మేమూ నచ్చకపోతే నోటాకు వెయ్యండి. ఓటు మాత్రం వేయండి.. కేటీఆర్
29-11-202029-11-2020 10:50:37 IST
2020-11-29T05:20:37.999Z29-11-2020 2020-11-29T05:20:31.515Z - - 21-01-2021

సగటు ప్రజానీకం ఓటు విలువను గుర్తించి ప్రతి ఎన్నికలోనూ తమ ఓటును తప్పనిసరిగా వేస్తుంటే చదువుకున్న వాళ్లు ట్వీట్లు చేస్తారు కానీ ఓట్లు మాత్రం వేయకపోవడం శోచనీయమని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ రోజైన డిసెంబర్ 1న విద్యావంతులు కాస్సేపు ఫేస్బుక్ లో కామెంట్లు కాస్త ఆపి పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటేయండి. టీఆర్ఎస్కు నచ్చకపోతే నోటాకు అయినా వేయండి అంటూ కేటీఆర్ సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉద్యోగులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఈ విషయంలో కుటుంబసభ్యులను, స్నేహితులను ప్రోత్సహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం వివిధ పారిశ్రామిక సంఘాల ఆధ్వర్యంలో మాదాపూర్ హెచ్ఐసీసీలో.. బేగంపేటలోని రెండు హోటళ్లలో నిర్వహించిన సదస్సుల్లో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘బీజేపీ నేత బండి సంజయ్ సర్జికల్ స్ట్రయిక్ అంటరు.. మజ్లిస్ నేత అక్బరుద్దీన్ కూల్చేయండి అంటరు. ఇద్దరూ పిచ్చోళ్లే. వీరికి జీహెచ్ఎంసీ పీఠం ఇవ్వడం అంటే పిచ్చోడి చేతికి రాయివ్వటమే. సర్జికల్ స్ట్రయిక్ చేయడానికి హైదరాబాద్ ఏమైనా శత్రుదేశమా అని కేటీఆర్ ప్రశ్నించారు. మజ్లిస్, బీజేపీని గెలిపిస్తే గతంలో మాదిరిగా హైదరాబాద్ కర్ఫ్యూల నగరంగా మారుతుందని, ప్రశాంతంగా ఉంటున్న హిందు, ముస్లిం ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. గత ఆరేళ్లలో వేలకోట్లతో నగరంలో అభివృద్ధి చేపట్టామని, ఇది కొనసాగాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే పట్టం కట్టబెట్టాలని కేటీఆర్ కోరారు. ప్రచారానికి కేంద్ర మం త్రులు వస్తున్నారు. యూపీ సీఎం యోగి వచ్చారు. ఇక్కడ ఇరానీ చాయ్ అదిరిపోతుంది. బిర్యానీ బ్రహ్మాండంగా ఉంటుంది. బిర్యానీ తిని, చాయ్ తాగి వెళ్లండి. కానీ ప్రజల మధ్య విద్వేషాలు పెంచొద్దు. భావోద్వేగాలు రెచ్చగొట్టద్దు అని కేటీఆర్ సూచించారు.. వరదలొస్తే నీట మునగని నగరాలు ఉన్నాయా? ముంబై, చెన్నై, బెంగళూరు, పట్నాలో అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉంటోంది.. పట్నాలో వరదలొచ్చినప్పుడు బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీని పడవలో తీసుకురలేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. నగరంలో మజ్లిస్, బీజేపీలు అలజడులు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని.. ఇది తమ పార్టీ వాళ్లకూ వర్తిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ మాత్రం కుటుంబ రాజకీయాలకు అతీతమా.. కుటుంబ పార్టీ అని టీఆర్ఎస్ను కేంద్రమంత్రులు విమర్శిస్తున్నారని, బీజేపీ మాత్రం కుటుంబ రాజకీయాలకు అతీతమా అని కేటీఆర్ ప్రశ్నించారు. కర్ణాటకలో యాడ్యురప్ప కుమారుడు, రాజస్థాన్‌లో వసుందర రాజే, దుష్యంత్, మధ్యప్రదేశ్‌లో విజయరాజే, యశోధరా, జ్యోతిరాదిత్య, ఢిల్లీలో మేనక గాంధీ, వరుణ్ గాంధీ లేరా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి కుటుంబం లేదు కాబట్టి ఆయనది వేరే విషయం అని వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఇది చదవండి: కేసీఆర్ మాయాజాలం..జనానికి పూనకం

ఎన్నికలకు సహకరిస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం..!
an hour ago

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఠాకూర్.. షాక్ లో ప్రతిపక్షాలు
37 minutes ago

రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించిన వైఎస్ జగన్
2 hours ago

జగన్ సర్కార్ కి మరో దెబ్బ.. ఎన్నికలు జరపాలని చెప్పిన హై కోర్టు
2 hours ago

రేవంత్ రెడ్డి, రఘువీర్ రెడ్డి.. జానారెడ్డి గెలుపుకి బాధ్యులు అవుతారా?
an hour ago

బెదిరింపులకు ఆయుధంగా మారిన అట్రాసిటీ కేసులు.. హైకోర్టు అక్షింతలు
3 hours ago

భారతీ సిమెంట్ మీద మమకారం.. వందల కోట్ల ప్రభుత్వ నిధుల చెల్లింపు
3 hours ago

ఆ ఒక్క మాట.. రెండు కులాల మధ్య చిచ్చు.. ప్రభుత్వానికి తప్పని చికాకు
5 hours ago

పల్నాడులో టీడీపీ నేత అంకులును చంపింది వీరే
5 hours ago

విడుదలైన కళా వెంకట్రావు
5 hours ago
ఇంకా