తెలంగాణపై ఎందుకింత వివక్ష.. కేంద్రంపై కేటీఆర్ ద్వజం
06-03-202106-03-2021 10:24:03 IST
Updated On 06-03-2021 10:29:02 ISTUpdated On 06-03-20212021-03-06T04:54:03.421Z06-03-2021 2021-03-06T04:53:41.920Z - 2021-03-06T04:59:02.462Z - 06-03-2021

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉందని తెలంగాణ రాష్ట్రసమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై పునర్వ్యవస్థీకరణ చట్టంలో చేసిన వాగ్దానానికి కూడా తూట్లు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం మరోసారి తన తెలంగాణ వ్యతిరేకతను చాటుకుందని కేటీఆర్ ఆరోపించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయంపై కేంద్రంతో అటో ఇటో తేల్చుకుంటామని కేటీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణలో రైల్వే కోచ్ అవసరం లేదంటూ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చేసిన ప్రకటనపై కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి కీలకంగా ఉండే ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) ప్రాజెక్టును కూడా కేంద్రప్రభుత్వం రద్దు చేసిందని కేటీఆర్ విమర్శించారు. పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలోని హామీలను కేంద్రం తుంగలో తొక్కింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ ఏర్పాటు వంటి హామీలను గాలికి వదిలేసింది. పారిశ్రామిక అభివృద్ధిలో కీలకమైన రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలనే డిమాండ్‌పై కేంద్రం స్పందించడం లేదు. బుల్లెట్ ట్రైన్, హైస్పీడ్ నెట్‌వర్క్‌లలోనూ తెలంగాణకు దక్కిందేమీ లేదు అని కేటీఆర్ కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మేం భారతదేశంలో భాగం కాగా. తెలంగాణపై ఎందుకు ఇంత వివక్ష ప్రదర్శిస్తున్నారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. నవ జాత శిశువు లాంటి తెలంగాణ తన కాళ్ల మీద తాను నిలబడటానికి సాయం అందించాలని ఏళ్లుగా కోరుతున్నా కేంద్రం నుంచి స్పందన రావడం లేదు. ఇలా వివక్ష చూపితే ఎలా.. మేం భారత్‌లో భాగం కాదా? ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం మా గొంతును గట్టిగా విప్పాల్సిన అవసరం, సమయం వచ్చింది. ఇకపై ఇంటా బయటా కేంద్రంతో తేల్చుకుంటాం అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా అని నినాదం ఇస్తే సరిపోదని, చేతల్లో చూపాలని కేటీఆర్ అన్నారు. రాష్ట్రాలపై ఇలా వివక్ష చూపితే తయారీ రంగంలో చైనాతో భారత్ ఎలా పోటీపడగలదు. మేం భారత్‌లో భాగం కాదా ప్రాజెక్టులు, నిధుల విషయంలో రాజకీయాలను పక్కన పెట్టండి. మేకిన్ ఇండియా సాధ్యపడాలంటే రాష్ట్రాలు అడిగిన ప్రాజెక్టులు మంజూరు చేయండి. కేంద్రం మద్దతు ఉంటే మరింత మందికి ఉద్యోగావకాశాలు ఇవ్వగలం. కేంద్రం రాష్ట్రాలతో కలిసి పనిచేయాల్సిందే అని కేటీఆర్ స్పష్టం చేశారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన వార్షిక సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచీ కూడా కీలకమైన పారిశ్రామిక రంగంలో, న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులు, పథకాలు, ప్రోత్సాహకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతోందంటూ కేటీఆర్ ఆరోపించారు. పారిశ్రామిక రంగంతో పాటు వివిధ రంగాల్లో తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని మంత్రి తప్పుబట్టారు. టీఎస్ఐపాస్ వంటి పారిశ్రామిక విధానాన్ని తెచ్చి.. రూ.1.12 లక్షల కోట్ల పెట్టుబడులతో 15 వేల కంపెనీలను రాష్ట్రానికి రప్పించామని, సుమారు 15 లక్షల ఉద్యోగాలు కల్పించామని కేటీఆర్ వివరించారు. గత ఆరేండ్లలో వ్యవసాయం మొదలుకుని ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో రాష్ట్రం ఎంతో ప్రగతి చూపినా కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదని మండిపడ్డారు. వివిధ వేదికల మీద రాష్ట్రాన్ని ప్రశంసిస్తున్న కేంద్ర మంత్రులు తెలంగాణకు అణా పైసా సాయం చేయడం లేదని విమర్శించారు. పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలోని హామీలను కేంద్రం తుంగలో తొక్కిందని కేటీఆర్ మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు వంటి హామీలను గాలికొదిలేసిందని విమర్శించారు. పారిశ్రామిక అభివృద్ధిలో కీలకమైన రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలనే డిమాండ్‌పై కేంద్రం స్పందించడం లేదని.. బుల్లెట్ ట్రైన్, హైస్పీడ్ నెట్‌వర్క్‌లలోనూ తెలంగాణకు దక్కిందేమీ లేదని చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. రాష్ట్ర ఏర్పాటుకంటే ముందే మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును అడ్డుకోవడం ద్వారా తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు ఎన్డీయే ప్రభుత్వం మోకాలడ్డుతోందని విమర్శించారు. రాష్ట్ర ఐటీ ఎగుమతులు ఆరేండ్లలో రూ.57 వేల కోట్ల నుంచి రూ.1.40 లక్షల కోట్లకు చేరినా.. కేంద్రం నుంచి ప్రోత్సాహం కరువైందని.. అదనపు ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, హైదరాబాద్ ఫార్మాసిటీలో మౌలిక వసతులకు రూ.3,900 కోట్లు ఇవ్వాలన్న విజ్ఞప్తులపై మౌనం పాటిస్తోందని తెలిపారు. జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడారు మంజూరు, ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో రీసెర్చ్, ఇన్నోవేషన్ కోసం డిఫెన్స్ ఇంక్యుబేటర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఎయిరో ఇంజన్ కారిడార్ మంజూరు వంటి విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోవడమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, సిరిసిల్లలో పవర్ లూమ్ క్లస్టర్, నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు విషయంలో మొండి చేయి చూపుతున్నారని కేటీఆర్ వివరించారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
16 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
12 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
15 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
19 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా