హైద‌రాబాద్ చాలా కంట్రోల్ లో ఉంది అని కేంద్రం కూడా లెక్క‌ల్లో చెబుతోంది అన్నారు. లెక్క‌ల్లో మ‌నం అన్నీ చుక్క‌లే చూపిస్తే వాళ్లు మాత్రం ఏం అంటార్ లే అనుకున్నారు.

కానీ.. కేటీఆర్ మీడియా ముందుకి వ‌చ్చినా.. తాము చెప్పాల్సింది చెప్పి సైలంట్ అయి పోయారు. మరి మీడియా వాళ్లు ఊరుకుంటారా.. ఏదో క్వ‌శ్చ‌న్స్ అడ‌గ‌బోయారు. స‌డ‌న్ గా కేటీఆర్ ఒక్క‌టే మాట అన్నారు. అవ‌న్నీ త‌ర్వాత మాట్లాడుకుందాం. మీరు ఏం అడిగినా ఆన్స‌ర్ ఇస్తా. కానీ ఇప్పుడు కాదు అన్నారు. త‌ర్వాత మ‌రోసారి అడ‌గ‌బోయినా.. మీడియాకి మ‌రోసారి అదే మాట చెప్పారు. త‌ర్వాత క‌చ్చితంగా  మాట్లాడుకుందాం అని. ఇది చూసిన ప్ర‌తి వారికీ అర్దం అయ్యేది ఒక్క‌టే.

ఈటెల రాజేంద‌ర్ గురించి ఏమైనా మాట్లాడ‌తారేమో అనే భ‌యంతో.. కేటీఆర్ అలా త‌ప్పించుకుంటున్నారు అనే విష‌యం అర్దం అవుతోంది. మ‌రీ అంత ఆన్స‌ర్లు చెప్ప‌లేని ప‌రిస్థితిని ఫేస్ చేస్తున్నారంటే... త‌ప్పు అని ఇండైరెక్ట్ గా ఒప్పుకోవ‌డ‌మేగా అంటున్నారు. మొన్న కూడా టీఆర్ఎస్ మినిస్ట‌ర్లు, లీడ‌ర్లు ఇదే మాట అన్నారు. మేం చెప్పేది చెప్పాం.. అంతే ఇక.. అన్నారు. అంటే వాళ్ల ద‌గ్గ‌ర కూడా ఆన్స‌ర్ లేదు. జ‌నాల‌కి క్లియ‌ర్ గా అర్దం అవుతోంది క‌దా. ఈటెల‌ని కావాల‌ని టార్గెట్ చేసి.. ఇప్పుడు ఆన్స‌ర్ లు చెప్ప‌లేని ప‌రిస్థితిలో ఉండిపోయారు అని.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle