newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

23-04-202123-04-2021 10:20:30 IST
2021-04-23T04:50:30.555Z23-04-2021 2021-04-23T04:50:27.139Z - - 27-07-2021

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే..! ఇప్పుడు కేటీఆర్ కు కూడా కరోనా సోకింది. ఆ విషయాన్ని ఆయనే సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసారు.  తనకు జరిపిన టెస్టుల తరువాత కరోనా లక్షణాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం తాను ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉన్నానని తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్ ప్రొటోకాల్ పాటించాలని, ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇటీవల సీఎం కేసీఆర్ కు పాజిటివ్ రాగా, ప్రస్తుతం ఆయన తమ వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 6,206 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిందని  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం తెలిపింది. ఒక్క‌రోజులో కరోనాతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో  3,052 మంది కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,79,494కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 3,24,840 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,928 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 52,726 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,005 మందికి క‌రోనా సోకింది. 

జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 63 కంటెయిన్ మెంట్ జోన్లను ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చార్మినార్ పరిధిలో 12, సికింద్రాబాద్ పరిధిలో 11, ఎల్బీ నగర్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి పరిధిలో పదేసి చొప్పున కంటెయిన్ మెంట్ జోన్లను జీహెచ్ఎంసీ ప్రకటించింది. 14 జోన్లలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు ఉన్నాయి. ఇవన్నీ కూకట్ పల్లి, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఒక ప్రాంతంలో ఐదుకు మించి కరోనా కేసులు ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ కట్టడి చర్యలు ప్రారంభించామని అధికారులు వెల్లడించారు.

 


Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle