newssting
Radio
BITING NEWS :
పదవి నుంచి దిగిపోనున్న అమెరికా ప్రస్థుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ సలహాదారు రాజీనామా చేశారు. ట్రంప్ సలహాదారు అయిన స్కాట్ అట్లాస్ తన రాజీనామా లేఖను మంగళవారం పంపించారు * కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను భారత్‌ సాధ్యమైనంత త్వరలో పొందుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ. రష్యాలో భూకంపం సంభవించింది. భారతీయ కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) ఈ విషయాన్ని వెల్లడించింది * ఆల్‌ ఇండియా జేఈఈ పరీక్షలో 270వ ర్యాంకు పొందిన ఒక యువకుడు ఒక్క తప్పిదంతో ప్రఖ్యాత ఐఐటీలో ఇంజనీరింగ్‌ సీటు కోల్పోయాడు. అక్టోబర్‌ 31న తన రోల్‌నెంబర్‌పై అప్‌డేట్ల కోసం నెట్‌లో బ్రౌజ్‌ చేస్తుండగా విత్‌ డ్రా ఫ్రం సీట్‌ అలకేషన్‌ అండ్‌ ఫరదర్‌ రౌండ్స్‌ లింక్‌ను తను క్లిక్‌ చేయడంతో సీటు కోల్పోయాడు * ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ‘బురేవి’ వాయుగుండంగా మారడంతో దీని ప్రభావం వల్ల దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీరప్రాంతాల్లో మంగళవారం మరో సారి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది * దేశరాజధానిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కరోనా మృతుల సంఖ్య తిరిగి వంద దాటింది. కరోనాతో మొత్తం 108 మంది మృతి చెందారు. ఇదే సమయంలో కొత్తగా 3,726 కరోనా కేసులు నమోదయ్యాయి * కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో గత ఆరు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాల నేతలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మంగళవారం తమతో చర్చలకు ముందుకు రావాలని కోరింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఈ మూడో దఫా చర్చలు జరగనున్నాయి * శ్రీలంకలోని మహారా జైలులో ఘర్షణలు చోటు చేసుకుని ఎనిమిది మంది ఖైదీలు మృతి. మరో 37 మందికి గాయాలు. వారిలో ఇద్దరు జైలర్లు ఉండగా గాయాలపాలైన వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై శ్రీలంక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది * సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఢిల్లీకి వెళ్లే శాలిమార్‌ ఎక్స్‌ప్రెస్ రెండు గంటల ముందే రైల్వేస్టేషన్‌ నుండి బయల్దేరడంతో.. రైళ్లు వెళ్లే సమయంపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రైల్వే అధికారులు ఇబ్బంది పెట్టారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు * యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉత్కంఠకు గురి చేసేలా జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అత్యంత పకడ్బందీ ఏర్పాట్ల మధ్య 9 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లలో ఓట్లు వేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేకంగా తీసుకున్న ఏర్పాట్లు చేశారు * నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు * నేటితో ముగియనున్న తుంగభద్ర పుష్కరాలు. కార్తిక సోమవారం సందర్భంగా ఘాట్లలో నిన్న భక్తుల తాకిడి పెరిగింది. మహిళలు నదిలో దీపాలు వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించగా.. నేడు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. పుష్కరాల ముగింపు వేళ భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా * తమిళనాడుకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా.. తర్వాత తుపానుగా మారనుంది. ఇది బుధవారం తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది * టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ అధికారులు ఊహించని షాక్‌. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో భారీ జరిమానా. త్రిశూల్‌ సిమెంట ఫ్యాక్టరీలో జేసీ భారీ ఎ‍త్తున అక్రమాలకు పాల్పడ్డారని రూ.100 కోట్ల జరిమానా విధించాలని నిర్ణయం.

గెలుక్కునేందుకే బండి సంజయ్ పాతబస్తీకి వెళ్ళాడంటున్న కేటీఆర్

21-11-202021-11-2020 07:56:09 IST
2020-11-21T02:26:09.677Z21-11-2020 2020-11-21T02:26:07.472Z - - 01-12-2020

గెలుక్కునేందుకే బండి సంజయ్ పాతబస్తీకి వెళ్ళాడంటున్న కేటీఆర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

శుక్రవారం నాడు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి గుడికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్  మధ్యాహ్నం అక్కడికి వెళ్లారు. శుక్రవారం కావడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏమి జరుగుతుందా అని పోలీసులతో పాటూ సామాన్య జనం కూడా భయపడ్డారు.  కేసీఆర్ కు సవాల్ విసినట్టుగానే మధ్యాహ్నం 12 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారికి పూజలు నిర్వహించి, ఆలయం చూట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు చార్మినార్ కు తరలి వచ్చాయి. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ మాట్లాడారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికే సంజయ్ ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. నగరంలో బిర్లా మందిర్, తాడ్ బండ్ ఆంజనేయస్వామి గుడి తదితర ఆలయాలు ఎన్నో ఉండగా... చార్మినార్ వద్దకే ఎందుకు వెళ్లారని చెప్పారు. పాతబస్తీలో గెలుక్కునేందుకే అక్కడకు వెళ్లారని విమర్శించారు. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. గుడి పేరు చెప్పి అబద్ధాలాడటం బీజేపీకి ముందు నుంచి అలవాటేనని విమర్శించారు. వరద సాయాన్ని ఆపాలంటూ ఈసీకి లేఖ రాయలేదని బండి సంజయ్ అంటున్నప్పుడు..  వరద సాయాన్ని కొనసాగించాలని మరో లేఖ రాయాల్సిందని అన్నారు. బండి సంజయ్ తనకు తాను ఒక పెద్ద నాయకుడిగా ఊహించుకుంటున్నారని విమర్శించారు. ప్రధాని మోదీని కూడా అసదుద్దీన్ ఒవైసీ కలిశారని, అసదుద్దీన్ తో మోదీ ఎందుకు సమావేశమయ్యారో సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

హైదరాబాదీలకు ఓట్ వేయాలనే అనిపించడం లేదా..?

హైదరాబాదీలకు ఓట్ వేయాలనే అనిపించడం లేదా..?

   5 minutes ago


కేటీఆర్ కు రెండుచోట్ల ఓట్లా.. చట్టం.. చుట్టమైందా?!

కేటీఆర్ కు రెండుచోట్ల ఓట్లా.. చట్టం.. చుట్టమైందా?!

   17 minutes ago


నిమ్మల, అచ్చెన్న వీళ్ళే ఈసారి కూడా టీడీపీ గతి!

నిమ్మల, అచ్చెన్న వీళ్ళే ఈసారి కూడా టీడీపీ గతి!

   an hour ago


నివార్ తుఫాన్ బాధిత రైతుల నోట మట్టిగొట్టిన ప్రభుత్వం?!

నివార్ తుఫాన్ బాధిత రైతుల నోట మట్టిగొట్టిన ప్రభుత్వం?!

   2 hours ago


బీజేపీని పక్కనపెట్టి పవన్ సొంతగా జిల్లాల పర్యటన?!

బీజేపీని పక్కనపెట్టి పవన్ సొంతగా జిల్లాల పర్యటన?!

   3 hours ago


గాలివాటంగానే మూడు సార్లు బాబు సీఎం : విజ‌య‌సాయిరెడ్డి

గాలివాటంగానే మూడు సార్లు బాబు సీఎం : విజ‌య‌సాయిరెడ్డి

   3 hours ago


ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఇంకాస్త టెన్షన్..!

ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఇంకాస్త టెన్షన్..!

   3 hours ago


మంత్రి పువ్వాడ కాన్వాయ్ ధ్వంసం

మంత్రి పువ్వాడ కాన్వాయ్ ధ్వంసం

   4 hours ago


వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రెండు, మూడు అసెంబ్లీ సీట్లు రావంటున్న ఏపీ సియం

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రెండు, మూడు అసెంబ్లీ సీట్లు రావంటున్న ఏపీ సియం

   4 hours ago


ఓల్డ్ మలక్ పేటలో ఏమి జరిగింది.. రేపే రీపోలింగ్

ఓల్డ్ మలక్ పేటలో ఏమి జరిగింది.. రేపే రీపోలింగ్

   5 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle